సెయింట్ జాన్ చర్చి, హైదరాబాదు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సెయింట్ జాన్ చర్చి
మతం
Ecclesiastical or organizational statusబసిలికా
ప్రదేశం
ప్రదేశంఈస్ట్ మారేడుపల్లి, సికిందరాబాదు, తెలంగాణ
దేశంభారతదేశం

సెయింట్ జాన్ చర్చి ఈస్ట్ మారేడుపల్లిలో ఉన్న క్రైస్తవ ప్రార్థనామందిరం. సెయింట్ జాన్ ది బాపిస్టు అనే వ్యక్తి పేరుమీద 1813లో నిర్మించిన ఈ చర్చి, సికిందరాబాదు ప్రాంతంలో ఉన్న పురాతన చర్చీల్లో ఒకటిగా పేరొందింది.[1][2] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.

చరిత్ర

[మార్చు]

బ్రిటీషుకాలంలో సికిందరాబాదు ప్రాంతంలో ఉన్న మిలటరీ సైనికాధికారులకోసం ఈ చర్చి ఏర్పాటు చేయబడింది. సికిందరాబాదుకు చెందిన దివాన్ బహదూర్ సేఠ్ రామ్ గోపాల్ అనే వ్యక్తి ఈ చర్చి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించాడని స్థానికుల అభిప్రాయంతోపాటు, అక్కడి శిలాఫలకాల ద్వారా కూడా తెలుస్తుంది.[3] దీని నిర్వహణకోసం లండన్ నుండి చర్చి పెద్దలను నియమించేవారు. కంటోన్మెంట్ ప్రాంతంలో ఉంటున్న బ్రిటీషు సైనికాధికారులను మాత్రమే చర్చిలోకి అనుమతించేవారు. చాలాకాలం వరకు విదేశి క్రైస్తవులే పరిమిత సంఖ్యలో ప్రవేశం ఉండేది.[4]

నిర్మాణం

[మార్చు]

క్రీస్తు శిలువ ఆకారంలో ఉన్న ఈ చర్చి, ఇండో-యూరోపియన్ శైలీలో నిర్మించబడింది.[5] చర్చీ లోపల రంగూన్ టేకుతో చేసిన దాదాపు 30 అడుగుల పొడవుగల బెంచీలు, ఇతర సామాగ్రి ఉన్నాయి.

వారసత్వ సంపదగా గుర్తింపు

[మార్చు]

1914 సంవత్సరం వరకు ఈ చర్చికి విద్యుత్ సౌకర్యం లేదు. 1918లో ఎలక్ట్రిక్ లైట్లు, ఫ్యానులు ఏర్పాటుచేయబడ్డాయి. పురాతన సాంప్రదాయ నిర్మాణాలకు నిదర్శనంగా నిలుస్తున్న ఈ చర్చి 1998లో వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 The Hindu (9 February 2013). "St. John's Church turns 200". Retrieved 17 March 2019.
  2. సెయింట్ ఆన్ చర్చి,ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 41
  3. Times of India, Hyderabad News (11 February 2013). "St John's Church left with". Nikhila Henry. Retrieved 17 March 2019.
  4. సాక్షి, ఫీచర్స్ (25 December 2014). "క్రిస్టియన్ మిషనరీలు 100 plus". మల్లాది కృష్ణానంద్. Archived from the original on 26 March 2019. Retrieved 26 March 2019.
  5. Deccan Chronicle (23 December 2016). "Telangana churches rich in history". CR Gowri Shankar. Retrieved 17 March 2019.