Jump to content

సెయింట్ జోసఫ్స్ కేథడ్రల్ చర్చి, హైదరాబాదు

అక్షాంశ రేఖాంశాలు: 17°23′35″N 78°28′23″E / 17.393°N 78.473°E / 17.393; 78.473
వికీపీడియా నుండి
సెయింట్ జోసఫ్స్ కేథడ్రల్ చర్చి
దస్త్రం:Stjosephscathedralhyderabad.png
ప్రదేశం
ప్రదేశంగన్‌ఫౌండ్రి, హైదరాబాదు , తెలంగాణ
దేశంభారతదేశం
భౌగోళిక అంశాలు17°23′35″N 78°28′23″E / 17.393°N 78.473°E / 17.393; 78.473

సెయింట్ జోసఫ్స్ కేథడ్రల్ చర్చి హైదరాబాదులోని గన్‌ఫౌండ్రి ప్రాంతంలో ఉన్న క్రైస్తవ ప్రార్థనామందిరం.[1] ఎత్తైన రాతి కొండలాంటి ప్రదేశంలో నిర్మించిన ఈ చర్చి 1875లో క్రిస్మస్ పండుగనాడు ప్రారంభించబడింది.[2] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.

చరిత్ర

[మార్చు]

నిజాం నవాబుల కాలంలో నవాబ్ ఆస్మాన్ జా సహకారంతో ఆనాటి క్రైస్తవ మత పెద్ద డోమినిక్ బార్‌బెరో ఆధ్వర్యంలో ఈ చర్చి నిర్మాణం జరిగింది. దీనికి సంబంధించిన శిలాఫలకం ఒకటి చర్చి ముందరిభాగంలో ఉంది. మరో మత పెద్ద పీటర్ కప్రోటీ నేతృత్వంలో 1870, మార్చి 19న ఈ చర్చికి శంకుస్థాపన చేశారు. 1872లో స్థానిక క్రైస్తవుల సహాయంతో ఫాదర్ ఎల్. మల్‌బెర్టీ చర్చి యొక్క ప్రధాన భవనాలను పూర్తిచేసి 1875లో క్రిస్మస్ పండుగ నాడు ప్రారంభించారు.

నిర్మాణం

[మార్చు]

ఎత్తైన రాతికొండ మీద శిలువ ఆకారంలో ఇది నిర్మించబడింది. చర్చికి ఉన్న శిఖరాల నిర్మాణానికి 16 సంవత్సరాలు పట్టింది. చర్చికోసం 1892లో ఇటలీ నుంచి అతిపెద్దసైజులో ఉండే గంటలు, రంగురంగుల పెయింటింగ్స్ తెప్పించారు. చర్చిలో గంటకొడితే సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ దాకా వినబడేదని చెబుతారు. ఏడో నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తరచూ ఈ చర్చికి వచ్చి, ఇక్కడ ఉన్న టవర్‌లలో అమర్చినవున్న గోడ గడియారాన్ని, తైలవర్ణ చిత్రాలు, పెద్దపెద్ద టేబుల్స్ వంటి ఇతర ఫర్నిచర్‌ను ఉచితంగా చర్చికి ఇచ్చారట.

ఇతర వివరాలు

[మార్చు]
  1. 1886లో తొలి బిషప్‌గా మత పెద్ద కప్రోటీ నియమించబడ్డాడు.
  2. క్రేనులు, ఎలాంటి ఆధునిక యంత్రాలను ఉపయోగించకుండా చాలా బరువున్న గంటలను ఎత్తైన టవర్లపై పెట్టడం అద్బుతం.

మూలాలు

[మార్చు]
  1. సెయింట్ జార్జి చర్చి,ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 43
  2. సాక్షి, ఫీచర్స్ (25 December 2014). "క్రిస్టియన్ మిషనరీలు 100 plus". మల్లాది కృష్ణానంద్. Archived from the original on 26 March 2019. Retrieved 26 March 2019.

ఇతర లంకెలు

[మార్చు]