సెయింట్ మేరీస్ చర్చి
బాసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది అస్సంప్షన్ | |
---|---|
మతం | |
Ecclesiastical or organizational status | బసిలికా |
ప్రదేశం | |
ప్రదేశం | సికిందరాబాదు, తెలంగాణ |
దేశం | భారతదేశం |
భౌగోళిక అంశాలు | 17°26′32″N 78°30′08″E / 17.4421°N 78.5022°E |
సెయింట్ మేరీస్ చర్చిగా పిలువబడే బసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది అస్సంప్షన్ సికిందరాబాదులో నెలకొన్న క్రైస్తవ ప్రార్థనామందిరం. ఈ చర్చి 2008 నవంబరు 7వ తేదీన బసిలికా స్థాయిని పొందింది. ఈ చర్చి సికిందరాబాదు సరోజినీదేవి రోడ్డులో ఉంది. 1850లో ఈ చర్చి నిర్మాణం పూర్తి అయ్యింది. మొదట ఈ చర్చిని కాథడ్రల్ ఆఫ్ ఆర్కిడయోసిస్ ఆఫ్ హైదరాబాద్ అని పిలిచేవారు.[1] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.
చరిత్ర
[మార్చు]ఈ చర్చిని బ్రిటిష్ ఆర్మీలోని ఐరిష్ కాథలిక్కుల కోసం ఫాదర్ డేనియల్ మర్ఫీ ప్రారంభించాడు.[2]అతడు 1839లో భారతదేశానికి వచ్చి ఈ చర్చిని 1840లో నిర్మించడం ఆరంభించాడు. ఈ చర్చి నిర్మాణం 1850లో పూర్తి అయింది. మేరీ మాతకు అంకితం చేయబడిన ఈ చర్చి హైదరాబాద్ స్టేట్ లో ఆ సమయంలో అతి పెద్దదిగా పేరుగడించింది.[2] ఇది 1886 వరకు కాథడ్రల్ చర్చిగా ఉన్నది. 1871లో ఇటలీ దేశపు టురిన్ పట్టణం నుండి వచ్చిన క్రైస్తవ సన్యాసినులు ఇక్కడ ఈ చర్చికి అనుబంధంగా సెయింట్ ఆన్స్ హైస్కూలును ప్రారంభించారు. ఈ చర్చి 2008 నవంబరు 7వ తేదీన 'బసిలికా' గుర్తింపు పొందింది.
వాస్తు శైలి
[మార్చు]భారతీయ గోతిక్ వాస్తు శైలికి ఒక ఉదాహరణగా ఈ చర్చి భవనం నిలుస్తుంది. వొంపైన కమానులతో, మొనదీరిన అంటుగోడలతో ఈ చర్చి చూపరులను ఆకర్షిస్తుంది. మిగిలిన కాథలిక్ రోమన్ చర్చిలవలె ఈ చర్చి కూడా అనేక సెయింట్‌ల పేరు మీద దైవపీఠాలు ఉన్నాయి.
గంటలు
[మార్చు]ఈ చర్చిలో 1901లో ఇటలీ దేశం నుండి తెప్పించబడిన నాలుగు గంటలు ఉన్నాయి.[3] వాటిలో ఒక గంటకు పగుళ్లు వచ్చాయి.[3]
ఇవి కూడా చూడండి
[మార్చు]ప్రార్థనా సమావేశాలు
[మార్చు]ప్రతి దినము సమావేశం ఇంగ్లీషులో ఉదయం 6.గం. సాయంత్రం 6. గం. ఆదివారం సమావేశాలు:
- ఉదయం 6 గం - తమిళం
- ఉదయం 7 గం - ఇంగ్లీషు
- ఉదయం 8 గం 15 ని - తెలుగు
- ఉదయం 9 గం 15 ని - బాలబాలికల సమావేశం
- ఉదయం 9 గం 30 ని - ఇంగ్లీషు
- ఉదయం 11 గం 30 ని -ఇంగ్లీషు
- సాయంత్రం 5 గం - ఇంగ్లీషు
- సాయంత్రం 6 గం - ఇంగ్లీషు
మూలాలు
[మార్చు]- ↑ సాక్షి, ఫీచర్స్ (25 December 2014). "క్రిస్టియన్ మిషనరీలు 100 plus". మల్లాది కృష్ణానంద్. Archived from the original on 26 March 2019. Retrieved 26 March 2019.
- ↑ 2.0 2.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 16 జూలై 2011. Retrieved 25 డిసెంబరు 2017.
- ↑ 3.0 3.1 "The Hindu : Entertainment Hyderabad / Heritage : Sound of history". Hinduonnet.com. 2005-07-08. Archived from the original on 2008-04-17. Retrieved 2013-11-19.