సేతురామన్ పంచనాథన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సేతురామన్ పంచనాథన్
పంచనాథన్
నేషనల్ సైన్స్ ఫౌండేషన్ కి 15వ డైరెక్టర్
Assumed office
జూన్ 23, 2020
అధ్యక్షుడుడొనాల్డ్ ట్రంప్
జో బైడెన్
అంతకు ముందు వారుకెల్విన్ డ్రోగేమీర్
ఫ్రాన్స్ ఎ. కోర్డోవా
వ్యక్తిగత వివరాలు
జననంచెన్నై, భారతదేశం
జీవిత భాగస్వామిసౌమ్య పంచనాథన్
చదువు
  • మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ
  • యూనివర్సిటీ ఆఫ్ ఒట్టావా నుండి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ
సేతురామన్ పంచనాథన్
రంగములుఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
కంప్యూటర్ ఇంజనీరింగ్
ఇన్ఫర్మేటిక్స్
వృత్తిసంస్థలుఒట్టావా విశ్వవిద్యాలయం
అరిజోనా స్టేట్ యూనివర్శిటీ
పరిశోధనా సలహాదారుడు(లు)మోరిస్ గోల్డ్‌బెర్గ్

సేతురామన్ పంచనాథన్ భారతీయ-అమెరికన్ కంప్యూటర్ సైంటిస్ట్, అకాడమిక్ అడ్మినిస్ట్రేటర్. ఇతను జూన్ 2020 నుండి నేషనల్ సైన్స్ ఫౌండేషన్ కి 15వ డైరెక్టర్ గా ఉన్నాడు.[1] సేతురామన్ గతంలో అరిజోనా స్టేట్‌ విశ్వవిద్యాలయంలో నాలెడ్జ్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ అండ్ చీఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేశాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

పంచనాథన్ చెన్నైలో పుట్టి పెరిగాడు.[2] ఇతను 1981లో వివేకానంద కళాశాలలో (మద్రాస్ విశ్వవిద్యాలయం) బిఎస్సి చదివాడు. తరువాత బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి ఎలక్ట్రానిక్స్, 1986లో మద్రాసులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ పూర్తి చేశాడు. ఇతను కెనడాలోని ఒట్టావా విశ్వవిద్యాలయంలో డాక్టరల్ ప్రోగ్రామ్‌లో చేరి పి.హెచ్.డి చేసాడు. 1989లో ఒట్టావా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరి, 1994లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందాడు. పంచనాథన్ 1997లో ఆరిజోనా స్టేట్ యూనివర్సిటి లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా చేరాడు.[3] ఇతను సెంటర్ ఫర్ కాగ్నిటివ్ యుబిక్విటస్ కంప్యూటింగ్ ని స్థాపించి వైకల్యాలున్న వ్యక్తులకు సహాయం చేయడానికి సాంకేతికతలు, పరికరాల రూపకల్పనపై దృష్టి సారించాడు. ఇతను స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ అండ్ ఇన్ఫర్మేటిక్స్ (2006-2009), డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోమెడికల్ ఇన్ఫర్మేటిక్స్ (2005-2007) ని కూడా స్థాపించాడు. జూన్ 13, 2014న, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇతన్ని నేషనల్ సైన్స్ బోర్డ్ ఆఫ్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ సభ్యునిగా నామినేట్ చేశాడు.[4] డిసెంబర్ 19, 2019న, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డైరెక్టర్‌గా ఫ్రాన్స్ కోర్డోవా స్థానంలో పంచనాథన్‌ను నామినేట్ చేసాడు.[5] జూన్ 18, 2020న, ఇతను నేషనల్ సైన్స్ ఫౌండేషన్ కి కొత్త డైరెక్టర్‌గా యుఎస్ సెనేట్ ద్వారా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు, జూన్ 23, 2020న పదవీ బాధ్యతలు స్వీకరించాడు.[6]

ఇతర విషయాలు[మార్చు]

  • అరిజోనా గవర్నర్ డౌగ్ డ్యూసీకి సైన్స్ అండ్ టెక్నాలజీ సలహాదారుగా పనిచేసాడు.
  • ఓక్ రిడ్జ్ అసోసియేటెడ్ యూనివర్సిటీస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒకరిగా 2018లో నియమించబడ్డాడు.
  • డ్వాన్సింగ్ ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, వర్క్‌ఫోర్స్ డెవలప్‌మెంట్, ఎకనామిక్ డెవలప్‌మెంట్, గ్లోబల్ కాంపిటీటివ్‌నెస్ సెక్రటరీకి 2012–2016లో సలహాదారునిగా పనిచేసాడు.
  • 2014 లో యుఎస్ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇతన్ని నేషనల్ సైన్స్ బోర్డ్ (NSB) కి ఆరేళ్ల కాలానికి నియమించాడు.

మూలాలు[మార్చు]

  1. "New director takes helm at National Science Foundation". www.nsf.gov. Retrieved 2022-03-18.
  2. "Leader of AI breakthroughs, champion of innovation and inclusivity". Beta site for NSF - National Science Foundation. Retrieved 2022-03-18.
  3. "Sethuraman "Panch" Panchanathan | ASU News". web.archive.org. 2014-02-02. Archived from the original on 2014-02-02. Retrieved 2022-03-18.
  4. "Obama names IITian Sethuraman Panchanathan to Science Foundation board". Biharprabha News | Connecting Bihar with the entire World. Retrieved 2022-03-18.
  5. "President Donald J. Trump Announces Intent to Nominate Individual to Key Administration Post – The White House". trumpwhitehouse.archives.gov. Retrieved 2022-03-18.
  6. "APLU Applauds Confirmation of Sethuraman Panchanathan as Director of the National Science Foundation". www.aplu.org. Retrieved 2022-03-18.