సైక్లోస్టొమేటా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సైక్లోస్టొమేటా
Temporal range: 430–0 Ma
Silurian - Recent
Havsnejonöga.jpg
స్వీడన్ లోని సముద్ర లాంప్రే
Scientific classification
Kingdom:
Phylum:
Subphylum:
Class:
సైక్లోస్టొమేటా

Duméril, 1806
ఉపతరగతులు

సైక్లోస్టొమేటా (Cyclostomata) కార్డేటా వర్గానికి చెందిన జీవులు. వీనిలో కొన్ని దవడలు లేని చేపలు ఉన్నాయి. ఇవి : లాంప్రేలు (Lampreys) మరియు హాగ్ చేపలు (Hagfishes). వీనికి గుండ్రని నోటిలో దవడలు లేకుండా ముడుచుకోవలిగే దంతాలు ఉంటాయి. అందువలన వీని నోరు ఎల్లప్పుడు తెరుచుకొనే ఉండి నీటిని బయటినుండి లోపలికి నిరంతరంగా తీసుకొంటుంది. సైక్లోస్టొమేటా అనగా గుండ్రని నోరు అని అర్ధం.[1][2]

సాధారణ లక్షణాలు[మార్చు]

 • శరీరము ఈల్ వలె పొడవుగా ఉంటుంది. చర్మము మెత్తగా, నునుపుగా ఉంటుంది.
 • బాహ్య అస్థిపంజరము (పొలుసులు) ఉండదు. మృదులాస్థి నిర్మితమైన అంతరస్థిపంజరము ఉంటుంది.
 • ద్వంద్వవాజాలు ఉండవు. మృదులాస్థితో ఏర్పడిన మధ్యవాజాలు ఉంటాయి.
 • శరీరము మొండెము మరియు తోక అను భాగాలుగా విభక్తమై ఉండును.
 • పూర్వాంత ఉదరతలంలో నోరు గుండ్రంగా, చూషకాయుతమై ఉంటుంది. అందువలనే సైక్లోస్టొమేటా అను పేరు వచ్చింది. దౌడలు లోపించి ఉంటాయి (ఏగ్నాథా).
 • జీర్ణవ్యవస్థలో జీర్ణాశయము లోపించి, ఆంత్రవళిని కలిగిన పేగుతో కూడు ఉండును. క్లోమము మరియు ప్లీహము ఉండవు.
 • ఆస్యకుహరములో కండరయుతమైన, బాహ్యచర్మము నుండి ఏర్పడిన దంతాలతో కూడిన నాలుక ఉంటుంది.
 • శ్వాసాంగాలైన 5-16 జతల మొప్పలు ఉంటాయి. మొప్ప కోష్టకాలను మార్సిపోబ్రాంక్ లు అని అంటారు.
 • పుష్టభాగంలో మధ్యన ఒక నాసికారంధ్రమూంటుంది.
 • లోపలి చెవిలో 1-2 అర్ధవర్తులాకార కుల్యలు ఉంటాయి.
 • గుండె రెండు గదులుగా విభక్తమై ఒక కర్ణిక మరియు ఒక జఠరిక లను కలిగివుంటాయి.
 • ఇవి శీతల రక్త జంతువులు. రక్తములో తెల్ల రక్తకణాలు మరియు కేంద్రక సహిత ఎర్ర రక్తకణాలు ఉంటాయి.
 • జీవితాంతము పృష్టవంశమును కల్గివుంటుంది. నిర్ధిష్టమైన మెదడు ఉంటుంది. 8-10 జతల కపాల నాడులు ఉంటాయి.
 • విసర్జక క్రియ ఒక జత మధ్యవృక్క రకానికి చెందిన మూత్రపిండాల వలన జరుగుతుంది.
 • ఏకలింగ లేదా ఉభయలింగ జీవులు. బీజవాహిక లోపించిన ఒక పెద్ద బీజకోశము ఉంటుంది.
 • ఫలదీకరణము బాహ్యంగా జరుగుతుంది. డింభకదశ సుదీర్ఘంగా ఉంటుంది.
 • సంతానోత్పత్తి కాలంలో సముద్రాలలోనుండి నదులలోకి వలస పోతాయి.

మూలాలు[మార్చు]

 1. Kuraku, Shigehiro, Ota, Kinya G., & Kuratani, Shigeru, S. Blair (2009b). "Jawless fishes (Cyclostomata)". In S.B. Hedges & S. Kumar (సంపాదకులు.). Timetree of Life. oxford University Press. pp. 317–319. ISBN 978-0-19-953503-3.CS1 maint: multiple names: authors list (link) CS1 maint: uses editors parameter (link)
 2. Duméril, A.M. Constant (1806). Zoologie analytique, ou me´thode naturelle de classification des animaux, Rendue plus facile a l'Aide de Tableaux Synoptiques. Paris: Allais.