Coordinates: 34°20′N 75°20′E / 34.33°N 75.33°E / 34.33; 75.33

సోనామార్గ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సోనామార్గ్
సోనామరాగ్
సోన్మార్గ్
హిల్ స్టేషన్
ఉత్తర సోనామార్గ్ 2017లో తీసిన ఫోటో
ఉత్తర సోనామార్గ్ 2017లో తీసిన ఫోటో
Location map of Sonamarg in India
Location map of Sonamarg in India
సోనామార్గ్
Location map of Sonamarg in India
Location map of Sonamarg in India
సోనామార్గ్
Coordinates: 34°20′N 75°20′E / 34.33°N 75.33°E / 34.33; 75.33
Country India
కేంద్రపాలిత ప్రాంతంజమ్మూ కాశ్మీర్
జమ్మూ కాశ్మీర్ జిల్లాల జాబితాగందర్బల్
Elevation
2,730 మీ (8,960 అ.)
Population
 • Total392
Languages
 • Officialకాశ్మీరీ భాష, ఉర్దూ, హిందీ, డోగ్రీ భాష, ఇంగ్లీష్[1][2]
 • Spokenపహారీ, గుజారి, షీనా భాష, బాల్టి భాష, ఫుస్తు
Time zoneUTC+5:30 (IST)
PIN
191202
Telephone code+91-1942417-
Vehicle registrationJK16

సోనామార్గ్ భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని గందర్బల్ జిల్లాలో ఉన్న ఒక హిల్ స్టేషన్. దీనిని "మెడో ఆఫ్ గోల్డ్" అని కూడా అంటారు.[3] సోనామార్గ్ కాశ్మీర్‌ను టిబెట్‌తో కలుపుతూ పురాతన సిల్క్ రోడ్‌లో గేట్‌వేగా చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది జమ్మూ కాశ్మీర్‌లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం.

భౌగోళికం[మార్చు]

ఇది కాశ్మీర్ లోయలో 2,730 మీటర్లు (8,960 అడుగులు) ఎత్తులో ఉంది, మచోయ్ హిమానీనదం, సిర్బల్ శిఖరం, కొలహోయ్ శిఖరం, అమర్‌నాథ్ శిఖరం, మచోయ్ శిఖరంతో పాటు లోయలోని కొన్ని ఎత్తైన శిఖరాలకు ఇది దగ్గరగా ఉంది. ఇది ఆల్పైన్ పచ్చికభూములతో కప్పబడి ఉంది.

జనాభా పంపిణీ[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం, సోనామార్గ్ పట్టణంలో 122 నివాసాలు ఉన్నాయి, మొత్తం జనాభా 1,051. వారిలో 579 మంది పురుషులు, స్త్రీలు 472 మంది ఉన్నారు. ఇక్కడ సగటు అక్షరాస్యత 53.40%.  ఇక్కడ జనాభాలో 95% కంటే ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు.

వాతావరణం[మార్చు]

సోనామార్గ్ ఎత్తైన ప్రదేశం, పర్వత భూభాగం కారణంగా, ఇక్కడ తేమతో కూడిన ఖండాంతర వాతావరణం ఉంటుంది. సోనామార్గ్‌లో సగటు ఉష్ణోగ్రత 6.5 °C (43.7 °F), దాదాపు 932 మీమీ అవపాతం ఏటా కురుస్తుంది.

పర్యాటకం[మార్చు]

హిమాలయాలలోని విషన్సర్ సరస్సు, క్రిషన్సర్ సరస్సు, గంగాబాల్ సరస్సు, గడ్సర్ సరస్సులకు వెళ్లే ట్రెక్కింగ్ మార్గాలు ఇక్కడి నుండే ప్రారంభమవుతాయి. వేసవిలో థాజివాస్ హిమానీనదం వరకు వెళ్లడానికి గుర్రాలను ఇక్కడ అద్దెకు తీసుకుంటారు. సోనామార్గ్ నుండి 15 కి.మీ దూరంలో పల్తాల్ అని పిలువబడే అమర్నాథ్ ఆలయ బేస్ క్యాంప్ ఉంది. బాల్తాల్, సోనామార్గ్‌కు తూర్పున 15 కి.మీ దూరంలో జోజి లా పాస్ పాదాల వద్ద ఉన్న ఒక లోయ. ట్రెక్కర్లు జోజి లా మీదుగా "ప్రపంచం యొక్క పైకప్పు" అని పిలువబడే లేహ్ నగరాన్ని కూడా ఇక్కడి నుండి చేరుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్ పర్యాటక శాఖ ఏడాది పొడవునా రివర్ రాఫ్టింగ్ టోర్నమెంట్‌లను సోనామార్గ్‌లో నిర్వహిస్తుంది, ఇందులో విదేశాల నుండి కూడ జట్లు పాల్గొంటాయి.

రవాణా[మార్చు]

జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర రాజధాని శ్రీనగర్ నుండి 87 కి.మీ దూరంలో ఉన్న సోనామార్గ్ కి జాతీయ రహదారి 1డి ద్వారా మూడు గంటల ప్రయాణంలో చేరుకోవచ్చు.[4]

మూలాలు[మార్చు]

  1. "The Jammu and Kashmir Official Languages Act, 2020" (PDF). The Gazette of India. 27 September 2020. Retrieved 27 September 2020.
  2. "Parliament passes JK Official Languages Bill, 2020". Rising Kashmir. 23 September 2020. Archived from the original on 24 సెప్టెంబర్ 2020. Retrieved 23 September 2020. {{cite news}}: Check date values in: |archive-date= (help)
  3. "Sonamarg | District Ganderbal, Government of Jammu and Kashmir | India". Retrieved 2023-06-19.
  4. "2 SDA staff among 9 rescued from snow-hit Sonamarg - Hindustan Times". web.archive.org. 2013-06-17. Archived from the original on 2013-06-17. Retrieved 2023-06-19.