సోమరాజు ఇందుమతీదేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సోమరాజు ఇందుమతీదేవి ఖమ్మం జిల్లాకు చెందిన కవయిత్రి. ఈమె రచయిత సోమరాజు రామానుజరావు బంధువు. ఈమె ఖమ్మం జిల్లా (పూర్వపు వరంగల్లు జిల్లా), మధిర సమీపంలోని అమ్మపాలెంలో జన్మించింది. ఈమె తండ్రి రుద్రాక్షపల్లిలో జమీందారీ వంశీకులైన కాళ్ళూరి జోగారావు. తల్లి లక్ష్మీనరసమ్మ. ఈమె అన్న కాళ్ళూరి గోపాలరావు కూడా కవి. ఈమె చిన్నతనంలోనే సంస్కృతాంధ్రాలను అభ్యసించింది. ఈమె సోమరాజు రంగారావును వివాహం చేసుకుంది.

ఒక స్త్రీ 1930 ప్రాంతాలలో ప్రణయ కవిత్వం వ్రాయడం విశేషం. ఒకవైపు భర్తను, మరోవైపు దేవుడినీ కొలుస్తూ శ్లేషతో పద్యాలను అల్లింది. కొత్తగా పెళ్ళయి అత్తవారింటికి వచ్చిన స్త్రీ ఎదుర్కొనే అనుభవాలు, మరదలి ఆటపట్టింపులు, పతిభక్తి మొదలైన అంశాలను తన కవిత్వంలో చొప్పించింది. ఈమె భావ/ప్రణయ కవిత్వాన్ని విశ్వనాథ సత్యనారాయణ, చిలకమర్తి లక్ష్మీనరసింహారావు, పింగళి లక్ష్మీకాంతం, చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, మల్లాది సూర్యనారాయణశాస్త్రి, వఝల చినసీతారామస్వామిశాస్త్రి, శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి, వేటూరి ప్రభాకరశాస్త్రి తదితరులు ప్రశంసించారు.[1]

రచనలు[మార్చు]

  1. వేణుగోపాల శతకము
  2. కావ్యాంజలి
  3. శకుంతలా పరిణయము
  4. పతిభక్తి
  5. శ్రీరంగనాథ స్తుతి
  6. గౌరి
  7. కావ్యావళి (ఇదే గ్రంథం సంగిశెట్టి శ్రీనివాస్ సంపాదకత్వంలో ఇందుమతి కవిత్వం పేరుతో తిరిగి 2017లో ముద్రింపబడింది[2].)

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. సంగిశెట్టి శ్రీనివాస్ (సంపాదకుడు) (1 December 2017). ఇందుమతి కవిత్వం. హైదరాబాదు: తెలంగాణ ప్రచురణలు. pp. 6–17.
  2. సంచిక టీమ్‌. "ఇందుమతి కవిత్వం - పుస్తక పరిచయం". సంచిక సాహిత్య వేదిక. Archived from the original on 20 మార్చి 2020. Retrieved 20 March 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  • గోలకొండకవుల సంచిక, పేజీ 372