సోలనిడిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సోలనిడిన్ అణు సౌష్టవం

సోలనిడిన్ (Solanidine) అనేది ఒక స్ఫటికాకార స్టెరాయిడ్ ఆల్కలాయిడ్C27H43NO అనేది ప్రత్యేకంగా సోలనిన్ యొక్క జలవిశ్లేషణ ద్వారా పొందబడుతుంది మరియుసొలనేసి మొక్క లలో సహజంగా కూడా సంభవిస్తుంది.[1]సోలనిడిన్ సొలనేషియన్ కుటుంబ మొక్కలైన టమాటో (లైకోపెర్సికాన్ ఎస్కులెన్టున్), బంగాళదుంప(సోలనమ్ ట్యూబెరోసమ్) మరియు వంకాయ (సోలనమ్ మెలోంగెనా ఎస్కులెంటమ్)లలో లభిస్తుంది. సోలనేసియస్ కుంటుంబానికి చెందిన మొక్కల సమూహాలు సోలనేషియస్ గ్లైకోఅల్కలాయిడ్స్, α-చాకోనిన్ మరియు α-సోలనైన్‌లను కలిగి ఉంటాయి.ఇవి సోలనిడిన్ (కొలెస్ట్రాల్ నుండి ఏర్పడిన స్టెరాయిడ్ ఆల్కలాయిడ్) యొక్క ట్రైగ్లైకోసైడ్‌లు. సోలానేషియస్ ఆల్కలాయిడ్స్ అనేవి బ్యూటిరిల్కోలినెస్టేరేస్‌ను నిరోధించడం ద్వారా మత్తుమందుల జీవక్రియను మార్చగలవు. కోలినెస్టరేస్ యొక్క నిరోధ ప్రభావం మొదడులొని జ్ఞానంపై కూడా ప్రభావం చూపుతుంది.[2]

సొలనిడిన్ ఏ మొక్కల్లో లభిస్తుంది

[మార్చు]

సోలనిడిన్ అనేది ఒక విషపూరితమైన స్టెరాయిడ్ ఆల్కలాయిడ్ రసాయన సమ్మేళనం. ఇది బంగాళాదుంప మరియు సోలనమ్ అమెరికానమ్ వంటి సోలనేసి కుటుంబానికి చెందిన మొక్కలలో సంభవిస్తుంది.[3]సోలనిడిన్ అనేది బంగాళాదుంప (సోలనమ్ ట్యూబెరోసమ్ L.) గ్లైకోఅల్కలాయిడ్స్ యొక్క స్టెరాయిడ్ అగ్లైకాన్. ఇది హార్మోన్ల సంశ్లేషణకు మరియు ఔషధశాస్త్రపరంగా కొన్ని క్రియాశీల సమ్మేళనాలకు చాలా ముఖ్యమైన పూర్వగామి. గ్లైకోఅల్కలాయిడ్స్ లను మినరల్ యాసిడ్ ద్వారా హైడ్రోలైజ్ చేసిన సోలనిడిన్ ఉత్పత్తి అవుతుంది.[4]సోలనేసి కుటుంబానికి చెందిన మొక్కలలో టమోటాలు, బంగాళదుంపలు మరియు వంకాయలు ఉన్నాయి మరియు గ్లైకోఅల్కలాయిడ్స్ అని పిలువబడే ద్వితీయ జీవక్రియలను ఉత్పత్తి చేస్తాయి. గ్లైకోఅల్కలాయిడ్స్ మొక్క యొక్క ఆకులు, పువ్వులు మరియు మూలాలలో ఉత్పత్తి అవుతాయి.[5]బంగాళదుంపల విషయంలో, అవి మొలకలలో కూడా కనిపిస్తాయి. టొమాటో మొక్కలు గ్లైకోఅల్కలాయిడ్ α-టొమాటైన్‌ను ఉత్పత్తి చేస్తాయి, బంగాళాదుంప మొక్కలు α-చాకోనిన్ మరియు α-సోలనైన్ రెండింటినీ ఉత్పత్తి చేస్తాయి మరియు వంకాయలు α-సోలామార్జిన్ మరియు α-సోలాసోనిన్ రెండింటినీ ఉత్పత్తి చేస్తాయి.[5]

సోలనిడిన్ ను సంగ్రహణం చేసె విధానం

[మార్చు]

సోలనిడిన్ మొక్కల భాగాలనుండి వేరుచెయుటకు పలురకాలైన ద్రావకాలను/ద్రావణులను(solvents) ఉపయోగిస్తారు. మిథనాల్, క్లోరోఫామ్, కార్బన్ టెట్రాక్లోరైడ్ వంటి ద్రావకాలను సొలనిడిన్ ను మొక్కల భాగలనుండి వెలితీతకు ఉపయోగిస్తారు. సోలనిడిన్ ను సాధారణంగా బంగాళదుంప నుండి లేదా దాని మొలకలనుండి ఉత్పత్తి చెస్తారు.[6]. సోలనిడిన్ ఉత్త్పత్తి రెండు డశల్లో చెస్తారు. మొదటి దశలో 10% గాఢత(w/v) వున్న హైడ్రోక్లొరిక్ ఆమ్లాన్ని50% గాధత వున్నమిథనాల్ తో కలిపి న మిశ్రమ సాల్వెంట్ ను ఉపయోగించి సోలనిడిన్ ను వేరుచెస్తారు, తరువాత రెండో దశలో క్లోరోఫాం ను ఉపయోగించి వేరుచెస్తారు. దీనికి 90 నిమిషాల సంగ్రహణ/వెలితీత సమయం అవసరం.[6]. సొలనిడిన్ దిగుబడి 0.24 గ్రా/100 గ్రాముల దుంపలకు వస్తుంది.

సోలనిడిన్ భౌతిక గుణాలు

[మార్చు]

సోలనిడిన్ ఘన స్థితిలొ వుంతుంది.

సోలనిడిన్ యొక్క ఎలెక్ట్రోకెమికల్ ఆక్సీకరణ
లక్షణం/గుణం మితి/విలువ
అణుఫార్ములా C27H43NO
అణుభారం 397.6 గ్రా/మోల్[7]
ద్రవీభవన ఉష్ణొగ్రత 218.5°C[8]
మరుగు ఉష్ణొగ్రత 503.10 °C. @ 760.00 mm Hg (est)C[9]
స్థితి ఘన స్థితి

సోలనిడిన్ ప్రభావం

[మార్చు]
  • సోలనిడిన్, ఒక స్టెరాయిడ్ ఆల్కలాయిడ్ మరియు దాని గ్లైకోసైడ్‌లు మనిషి మరియు జంతువులలో విషప్రభావం కలిగిస్తాయని పరిశోధన నివేదికల్లో నివేదించబడింది.[10]

ఉపయోగాలు

[మార్చు]
  • హార్మోన్ల సంశ్లేషణకు మరియు కొన్ని ఔషధశాస్త్రపరంగా క్రియాశీల సమ్మేళనాలకు సోలనిడిన్ చాలా ముఖ్యమైన పూర్వగామి.
  • సోలనిడిన్ ను ప్రాథమిక శాస్త్రీయ పరిశోధన శలలో మరియునుండి ఔషధప్రాథమిక శాస్త్రీయ పరిశోధన ఉపయోగిస్తారు .అలాగే పారిశ్రామిక అనువర్తనాలలో కూదా ఉపయొగిస్తారు.

మూలాలు

[మార్చు]
  1. "solanidine". merriam-webster.com. Retrieved 2024-03-08.
  2. "20.6.6 α-Solanine and α-chaconine". sciencedirect.com. Retrieved 2024-03-08.
  3. "solanidine". ebi.ac.uk. Retrieved 2024-03-08.
  4. "Solanidine Hydrolytic Extraction and Separation from the Potato (Solanum tuberosum L.)Vines by Using Solid−Liquid−Liquid Systems". pubs.acs.org. Retrieved 2024-03-08.
  5. 5.0 5.1 "Glycoalkaloids: Structure, Properties, and Interactions with Model Membrane Systems". mdpi.com. Retrieved 2024-03-08.
  6. 6.0 6.1 "Solanidine Hydrolytic Extraction and Separation from the Potato (Solanum tuberosum L.) Vines by Using Solid−Liquid−Liquid Systems". pubs.acs.org. Retrieved 2024-03-08.
  7. Computed by PubChem 2.2 (PubChem release 2021.10.14)
  8. "Showing metabocard for Solanidine". hmdb.ca. Retrieved 2024-03-08.
  9. "Showing metabocard for Solanidine". hmdb.ca/metabolites. Retrieved 2024-03-08.
  10. "Solanidine is present in sera of healthy individuals and in amounts dependent on their dietary potato consumption". pubmed.ncbi.nlm.nih.gov. Retrieved 2024-03-08.