సౌందర్య రాజేష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సౌందర్య రాజేశ్
సౌందర్య రాజేశ్
జననం (1968-08-26) 1968 ఆగస్టు 26 (వయసు 55)
వృత్తిపారిశ్రామికవేత్త
జీవిత భాగస్వామివి. రాజేశ్
పిల్లలుఅక్షయ్ రాజేశ్, శివంగి రాజేశ్

సౌందర్య రాజేశ్ ( జననం: ఆగస్టు 26, 1968 )  ప్రముఖ పారిశ్రామికవేత్త. ఈమె AVTAR Career Creators, FLEXI Careers అనే సంస్థను స్థాపించారు. ఈమె భారతీయ మహిళల ఉపాధి కల్పనకు కృషి చేస్తుంది.[1]

తొలినాళ్ళ జీవితం, విద్యాభ్యాసం

[మార్చు]

ఈమె ఆగస్టు 26, 1968 న శాంత చంద్రశేఖర్, ఎం.ఎస్.చంద్రశేఖర్ దంపతులకు బెంగుళూరు లో జన్మించారు. ఈమె తండ్రి ఒక పారిశ్రామిక వేత్త. ఈమె సెయింట్. జోసెఫ్ అఫ్ క్లూనీ పాఠశాలలో తన ప్రాథమిక విద్యను పూర్తిచేసుకుంది. తన ప్రాథమిక విద్య అనంతరం తన కుటుంబం పాండిచ్చేరికి వెళ్లారు. ఈమె తన డిగ్రీ విద్యని 1988 భారతిదాసన్ ప్రభుత్వ మహిళల కళాశాలలో పూర్తి చేసుకుంది. ఈమె 1990 లో యూనివర్సిటీ అఫ్ మద్రాస్ నుంచి ఆంగ్ల భాష సాహిత్యంలో పట్టా పొందింది. అదేవిదంగా 2014లో పిహెచ్డి ని హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ విభాగంలో పూర్తి చేసుకుంది.

కెరిర్

[మార్చు]

ఈమె 1990 లో సిటీ బ్యాంకు లో ఉద్యోగం చేసి కొంత కాలం తర్వాత రాజీనామా చేసారు. అదే విదంగా 1992-95 సమయంలో అల్ ఇండియా రేడియో, దూరదర్శన్ లో పని చేసారు. 1998- 2003 సమయంలో వైష్ణవి మహిళా కళాశాలలో ఉపాధ్యాయులుగా చేసారు. తాను 2000 లో అవతార్ కెరీర్ క్రియేటర్, 2008లో అవతార్ హ్యూమన్ కాపిటల్ ట్రస్ట్ ను, 2011లో ఫ్లెక్సీ కెరీర్ ఇండియా సంస్థలను స్థాపించారు.

ఈమె అవతార్ కెరీర్ క్రియేటర్స్ సంస్థను తన అత్తగారు ఇచ్చిన రూ. 60,000 సొమ్ముతో ప్రారంబించారు. క్రమేణా అవతార్ హ్యూమన్ కాపిటల్ ట్రస్ట్, ఫ్లెక్సీ కెరీర్స్ ఇండియాను స్థాపించారు. ఈ సంస్థలను భారతదేశం అంతటా స్థాపించి అవగాహనా కార్యకలాపాలను కొనసాగించింది. ఇతర కారణాల దృష్ట్యా ఉద్యోగాన్ని మానేసిన మహిళలకు వారికీ ఉద్యోగకల్పనకు డిసెంబరు 2005 ఇండియా విమెన్ నిపుణుల ఇంటర్ఫేస్ నెట్వర్క్ను స్థాపించి, 200 మహిళలతో ప్రారంబైన ఈ సంస్థ నేడు 250000 మహిళకు ఉపాధి కల్పనాను కల్పించింది.

ప్రాజెక్టు పూర్తి

[మార్చు]

ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం :

  • ప్రతి సంవత్సరం తమిళనాడు & పాండిచ్చేరి రాష్టాల్లో 10,000 పాఠశాల బాలికలలో నైపుణ్యాన్ని పెంపొందించడం.
  • వారు ఉన్నత విద్యను చదివేలా ప్రోత్సాహాన్ని అందివ్వడం
  • వారి ఉన్నత విద్య అనంతరం ఉన్నత ఉద్యోగాలలో చేరేలా ప్రోత్సాహాన్ని ఇవ్వడం.

ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ, సామాజికంగా వెనుకబడిన తరగతులకు చెందిన బాలికలకు ఉద్యోగ కల్పనే ద్యేయంగా ఈ ప్రాజెక్టును ప్రారంబించారు. ఇందులో 8 నుంచి 12 వ తరగతి వరకు ఐదు సంవత్సరాల పాటు శిక్షణని ఇస్తారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ, సామాజికంగా వెనుకబడిన తరగతులకు చెందిన బాలికలకు ఉద్యోగ కల్పనే ద్యేయంగా ఈ ప్రాజెక్టును ప్రారంబించారు. ఇందులో 8 నుంచి 12 వ తరగతి వరకు ఐదు సంవత్సరాల పాటు శిక్షణని ఇస్తారు. ఈ శిక్షణ వారిలో వృత్తి నైపుణ్యాభివృధికి ఉపకరించే విదంగా, పై చదువులకు ఉన్నత నైపుణ్యాలతో వెళ్లే విధంగా వారిలో విశ్వాసం కల్పిస్తుంది. వారి కుంటుంబాలలో పేదరిక నిర్మూలించడం, బాలికలలో నిరక్షరాస్యతను నిర్ములించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఈమె చెన్నై ప్రాంతానికి చెందిన వి. రాజేశ్ ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు.

పురస్కారాలు

[మార్చు]

మరిన్ని విశేషాలు

[మార్చు]

భారత మహిళల, పిల్లల అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2015 లో వంద మంది మహిళా సాధికారత జాబితాలో ఈమె ఎన్నికయింది. భారతదేశవ్యాప్తంగా మహిళాభివృద్ధికి కృషి చేసిన వారికి మూడు విభాగాలుగా పోటీ నిర్వహించి 2015 డిసెంబర్ 31 న ఈ జాబితాను విడుదల చేసింది. 2016 జనవరి 22 న రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.

మూలాలు

[మార్చు]
  1. "Soundarya Rajesh". www.thenewsminute.com. Archived from the original on 8 ఆగస్టు 2018. Retrieved 23 May 2018.

బయటి లంకెలు

[మార్చు]