సౌపాడు
సౌపాడు | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°09′42″N 80°24′53″E / 16.161591°N 80.414804°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | వట్టిచెరుకూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీ తాటి అంకమ్మరావు, |
పిన్ కోడ్ | 522007 |
ఎస్.టి.డి కోడ్ |
సౌపాడు, గుంటూరు జిల్లా, వట్టిచెరుకూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామ చరిత్ర
[మార్చు]ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]
గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు
[మార్చు]తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.
గ్రామ భౌగోళికం
[మార్చు]ఇది జిల్లా కేంద్రమైన గుంటూరు నుండి 16 కిలోమీటర్ల దూరములో ఉంది.
గ్రామములోని మౌలిక సదుపాయాలు
[మార్చు]సౌపాడు గ్రామములోని బురదగుంటపల్లెలో, 13వ ఆర్థిక సంఘం నిధులు, ఆరున్నర లక్షల రూపాయలతో, నూతనంగా ఒక అంగనవాడీ భవనం నిర్మించడానికి, ప్రభుత్వ అనుమతి లభించింది. త్వరలో నిర్మాణం ప్రారంభించెదరు.
గ్రామ పంచాయతీ
[మార్చు]2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో తాటి అంకమ్మరావు, సర్పంచిగా ఎన్నికైనాడు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]గ్రామములో జరుపుకునే శివరాత్రి, ఆంజనేయ స్వామి తిరునాళ్ళ. శివరాత్రి పండుగ రోజు ఊరిలోని అందరు కలిసి సహపంక్తి భోజనాలు చేస్తారు.
- శ్రీ లలితా పరమేశ్వరీ సమేత ఓంకారేశ్వరస్వామి ఆలయం:- ఈ దేవాలయంలో మహా శివరాత్రి ముందురోజున విఘ్నేశ్వరస్వామివారి పూజలతో శివరాత్రి మహోత్సవాలు మొదలగును. శివరాత్రి రోజున ప్రధాన ఉత్సవం జరుగును. రాత్రికి శ్రీ ఓంకారేశ్వరస్వామివారి కళ్యాణమహోత్సవం నిర్వహించెదరు.
- శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి ఆరాధనోత్సవాలు, ప్రతి సంవత్సరం, వైశాఖ మాసంలో శుక్ల దశమి నాడు వైభవంగా నిర్వహించెదరు.
గ్రామములోని ప్రధాన పంటలు
[మార్చు]ప్రధాన పంట వరి. రెండో పంటగా మినుం, జనుం, పెసర, శనగ, పిల్లిపెసర మొదలుగునవి పండిస్తారు.
గ్రామములోని ప్రధాన వృత్తులు
[మార్చు]ఈ ఊరిలో ప్రధాన వృత్తి వ్యవసాయము.
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.