స్కాట్‌శాట్-1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్కాట్‌శాట్-1
ఆపరేటర్India ఇస్రో
COSPAR ID2016-059H Edit this at Wikidata
SATCAT no.41790Edit this on Wikidata
మిషన్ వ్యవధి5 సంవత్సరాలు (ప్రణాళిక ప్రకారం)
అంతరిక్ష నౌక లక్షణాలు
బస్భారత లఘుఉపగ్రహ బస్(IMS)-2
తయారీదారుడుఇస్రో
లాంచ్ ద్రవ్యరాశి370 kilograms (820 lb)
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ26 సెప్టెంబరు, 2016
రాకెట్పిఎస్‌ఎల్‌వి-సీ35
లాంచ్ సైట్సతీష్ ధవన్ ప్రయోగకేంద్రంశ్రీహరికోట,నెల్లూరు
కక్ష్య పారామితులు
రిఫరెన్స్ వ్యవస్థభూకేంద్రక కక్ష్య
రెజిమ్తక్కువ భూమిఎత్తులో, 720 కి.మీ ఎత్తులో
వ్యవధి100 నిమిషాలు
 


స్కాట్‌శాట్-1 ఉపగ్రహాన్ని ఇస్రో సంస్థ రూపొందించింది.ఇస్రో భారతదేశం యొక్క ప్రతిష్ఠాత్మక అంతరిక్ష పరిశోధన సంస్థ.సముద్ర జలాల వాతావరణ పరిశీలన, పరిశోధన, ప్రపంచవ్యాప్తంగా సముద్ర జలాల్లో జరిగిగే మార్పులను గమనించే ఉద్దేశంతో ఓసెన్శాట్ ఉపగ్రహాల ప్రయోగం జరిగింది.ఆ క్రమంలో ఇస్రో సెప్టెంబరు23,2009 న ఆంధ్రప్రదేశ్ లోని, నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ దవన్ అంతరిక్షప్రయోగ కేంద్రంనుండి ఓసెన్‌శాట్-2ని ప్రయోగించారు. కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినప్పటికి. ఫిబ్రవరి 20,2014 తరువాత ఏర్పడిన సాంకేతిక సమస్యల వలన ఈ ఉపగ్రహం పనిచెయ్యడం మాని వేసింది. ఓసెన్ షాట్-3, ఓసెన్‌శాట్-3A ఉపగ్రహాలను 2018, 2019 లో ప్రయోగించే విధంగా ప్రణాళిక ఉండడంతో, ఈ మధ్య కాలంలో ఉపగ్రహం పనిచెయ్యక పోవడం వలన కల్గే నష్టాన్ని భర్తీ చెయ్యటానికి స్కాట్‌శాట్-1 ఉపగ్రహాన్ని తయారుచేసి ప్రయోగించింది. ఇది తక్కువ బరువుఉన్న ఉపగ్రహం దీనిని లఘుఉపగ్రహం అనికూడా అనవచ్చును.ఈఉపగ్రహం బరువు 371 కిలోలు మాత్రమే.

ఉపగ్రహ నిర్మాణ వివరాలు-లోపలి పరికరాలు[మార్చు]

ఈ ఉపగ్రహం పనిచేయు, సేవలు అందించుటకు నిర్దేశించిన కాలం 5 సంవత్సరాలు.ఇస్రో డైరెక్టరు తాపాన్ మిశ్రా చెప్పిన దాని ప్రకారం సాధారణంగా ఒక ఉపగ్రహాన్ని తయారు చేయుటకు కనీసం 3 సంవత్సరాల సమయం కావాలి.అయితే అంతకు ముందు ప్రయోగాలలో ఉపగ్రహాల తయారీలో ఉపయోగించగా మిగిలిన భాగాలను 40% వరకు ఈ ఉపగ్రహతయారీలో వాడం వలన ఈఉపగ్రహాన్ని కేవలం ఒకసంవత్సరకాలంలో పూర్తి చెయ్య గలిగా రు.

  • ఎలెక్ట్రికల్ ఫవర్ సబ్‌సిష్టం (EPS) ;రెండు సోలారు ప్యానల్ అమర్చబడి దీనిద్వారా కావాల్సిన విద్యుత్తు ఉత్పత్తి అవును.750W,28 Ah లిథియం-అయాన్ బ్యాటరిని విద్యుత్తు నిల్వకై అమర్చారు.
  • అటిట్ట్యుడ్ ఆర్బిట్ కంట్రోల్ సబ్‌సిష్టం (AOCS) :ఈవ్యవస్థ రియాక్షన్ వీళ్సును (reaction wheels), మాగ్నెటిక్ టార్కర్సు, హైడ్రాజీన్ త్రస్టర్సును నియంత్రణ చేయును.
  • ఆర్ ఎఫ్ సమాచార వ్యవస్థ (RF communications) :ఇది x-బాండ్‌లో సంకేతిక సమాచారాన్ని (Data) ను పంపిణి చేస్తుంది.ఆన్‌బోర్డులో ఉన్న సాలిడ్ స్టేట్ రికార్డరు (SSP) 52 గేగా బైట్ల సమాచారాన్ని నిల్వ చేసుకునే సామర్ద్యాన్ని కల్గిఉన్నది.[1]

ఈ ఉపగ్రహంలో ఓసన్‌శాట్-2 లో ఉపయోగించినటువంటి 13.515 GHz లో పనిచేయు KU-బాండ్ స్కట్టేరోమీటరు రాడారు పరికరాన్నే ఈ స్కాట్ శాట్-1 ఉపగ్రహంలో అమర్చారు.

ప్రదక్షణ కక్ష్య[మార్చు]

371 కిలోల బరువు ఉన్న ఈ ఉపగ్రహం సుర్యానువర్తన కక్ష్యలో భూమినుండి 720 కి.మీఎత్తులో,98.1డిగ్రీల ఎటవాలులో ప్రదక్షణలు చెయ్యులాగా ప్రవేశ పెట్టారు.ధ్రువియ కక్ష్యలో ప్రదక్షిణలుచెయ్యు ఈ ఉపగ్రహం భూమిని మొత్తం చుట్టి రావటానికి రెండు రోజుల సమయం పట్టుతుంది.ఈ ఉపగ్రహం సేవలు అందించుకాలం 5 సంవత్సరాలు,24 గంటలు వాతావరణ పర్యవేక్షణచేస్తుంది.0-360డిగ్రీలకోణంలో 3మీ/సెకండు నుండి 30 మీ/సెకండు వరకు కొలమానం చెయ్యగలదు[2][3].

ప్రయోగం[మార్చు]

ఈఉపగ్రహన్ని పిఎస్‌ఎల్‌వి-సీ35 అనే ఉపగ్రహవాహకనౌక ద్వారా అంతరిక్షంలో ప్రవేశపెట్టారు.ఈఈ ఉపగ్రహంతో పాటు మరో ఏడుచిన్న ఉపగ్రహాలను (మొత్తం 8) రెండు కక్ష్యలలోప్రవేశపెట్టారు.శనివారం రోజున మొదలై, 48:30 గంటల పాటు జరిగిన కౌంట్‌డౌన్ తరువాత, సోమవారం ఉదయం 9:12 నిమిషాలకు పిఎస్‌ఎల్‌వి-సీ35 మొదటి ప్రయోగ వేదిక నుండి గగనం వైపుకు దూసుకెళ్ళింది. ప్రయోగం మొదలైన సమయం నుండి స్ట్రాపాన్ బూస్టరులు, కోర్ మోటర్లు మొత్తం 111 సెకన్లపాటు మండిన తరువాత, మొదటిదశ విజయవంతంగా ముగిసింది. రెండవదశ 262 సెకన్ల పాటు కొనసాగగా, మూడవదశ 586 సెకన్ల పాటు కొనసాగింది. చివరి నాల్గవదశ 1021 సెకనులు మండింది. అనంతరం స్వదేశీ ఉపగ్రహం స్కాట్‌శాట్-1 ని 1058 సెకన్లకు (17:40గంటలకు) విజయవంతంగా 724 కి, మీ ఎత్తున సూర్యానువర్తన ధ్రుకక్ష్యలో ప్రక్షేపించింది. 1.05 గంటల తరువాత రాకెట్ నాలుగవ దశను (PS-4) రెండు విడతలుగా మండించి వాహకనౌకను 55 కి.మీ దిగువకు ప్రయాణింపచేసారు. భూమికి 669 కిలోమీటర్ల ఎత్తులో సూర్యానువర్తన కక్ష్యలో 98.21 డిగ్రీల వాలులో మిగతా 7 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టారు[4]..

ఇవికూడా చూడండి[మార్చు]

ఆధారాలు/మూలాలు[మార్చు]

  1. https://directory.eoportal.org/web/eoportal/satellite-missions/s/scatsat-1
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-09-30. Retrieved 2016-10-03.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-10-02. Retrieved 2016-10-03.
  4. "వినువీథిలోకీర్తిపతాక". sakshi.com. 2016-09-27. Archived from the original on 2016-09-28. Retrieved 2016-10-03.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

ఇతర లింకులు[మార్చు]