స్కార్పీన్ జలాంతర్గాముల కుంభకోణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్కార్పీన్ జలాంతర్గాముల కుంభకోణం, జలాంతర్గముల కొనుగోలులో జరిగినట్లు ఆరోపణలు వచ్చిన కుంభకోణం. ఇందులో థేల్స్ సంస్థ ప్రభుత్వ నిర్ణయాధికారులకు రూ. 1,100 కోట్లు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి.[1] రక్షణ మంత్రి ప్రణబ్ ముఖర్జీ 2005 అక్టోబరులో ఫ్రాన్స్‌లోని థేల్స్‌తో రూ. 19,000 కోట్ల విలువైన స్కార్పీన్ తరగతి జలాంతర్గాములను నిర్మించే ఒప్పందాన్ని ఆమోదించాడు. దీనిపై దర్యాప్తు చేసిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), ఈ ఒప్పందంలో అవినీతికి సంబంధించిన ఆధారాలు ఏవీ కనబడలేదని 2008 లో ప్రకటించింది.[2][3] ఆ ఒప్పందంలో భాగమైన సాంకేతిక బదిలీ నిబంధన ప్రకారం ఇప్పుడు స్కార్పెన్-తరగతి జలాంతర్గాములను భారతదేశంలోనే నిర్మిస్తున్నారు.

ఆరోపణలు, విచారణ

[మార్చు]

ఈ ఒప్పందంలో భాగంగా మధ్య దళారీ అయిన ఆయుధాల వ్యాపారి అభిషేక్ వర్మకు రూ 1,100 కోట్లు ముట్టాయని ఆరోపణలు వచ్చాయి.[4] అతను భారతదేశంలోని నేవీ వార్ రూమ్ గూఢచారి కుంభకోణం లోను, అనేక ఇతర రక్షణ కుంభకోణాలలోనూ ప్రధాన నిందితుడు.[5] ఇతన్ని లార్డ్ ఆఫ్ వార్ అని పిలుస్తారు.

విచారణ చాలా నెమ్మదిగా సాగింది. 2007లో, సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్‌కు చెందిన ప్రశాంత్ భూషణ్, స్కార్పీన్ ఒప్పందంలో లంచాలు ముట్టాయా లేదా అనే దానిపై దర్యాప్తు చేయాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు."ఇప్పటి వరకు మీరు చేసిన పని పట్ల మేము అసంతృప్తిగా ఉన్నాం. మీరు ఎవరినైనా రక్షించడానికి ప్రయత్నించినట్లయితే, మేము మీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడతాం" అని ఢిల్లీ హైకోర్టు దర్యాప్తు సంస్థ సిబిఐపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.[6] ఫ్రెంచ్ జలాంతర్గామి తయారీదారు థేల్స్ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. భారతదేశంలో దాని డైరెక్టర్ ఫ్రాంకోయిస్ డుపాంట్, "ఆ ఈమెయిళ్ళు ఫోర్జరీలు. ఆ విషయమై మేము వార్తా పత్రికపై దావా వేసాము," అన్నాడు.[7] ఆయుధాల వ్యాపారి అభిషేక్ వర్మ తన పేరును ఇందులో ఇరికింది తనను కించపరిచినందుకు, కేవలం రాజకీయ పగతో దాడులు చేసినందుకూ భారత మాజీ ఉప ప్రధాన మంత్రి ఎల్‌కె అద్వానీపై, <i id="mwLg">ఔట్‌లుక్</i> మ్యాగజైన్‌పై 2006 లో క్రిమినల్ పరువు నష్టం దావా వేశాడు.[8] 2016 లో, అభిషేక్ వర్మ, ఎల్‌కె అద్వానీలు తమ విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకున్నారు. వర్మ పంజాబ్, హర్యానా హైకోర్టు నుండి అడ్వాణీపై తన పరువు నష్టం కేసును ఉపసంహరించుకున్నాడు.[9]

ఫలితం

[మార్చు]

విచారణ తర్వాత ఈ ఒప్పందంలో లంచాలు చెల్లించినట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని 2008 లో సిబిఐ, ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది. అయితే ఢిల్లీ హైకోర్టులో ఈ కేసు ఎనిమిదేళ్ల పాటు సాగింది. 2007లో ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి 2016 జనవరి 13న తోసిపుచ్చి, అభిషేక్ వర్మను నిర్దోషిగా ప్రకటించింది.[10][11][12]

మూలాలు

[మార్చు]
  1. Sudheendra Kulkarni (26 February 2006). "Of Scorpene, Scorpions and the coming 'sting'". Indian Express.
  2. "No evidence of kickbacks in Scorpene deal, CBI tells HC". Hindustan Times. 16 July 2008. Archived from the original on 3 December 2013. Retrieved 1 December 2013.
  3. "No evidence of kickbacks in Scorpene deal: CBI". Sify. 17 May 2008. Archived from the original on 29 January 2014. Retrieved 1 December 2013.
  4. "DER SPIEGEL: Abhishek Verma Lord of War".
  5. "CBI raids Navy, Army Headquarters". CNN-IBN. 23 June 2006. Archived from the original on 4 May 2012. Retrieved 1 December 2013.
  6. Saikat Datta (21 Jan 2008). "A Sea of Subterfuge".
  7. http://indiatoday.intoday.in/story/scorpene-submarine-deal-upa-refutes-allegations-of-kickbacks-says-it-only-renegotiated-nda-contract/1/181731.html Dodging torpedoes - Scorpene deal: UPA refutes allegations of kickbacks, says it only renegotiated NDA contract
  8. "OUTLOOK: Abhishek Verma sues LK Advani for criminal defamation in 2006".
  9. "Abhishek Verma withdraws his criminal case against Advani May 2, 2016".
  10. "No evidence of money received linked to Scorpene".
  11. "India Today: PIL on Scorpene Submarines purchases dismissed by Delhi High Court January 13, 2016".
  12. "Full text of Order of Delhi High Court dismissing PIL on Scorpene purchases January 13, 2016".