Jump to content

స్కైబాబ

వికీపీడియా నుండి
స్కైబాబ
స్కైబాబ
జననంషేక్ యూసుఫ్ బాబ
(1972-08-04) 1972 ఆగస్టు 4 (వయసు 52)
కేశ్‌రాజుపల్లి, తిప్పర్తి మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ, భారతదేశం
నివాస ప్రాంతంహైదరాబాద్, తెలంగాణ
వృత్తికవి
భార్య / భర్తషాజహానా
దస్త్రం:1504Skybaaba2.jpg

స్కైబాబ కవి, కథా రచయిత. ఈయన అసలు పేరు షేక్ యూసుఫ్ బాబ. స్కైబాబ కలంపేరుతో ముస్లింవాద సాహిత్యాన్ని సృష్టిస్తున్నాడు.[1]

విశేషాలు

[మార్చు]

ఇతడు నల్గొండ జిల్లాలోని తిప్పర్తి మండలం, కేశ్‌రాజుపల్లి గ్రామంలో 1972, ఆగష్టు 4న జన్మించాడు. ఇతని భార్య షాజహానా, మామ దిలావర్లు కూడా రచయితలే. ఇతడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో సబ్‌ఎడిటర్‌గా కొన్నాళ్లు పనిచేశాడు. ఇతడు చమన్ అనే పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించాడు. అడుగు అనే పేరుతో ఒక ప్రత్యామ్నయ పత్రికను తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు.

రచనలు

[మార్చు]

ఇతడి కథలు, కవితలు, వ్యాసాలు పలు పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఇతని రచనలు తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషలలో తర్జుమా అయ్యాయి. ఇతడు ప్రచురించిన పుస్తకాలలో కొన్ని:

  1. జల్‌జలా (కవితా సంకలనం)
  2. అజా (కవితా సంకలనం అన్వర్తో కలిసి)
  3. వతన్ (కథల సంకలనం)
  4. రంది (కథల సంకలనం సంగిశెట్టి శ్రీనివాస్తో కలిసి)
  5. జగ్‌నేకీ రాత్ (కథల సంపుటి)
  6. అలావా (కవితా సంకలనం షాజహానాతో కలిసి)
  7. చాంద్‌తారా (మినీకవితా సంకలనం షాజహానాతో కలిసి)
  8. ఏక్ కహానీకే తీన్ రంగ్ (కథల సంపుటి)
  9. అధూరె[2]
  10. బేచారె
  11. జాగో (వ్యాస సంపుటి)
  12. అలాయిబలాయి (బహుజన కథలు)
  13. ఆపా
  14. ముల్కి (వేముల ఎల్లయ్యతో కలిసి)
2018 ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా , తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన కవి సమ్మేళనంలో స్కైబాబకి మామిడి హరికృష్ణ సత్కారం

ఈయన రచించినటువ్వంటి పుస్తకంన్ని vegetarians only[3] అనే పేరుతో ఆంగ్లం లోకి అనువదించారు.

మూలాలు

[మార్చు]
  1. అక్షరశిల్పులు - సయ్యద్ నశీర్ అహ్మద్ - పేజీ:160
  2. "1 న తెలుగు యూనివర్శిటీ పురస్కారాల ప్రదానం". 2016-11-28. Archived from the original on 2023-08-24. Retrieved 2023-08-24.
  3. Dutta-Asane, Sucharita (2018-01-02). "Book review: Vegetarians Only by Skybaaba". kitaab (in ఇంగ్లీష్). Retrieved 2020-08-02.

బయటిలింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=స్కైబాబ&oldid=4350298" నుండి వెలికితీశారు