స్టీఫెన్ రవీంద్ర
ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎం. స్టీఫెన్ రవీంద్ర ఐపీఎస్ అధికారి | |
---|---|
జననం | 14 ఫిబ్రవరి ,[1] 1973[2] |
పురస్కారాలు | |
Police career | |
విభాగము | ఇండియన్ పోలీస్ సర్వీస్ (19991022) |
దేశం | తెలంగాణ క్యాడర్[6] |
Years of service | 1999 |
Rank | ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, [7] |
ముత్యాల స్టీఫెన్ రవీంద్ర 1999 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన ప్రస్తుతం సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్నారు.[8] స్టీఫెన్ రవీంద్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పని చేశారు.
జననం, విద్యాభాస్యం
[మార్చు]స్టీఫెన్ రవీంద్ర 14 ఫిబ్రవరి 1973న ఆంధ్రప్రదేశ్ లో జన్మించాడు. ఆయన తండ్రి ఎం.బి. రంజిత్ ఆసిఫ్ నగర్ డివిజన్, హైదరాబాద్ సిటీ పోలీసు అసిస్టెంట్ కమిషనర్ గా పని చేసి రిటైర్ అయ్యారు. రవీంద్ర సెయింట్ పాల్స్ ఉన్నత పాఠశాలలో ప్రాధమిక విద్యాభ్యాసం, లిటిల్ ఫ్లవర్ జూనియర్ కళాశాలలో, 1994లో నిజాం కళాశాలలో కాలేజీ విద్యను పూర్తి చేశారు. స్టీఫెన్ రవీంద్ర ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్‌లో జంతుశాస్త్ర విభాగంలో చేరి పోస్ట్ గ్రాడ్యుయేట్ లో బంగారు పతకం సాధించాడు. ఆయన అనంతరం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో సెలక్ట్ అయి ఐపీఎస్ లో చేరారు.
వృత్తి జీవితం
[మార్చు]1999 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందిన స్టీఫెన్ రవీంద్ర హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందాడు. ఆయన 20 సెప్టెంబర్ 1999న ఉద్యోగంలో చేరి తొలి పోస్టింగ్ వరంగల్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా , ఆదిలాబాద్, కరీంనగర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో అనంతపూర్ లో ఏఎస్పీ, ఎస్పీగా , వైఎస్ఆర్ ప్రభుత్వంలో సీఎం సెక్యూరిటీ చీఫ్‌గా, హైదరాబాద్ కమిషనరేట్ లోని ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్ డీసీపీగా, గ్రేహౌండ్లో అసాల్ట్ కమాండర్, గ్రూప్ కమాండర్ గా హైదరాబాద్ ఐజీగా విధులు నిర్వహించాడు. ఆయన గ్రేహౌండ్లో అసాల్ట్ కమాండర్, గ్రూప్ కమాండర్ గా పని చేసిన సమయంలో చత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిషాఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో పలు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేశాడు.
స్టీఫెన్ రవీంద్ర విధి నిర్వహణలో భాగంగా అగ్నిప్రమాదంలో చిక్కుకున్న 61 మంది రోగుల ప్రాణాలను కాపాడటంతో శౌర్య పతకం(2005), ప్రధాన మంత్రి లైఫ్ సేవింగ్ పతకం(2011), తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నందుకు కేంద్రం నుంచి గాలంటరీ మెడల్, భారత పోలీస్ పతకం(2016), ఆంత్రిక్ సురక్షా సేవ లాంటి పతకాలు అందుకున్నాడు. స్టీఫెన్ రవీంద్ర 25 ఆగష్టు 2021న సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమితుడై, 26న భాద్యతలు స్వీకరించాడు.[9].
మూలాలు
[మార్చు]- ↑ National Police Academy, Hyderabad – IPS Directory. "Archived copy". Archived from the original on 20 ఫిబ్రవరి 2012. Retrieved 20 జనవరి 2010.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link). Internet, accessed 20 July 2011. - ↑ "Ministry of Home Affairs" (PDF). Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2021-08-28.
- ↑ List of Awardees of Gallantry Medals on Independence Day 2005
- ↑ 3 HYDERABAD COPS TO GET PM MEDAL FOR BRAVERY, Siasat Daily, 24 January 2016.[1]
- ↑ Two from Telangana get President’s medal, Times of India, 26 January 2016.[2]
- ↑ Government of India
- ↑ IPS Executive Record Sheet, M. Stephen Raveendra[permanent dead link]
- ↑ Mana Telangana (25 August 2021). "సైబరాబాద్ సిపిగా స్టీఫెన్ రవీంద్ర". Archived from the original on 28 ఆగస్టు 2021. Retrieved 28 August 2021.
- ↑ Eenadu (26 August 2021). "సైబరాబాద్ సీపీగా స్టీఫెన్ రవీంద్ర బాధ్యతల స్వీకరణ". Archived from the original on 28 August 2021. Retrieved 28 August 2021.