స్రవంతి ఐతరాజు
డా.ఐతరాజు సత్యనారాయణ స్రవంతి (I.S.SRAVANTHI) | |
---|---|
దస్త్రం:Dr.Sravanthi Itharaju 02.jpg | |
జననం | డా.ఐతరాజు స్రవంతి మే 15 |
ఇతర పేర్లు | సౌగంధిక (కలం పేరు) |
విద్య | సోషియాలజీ, సైకాలజీ లందు పి.జీ., పి హెచ్ డి |
ఉద్యోగం | సాంఘిక సంక్షేమశాఖనందు ఉద్యోగి |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | కవయిత్రి,గాయని,నర్తకి,వైణికురాలు, మనస్తత్వవేత్త |
తల్లిదండ్రులు | ఐ.ఎస్.వి. నరసింగరావు చక్రవర్తి విమలమ్మ |
స్రవంతి ఐతరాజుడా. (ఐతరాజు సత్యనారాయణ (ఐ.యస్) స్రవంతి) మనస్తత్వవేత్తగా సుపరిచితులు. వృత్తి రీత్యా ఆమె ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమశాఖనందు ఉద్యోగి. ప్రవృత్తి రీత్యా ఆమె రచయిత.[1] ఈమె "సౌగంధిక" అనే కలం పేరుతో రచనలు చేస్తూంటారు.
జీవిత విశేషాలు
[మార్చు]ఆమె చక్రవర్తి విమలమ్మ, ఐ.ఎస్.వి. నరసింగరావు దంపతులకు మే 15 న చిత్తూరు జిల్లా సత్యవేడులో జన్మించారు. ఈమె సోషియాలజీ, సైకాలజీ లందు పి.జీ. పట్టభద్రురాలు. మనోవిజ్ఞానశాస్త్ర పరిశోధకురాలు ఈమె స్వతహాగా బహుముఖ ప్రజ్ఞాశాలి. తన 8వ ఏట నుండి సంగీతము, నాట్యము, 13వ ఏట నుండి వీణావాదనము, 19వ ఏట చిత్రలేఖనము మున్నగు కళలందు ఆరితేరినారు. గాత్రము, వీణ, నాట్యము లందు రాష్ట్రస్థాయి కళాకారిణిగా పలు పతకాలు సాధించారు. ఆమె తిరుపతి లో హాస్టల్ సంక్షేమ అధికారిగా, మనస్తత్వవేత్తగా పనిచేస్తున్నారు. రచయితగా ఆమె మొదటి కవిత వినవో ఓ మనసా, ప్రజాతంత్రలో ప్రచురితం అయింది. 2010-11 వ సంవత్సరములో తి.తి.దే.., బధిర పిల్లల "శ్రవణం"లో సైకాలజిస్ట్ గా పొరుగు సేవలు అందించారు. ఈ శాస్త్రమునందు 2010-11నందు "నేషనల్ అవార్డ్" పొందిన "Construction of Ramps In Chittoor District", Projectనకు తన "Voice - Over"ను అందించారు. పలు టి.వి. రేడియో కార్యక్రమాలు కూడా చేశారు.[2]
విద్యాభ్యాసం
[మార్చు]1994-96 సంవత్సరంలో తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సైకాలజీ విభాగంలో పీజీ పూర్తి చేసిన స్రవంతి, పిల్లల్లో ఆటిజం అనే మానసిక రుగ్మతపై ప్రొఫెసర్ జమున పర్యవేక్షణలో డాక్టరేట్‌ను అందుకున్నారు. పిల్లల్లో కన్పించే ఆటిజం (మూగ వ్యాధి) అనే మానసిక రుగ్మతపై వచ్చిన రాష్ట్రంస్థాయి తొలి పరిశోధనగా ఇది గుర్తింపు పొందింది.[3]
కుటుంబం
[మార్చు]1996లో విశాఖపట్నంకు చెందిన శర్మ తో స్రవంతి వివాహమైంది. వీరికి ,1997 లో శ్రియ అనే పాప(ఇప్పుడు లేదు), 1999లో చందన్ (బాబు) జన్మించాడు.
రచనలు
[మార్చు]- మనసు తలుపు తెరిస్తే (కథా సంపుటి) [4]
- సౌగంధిక జాజరలు-1 (చిత్ర కవితా సంపుటి) [5]
- సౌగంధిక జాజరలు-2 (భక్తి కవితలు) : సినీ రచయిత శ్రీ వెన్నెలకంటిగారు, దూరదర్శన్ ప్రోగ్రాం ఎగ్జికూటివ్ ఓలేటి పార్వతీశం గారి చేతులమీదుగా పుస్తకావిష్కరణ జరిగింది.[6]
- ది డిజైనర్ బేబి (నవల)
- మనోరంజితాలు (ద్విపాద కవితలు) అటవీ శాఖామాత్యులు గౌ.శ్రీ సిద్దరామయ్య గారిచే ఆవిష్కరి0పబడింది.
- భక్తి అండ్ సైకాలజీ (ప్రచురణకు సిద్దం)
బహుమానాలు - బిరుదులు-గుర్తింపులు
[మార్చు]బహుమానాలు
[మార్చు]- వాయిస్ ఓవర్ లో జాతీయ అవార్డు (2010-11)
- లైట్ మ్యూజిక్ లో రాష్ట్ర అవార్డు (వీణా), శాస్త్రీమ నృత్యంలో రాష్ట్ర అవార్డు (79-80,80-81,94-95)
- ప్రకాశం జిల్లా రచయితల కళా భారతి ప్రతిభా పురస్కారం-2015.
గుర్తింపులు
[మార్చు]- నాట్య మయూరి
- గాన కోకిల
- లలితకళాప్రావీణ్య
- మనోవిజ్ఞానవికాసిని
- లలితకళాప్రవీణ
- మహిళాశిరోమణి
- కావ్య శిరోమణి
- సత్యశ్రీ
- మనోవిజ్ఞానరత్న
మూలాలు
[మార్చు]- ↑ "మనసు తలుపు తెరెస్తే పుస్తక పరిచయం". Archived from the original on 2016-01-13. Retrieved 2016-02-10.
- ↑ సాక్షి, ఫ్యామిలీ (12 May 2019). "డాక్టర్ స్రవంతి మదర్ ఆఫ్ చందన్". Archived from the original on 12 May 2019. Retrieved 14 May 2019.
- ↑ ఆంధ్రజ్యోతి, చిత్తూరు (3 March 2019). "నా బిడ్డే నాకు గురువు." Archived from the original on 14 May 2019. Retrieved 14 May 2019.
- ↑ "Manasu Talupu Teriste book review". Archived from the original on 2016-01-13. Retrieved 2016-02-10.
- ↑ "Sougandhika Jaajaralu book review". Archived from the original on 2015-10-22. Retrieved 2016-02-10.
- ↑ Smt.Itiraju sravanti's Book Opening