స్లీప్ అప్నియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్లీప్ అప్నియా ఒక నిద్రకి సంబంధించిన రుగ్మత. ఇది కలిగి ఉన్న వ్యక్తికి నిద్రపోతున్నప్పుడు శ్వాసలో అంతరాయాలు కలగడం లేదా ఊపిరి లోతుగా తీసుకోలేక పోవడం జరుగుతుంది శ్వాసలో విరామం కొన్ని సెకన్ల నుండి కొన్ని నిమిషాల వరకు ఉంటుంది. ఇలా రాత్రిలో చాలా సార్లు జరుగవచ్చు. సాధారణంగా ఈ రుగ్మత వున్నవారు పెద్దగా గురక పెడతారు. శ్వాస పున ప్రారంభం ఐనప్పుడు ఉక్కిరిబిక్కిరి అయ్యి వింతశబ్దాలు రావడం జరుగుతుంది. ఈ రుగ్మత సాధారణ నిద్రకు అంతరాయం కలిగిస్తుంది కాబట్టి, దీనివల్ల ప్రభావితమైన వారు పగలు నిద్రగా వుంటారు లేదా అలసటగా ఉంటారు. పిల్లలలో ఇది హైపర్యాక్టివిటీ కలిగిస్తుంది తద్వారా బడిలో సమస్యలకు దారి తీస్తుంది .

స్లీప్ అప్నియా మూడు రకాలు. 1. అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA) - దీనికి ముఖ్య కారణం ఎగువ శ్వాసపథము అణిగిపోయి గాలి చలనానికి అడ్డంకి కలిగి గాలి ప్రవాహం ఆగిపొవడం వల్ల శ్వాసకు అంతరాయం ఏర్పడుతుంది. 2. సెంట్రల్ స్లీప్ అప్నియా (CSA) - దీనిలో అసంకిల్పితంగా అవుతున్న శ్వాస ఆగిపోతుంది. 3. ఈ రెండింటి (OSA + CSA) కలయిక కూడా స్లీప్ ఆప్నియాలో వుండవచ్చు [1]. ఈ మూడు రకాలలో అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA) ఎక్కువగా కనిపిస్తుంది. OSA కి ప్రమాద కారకాలు అధిక బరువు, కుటుంబ చరిత్ర, అలెర్జీలు, చిన్న శ్వాస వాయుమార్గం, విస్తరించిన టాన్సిల్స్ లాంటివి. [2]

స్లీప్ అప్నియా ఉన్న కొంతమందికి ఈ పరిస్థితి ఉందని తెలియదు. అనేక సందర్భాల్లో దీనిని మొదట కుటుంబ సభ్యులు గమనిస్తారు. స్లీప్ అప్నియాని నిర్ధారిచాలంటే కొన్ని పరికరాలతో నిద్రని అధ్యయనం చెయాలి. [3] దీని కోసం, గంటకు ఐదు ఎపిసోడ్లకు పైగా పరీక్ష జరగాలి. [4]

చికిత్సలో భాగంగా జీవనశైలిలో మార్పులు, మౌత్‌పీస్, శ్వాస పరికరాల అవసరం, చివరిగా శస్త్రచికిత్స అవసరం కావొచ్చు.

జీవనశైలి మార్పులలో మద్యం నివారించడం, బరువు తగ్గడం, ధూమపానం మానేయడం, ఒకరి వైపు పడుకోవడం వంటివి అవసరం. శ్వాస పరికరం CPAP యంత్రాన్ని ఉపయోగిస్తారు. cpap సాధనముతో శ్వాసపథములోనికి నిర్ణీత పీడనముతో నిరంతరము గాలిని పంపి శ్వాసపథమును తెరచి ఉంచుతారు. నోరు, ముక్కులపై మాస్కు ద్వారా ( mask ) గాని,లేక ముక్కుపై మాస్కుతో గాని గాని గాలిని శ్వాసపథములోనికి రోగులకు అనుకూలము అయేనట్లు పంపవచ్చు. శ్వాసకు అడ్డంకులు తొలగించేటట్లు, గురకలు లేకుండేటట్లు, రక్తపు ప్రాణవాయువు సంతృప్తత ( saturation ) ఆమోదకరముగా ఉండేటట్లు గాలి పీడనమును అంచెలుగా పెంచి సరిదిద్దుతారు. నిరంతరము శ్వాసపథము లోనికి గాలిని పీడనముతో పంపుట వలన శ్వాసక్రియ మెరుగయి రాత్రుళ్ళు నిద్ర బాగాపట్టి పగళ్ళు మత్తు లేకుండా ఉంటుంది. అధిక రక్తపుపోటు, హృదయవైఫల్యము, కాళ్ళపొంగులు, రాత్రులలో అధిక మూత్రవిసర్జన, బహుళ రక్తకణత్వము ( polycythemia ) వంటి ఉపద్రవములు తగ్గుతాయి.

చికిత్స జరిపించకపొతే, స్లీప్ అప్నియా వల్ల గుండెపోటు, స్ట్రోక్, మధుమేహం, గుండె వైఫల్యం, క్రమం లేని హృదయ స్పందన, స్థూలకాయం, మోటారు వాహన ప్రమాదాలు వంటి వాటికి అవకాశాలు పెరుగుతాయి. .

ప్రమాద కారకాలు[మార్చు]

స్లీప్ అప్నియా జాతి లేదా వయస్సుతో సంబంధం లేకుండా ప్రజలను ప్రభావితం చేస్తుంది.

అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాకి ముఖ్యమైన ప్రమాద కారకాలు:

 • మగవారై వుందటం
 • ఊబకాయం
 • 40 ఏళ్లు పైబడిన వారు
 • పెద్ద మెడ చుట్టుకొలత (16–17 అంగుళాల కంటే ఎక్కువ)
 • విస్తరించిన టాన్సిల్స్ లేదా నాలుక
 • చిన్న దవడ ఎముక
 • గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్
 • అలెర్జీలు
 • సైనస్ సమస్యలు
 • కుటుంబంలో స్లీప్ అప్నియా వుండటం
 • సెప్టం [5] విచలనం అయ్యి వుడటం
 • మధ్యం, సెడెటివ్స్, ట్రాంక్విలైజర్స్ కూడా స్లీప్ అప్నియాను ఎక్కువ చేస్తాయి. పొగాకు తాగేవారికి స్లీప్ అప్నియా మూడు రెట్లు ఎక్కువ. [6]

సెంట్రల్ స్లీప్ అప్నియాకు ప్రమాద కారణాలు:

 • మగవారై వుందటం
 • 65 ఏళ్లు పైబడిన వయస్సు
 • గుండెలో కర్ణిక దడ లేదా పిఎఫ్‌ఓ వంటి కర్ణిక సెప్టల్ లోపాలు
 • స్ట్రోక్

విధానం[మార్చు]

శ్వాస ఆగినప్పుడు చేసినప్పుడు, రక్తప్రవాహంలో కార్బన్ డయాక్సైడ్ ఏర్పడుతుంది. రక్త ప్రవాహంలోని కెమోరెసెప్టర్లు అధిక కార్బన్ డయాక్సైడ్ స్థాయిలను చేరుకొంటాయి. అప్పుడు వ్యక్తిని మేల్కొల్పడానికి మెదడు సంకేతాలు ఇస్తుంది. ఇది వాయుమార్గాన్ని క్లియర్ చేసి శ్వాసను తిరిగి ప్రారంభించడానికి అనుమతిస్తుంది. సాధారణంగా శ్వాస తీసుకోవడం వల్ల ఆక్సిజన్ స్థాయిలు పునరుద్ధరించబడతాయి తర్వాత వ్యక్తి మళ్ళీ నిద్రపోతాడు. [7]

నిర్ధారణ[మార్చు]

లక్షణాలు, ప్రమాద కారకాలు (ఉదా., అధిక పగటి నిద్ర, అలసట) పరిశీలించి స్లీప్ అప్నియాను నిర్ధారిస్తారు, అయితే రోగ నిర్ధారణ కోసం కావాల్సిన ప్రమాణం అధికారిక నిద్ర అధ్యయనం ( పాలిసోమ్నోగ్రఫీ, లేదా "హోమ్ స్లీప్ అప్నియా టెస్టింగ్" (HSAT) )

వర్గీకరణ[మార్చు]

అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA) అత్యంత సాధారణ వర్గం. స్లీప్ అప్నియా మూడు రకాలలో OSA 84%, CSA 0.4%, మిశ్రమ కేసులు 15% వున్నట్టుగా ఒక అధ్యయనంలో తెలిసింది. [8]

అబ్స్ట్రక్టివ్ అప్నియాను చూపించే PSG వ్యవస్థ యొక్క స్క్రీన్ షాట్.
నిద్రలో వాయుమార్గ అవరోధం లేదు.
నిద్రలో వాయుమార్గ అవరోధం.

మూలాలు[మార్చు]

 1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; NIH2012What అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 2. "Who Is at Risk for Sleep Apnea?". NHLBI. July 10, 2012.
 3. "How Is Sleep Apnea Diagnosed?". NHLBI. July 10, 2012.
 4. De Backer W (June 2013). "Obstructive sleep apnea/hypopnea syndrome". Panminerva Medica. 55 (2): 191–5. PMID 23676959.
 5. "Sleep Apnea Health Center".
 6. "Sleep apnea".
 7. Green, Simon (2011). Biological Rhythms, Sleep and Hyponosis. England: Palgrave Macmillan. p. 85. ISBN 978-0-230-25265-3.
 8. Morgenthaler TI, Kagramanov V, Hanak V, Decker PA. "Complex sleep apnea syndrome: is it a unique clinical syndrome?". Sleep. 29 (9): 1203–9. doi:10.1093/sleep/29.9.1203. PMID 17040008. Archived from the original on 2011-04-11.