Jump to content

స్వప్నం

వికీపీడియా నుండి
(స్వప్నాలు నుండి దారిమార్పు చెందింది)
"The Knight's Dream" by Antonio de Pereda

నిద్రకి చెందిన కొన్ని స్థితులలో అసంకల్పితంగా మనసులో మెదిలే భావాల, భావావేశాల, ఐంద్రియ సంవేదనల సందోహాలని స్వప్నాలు లేదా కలలు (Dream) అంటారు. కలల యొక్క అంతరార్థం ఏమిటో, వాటి ప్రయోజనం ఏమిటో ఇప్పటికీ మనకి పూర్తిగా అర్థం కాదు. కాని కలల గురించి ఎంతో ఊహాగానం, అనిర్ధారిత చింతన మనకి చరిత్రలో కనిపిస్తుంది. కలల యొక్క శాస్త్రీయ అధ్యయనాన్ని ఓనేరాలజీ (Oneirology) అంటారు. కలలు ఎంతో స్ఫూర్తి దాయకం కావడమే కాక, చాలా అనిర్ధారిత నమ్మకాలకి తావు ఇవ్వడం, కలల సుదీర్ఘమైన చరిత్ర లో మనకి కనిపిస్తుంది. కలలలో ఏదో అంతరార్థం ఉందన్న నమ్మకం, కలల సహాయంతో భవిష్యత్తుని తెలుసుకోవచ్చన్న నమ్మకం ఎన్నో సమాజాలలో అనాదిగా చలామణిలో ఉంది. కలలని కేవలం భౌతికంగా, జీవ శాస్త్ర దృక్పథంతో చూస్తే అవి నిద్రావస్థలో నాడీ సంకేతాల చలనాలకి ఫలితాలుగా చెప్పుకోవచ్చు. మనస్తత్వ శాస్త్రం దృష్ట్యా చూస్తే అవి ఉపచేతనలో జరిగే చలనాలకి ప్రతిబింబాలుగా చెప్పుకోవచ్చు. అధ్యాత్మికంగా చూస్తే దివ్య సందేశాలు గానో, భవిష్యత్తుని తెలిపే దూతలు గానో చెప్పుకోవచ్చు. ఎన్నో సంస్కృతులలో స్వప్న సంపోషణ అనే ఆచారం ఉన్నట్టు తెలుస్తోంది. స్వప్న సంపోషణ అంటే భవిష్యత్తుని సూచించే, దైవం నుండి వచ్చే కలలని జాగ్రత్తగా పోషించుకోవడం, కాపాడుకుని పెంచుకోవడం అన్నమాట.

పీడ కలలు

[మార్చు]

భావోద్వేగాలు, సంఘర్షణ, ఆందోళనల కారణంగానే పీడకలలు సంభవిస్తాయి.మనిషి మేల్కొనే సమయంపై ఇవి ఎలాంటి ప్రభావాన్ని చూపవు.ప్రతి పదిమందిలో ఒకరిని భయోత్పాతంతో కూడిన కలలు వెంటాడుతున్నాయి.నిద్రలో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తున్నారు. మెట్లపై/మేడపై నుంచి పడిపోయినట్లు, ఎవరో వెంటాడుతున్నట్లు, పక్షవాతం సోకినట్లు,వాహనం/రైలు ఆలస్యమైనట్లు, ఆత్మీయుల్లో ఎవరో చనిపోయినట్లు,జుట్టు, పళ్లు రాలిపోవడం, బట్టతల, పరీక్షల భయం పీడిస్తూ అధికంగా పీడకలలు వస్తాయి.

భాషా విశేషాలు

[మార్చు]

తెలుగు భాషలో కల పదానికి నామవాచకంగా A dream అని అర్ధము.[1] ఉదా: "కలలోన భామల కామింపగా నేల" Why waste your soul in dreams on the fair? కలగను v. n. అనగా To dream.

కల adj. విశేషణంగా (in composition) All, various; actual అని అర్ధము. ఉదా: కలకాలము at all times. కలగూర various herbs. కలరూపు the actual appearance.

కల లేదా గల An affix. కొన్ని పదాలకు అనుబంధంగా The participle of కలుగు. Possessed of అని అర్ధం. ఉదా: బుద్ధిగల sensible.

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=స్వప్నం&oldid=3842132" నుండి వెలికితీశారు