స్వర్గం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అయోమయ నివృత్తి కొరకు చూడండి. పుణ్యాత్ముల కొరకు నిర్ధేశించబడిన ఒక లోకం స్వర్గం

స్వర్గం తెలుగు చలన చిత్రం 1981 మే 16 న విడుదల. దుర్గా నాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో చంద్రమోహన్, జయసుధ,జంటగా నటించారు.సంగీతం చక్రవర్తి అందించారు .

స్వర్గం
(1981 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం దుర్గా నాగేశ్వరరావు
తారాగణం చంద్రమోహన్ ,
జయసుధ ,
సత్యనారాయణ,
ఎస్.వరలక్ష్మి
పిఆర్ వరలక్ష్మి
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ ఉదయం ప్రొడక్షన్స్
భాష తెలుగు

ఒక రిటైర్డ్ మిలటరీ ఆఫీసరు (సత్యనారాయణ) భార్య (ఎస్.వరలక్ష్మి) చండశాసనురాలు. ఆమెకు నలుగురు కొడుకులు. ఆమె అంటే కొడుకులకే కాదు ఆమె భర్తకు కూడా హడల్. ఆ ఇంటిని తన కట్టుబాటులో ఉంచడానికి ఆమె ఎప్పుడూ ప్రయత్నిస్తూ వుంటుంది. ఆమె రెండో కొడుకు భార్య ఉమ. ఆమె చెల్లెలు సుమ (జయసుధ) గడుగ్గాయి. అక్క ఇంటికి చుట్టపు చూపుగా వచ్చిన సుమ ఆంటీ దాష్టీకం చూసి ఆమెను ఓ ఆట పట్టించి దారిలోకి తేవాలని అనుకుంటుంది. ఆ ఇంటిలోని వారిని, రిటైర్డ్ మిలటరీ ఆఫీసరుతో సహా తన చిలిపి చేష్టలతో ఆకట్టుకుంటుంది. ఆ రిటైర్డ్ మిలటరీ ఆఫీసరు మూడో కొడుకు ఒక డాక్టరు. అతడు సుమను ప్రేమిస్తాడు. వీరిద్దరికీ పరిచయం కలహంతో ప్రారంభమై ప్రణయంగా పరిణమిస్తుంది. కాని వారి పరిణయానికి అడ్డుపడుతుంది రిటైర్డ్ మిలటరీ ఆఫీసరు భార్య. చివరకు ఆమె మనసు మార్చుకోవడం ఈ జంటకు పెళ్లి కావడం అనేది పతాక సన్నివేశం[1].

తారాగణం

[మార్చు]

చంద్రమోహన్

జయసుధ

ఎస్.వరలక్మి

సత్యనారాయణ

పి.ఆర్.వరలక్ష్మి

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: దుర్గా నాగేశ్వరరావు

సంగీతం: కె.చక్రవర్తి

నిర్మాణ సంస్థ: ఉదయం ప్రొడక్షన్స్

సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి, రాజశ్రీ

నేపథ్య గానం: ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి

విడుదల:1981 మే 16 .

పాటలు

[మార్చు]
  1. వెయ్యనా తాళం వెయ్యనా నోటికి వెయ్యనా, రచన: రాజశ్రీ, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం ,పి సుశీల
  2. కొండపల్లి బొమ్మలాగా కులికే అమ్మాయి, రచన: రాజశ్రీ, గానం. పులపాక సుశీల
  3. ప్రియమోహనా అనురాగమయ జీవనా, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి
  4. ఈ గిలిగింత ఈ పులకింత కదిలించెను ఊహలు, రచన: రాజశ్రీ, గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

మూలాలు

[మార్చు]
  1. గాంధీ (22 May 1981). "చిత్రసమీక్ష: స్వర్గం" (PDF). ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 68, సంచిక 50. Archived (PDF) from the original on 11 సెప్టెంబరు 2022. Retrieved 11 సెప్టెంబరు 2022.

. 2. ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.