దుర్గా నాగేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కురాడ దుర్గా నాగేశ్వరరావు
దుర్గా నాగేశ్వరరావు
జననం(1931-12-15)1931 డిసెంబరు 15
మరణం2018 మే 16(2018-05-16) (వయసు 86)
జాతీయతభారతీయుడు
వృత్తిదర్శకుడు
బంధువులుసి.యస్.ఆర్ (మేనమామ)

దుర్గా నాగేశ్వరరావు తెలుగు చలనచిత్ర దర్శకుడు. ఇతడు దాసరి నారాయణరావు వద్ద దేవుడే దిగివస్తే, ఒసేయ్ రాములమ్మ వంటి సినిమాలలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశాడు. 1978లో తొలిసారి విజయ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ప్రముఖ సినిమా నటుడు సి.యస్.ఆర్ ఇతనికి మేనమామ. ఇతనికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇతడు నంది పురస్కారాల కమిటీలో జ్యూరీ సభ్యుడిగా సేవలను అందించాడు[1].

విశేషాలు[మార్చు]

ఇతడు మచిలీపట్నంలో 1931, డిసెంబరు 15న జన్మించాడు. ఇతడు ఇంటర్‌మీడియట్ వరకు మచిలీపట్నంలో చదివి మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో బి.ఎస్.సి. పూర్తి చేశాడు. కళాశాలలో చదివే సమయంలో నాటకాలలో నటించాడు. ఇతడు చదువు ముగించిన తర్వాత ప్రభుత్వ పరిశ్రమల శాఖలో ఉద్యోగంలో చేరాడు. కానీ ఇతనికి సినిమాలలో పనిచేయాలన్న కోరిక బలంగా ఉండడంతో ఎన్.టి.రామారావు ప్రోత్సాహంతో ఇతడు సినిమారంగంలో ప్రవేశించాడు.[2] 1962లో ఎన్.టి.ఆర్. నటించిన ఇరుగు పొరుగు సినిమాలో దర్శకత్వశాఖలో చేరాడు. ఆ సినిమా దర్శకుడు ఐ.ఎన్.మూర్తి వద్ద ఉంటూ శభాష్ సూరి, ఆడజన్మ, సుఖదుఃఖాలు, జగత్ కిలాడీలు వంటి సినిమాలలో సహాయకుడిగా పనిచేశాడు. ఆ తర్వాత దాసరి నారాయణరావు దగ్గర చేరి సంసారం సాగరం సినిమా మొదలుకొని అనేక సినిమాలలో పనిచేశాడు. విజయ చిత్రంతో దర్శకుడిగా మారి 10 సినిమాలకు దర్శకుడిగా పనిచేశాడు. తక్కువ సినిమాలకు దర్శకత్వం వహించినప్పటికీ ఆ చిత్రాలన్నీ ఇతనికి మంచి పేరు తెచ్చిపెట్టాయి[3].

సినిమాలు[మార్చు]

మరణం[మార్చు]

ఇతడు హైదరాబాదులోని తన స్వగృహంలో 2018, మే 16వ తేదీన తన 87వయేట గుండెపోటుతో మరణించాడు.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 విలేకరి (17 May 2018). "దర్శకుడు దుర్గా నాగేశ్వర రావు కన్నుమూత". సాక్షి దినపత్రిక. Retrieved 17 May 2018.
  2. వినాయకరావు (14 July 2010). "ఇప్పుడేం చేస్తున్నారు - దుర్గా నాగేశ్వరరావు". నవ్య వీక్లీ: 7–10. Retrieved 17 May 2018.
  3. విలేకరి (17 May 2018). "సీనియర్‌ దర్శకుడు దుర్గా నాగేశ్వరరావు ఇక లేరు!". Retrieved 17 May 2018.[permanent dead link]

బయటి లింకులు[మార్చు]