శభాష్ సూరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శభాష్ సూరి
(1964 తెలుగు సినిమా)
Sabhash suri.jpg
దర్శకత్వం ఐ.ఎన్.మూర్తి
నిర్మాణం టి.ఆర్.చక్రవర్తి
కథ శక్తి టి.కె.కృష్ణస్వామి
తారాగణం ఎన్.టి.రామారావు,
కృష్ణకుమారి,
రాజనాల,
రమణారెడ్డి,
పద్మనాభం,
గీతాంజలి,
వాసంతి,
సంధ్య
సంగీతం పెండ్యాల
నేపథ్య గానం ఘంటసాల,
పి.సుశీల
గీతరచన ఆచార్య ఆత్రేయ
సంభాషణలు ఆచార్య ఆత్రేయ
నిర్మాణ సంస్థ ఆర్.ఆర్.పిక్చర్స్
భాష తెలుగు

శభాష్ సూరి 1964, సెప్టెంబర్ 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఐ.ఎన్.మూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు, కృష్ణకుమారి, రాజనాల, రమణారెడ్డి, పద్మనాభం, గీతాంజలి, వాసంతి, సంధ్య తదితరులు నటించారు.[1] ఇది 1963లో తమిళంలో టి.ఆర్‌. రామన్న దర్శకత్వంలో ఎం.జి.రామచంద్రన్‌ కథానాయకుడిగా బి.సరోజాదేవి కథానాయికగా తెరకెక్కిన 'పెరిఎడతపెణ్‌' ఆధారంగా తెలుగులో పునర్నిర్మించబడిన చిత్రం[2].

సంక్షిప్తకథ[మార్చు]

సూరి (యన్‌.టి.ఆర్‌) సామాన్యమైన రైతుబిడ్డ విధవరాలైన అక్క (సంధ్య)తో కలిసి జీవిస్తూఉంటాడు. తన కళ్ళముందు జరుగుతున్న అన్యాయాల్ని ప్రతిఘటించేవాడు. ఇది ఆ ఊరి భూకామందు కైలాసం (రమణారెడ్డి)కి ప్రాణ సంకటంగా మారుతుంది. కైలాసంకు ఇద్దరు సంతానం కొడుకు శేషు (రాజనాల), కూతురు జలజ (కృష్ణకుమారి) బస్తీలో ఉంటారు. సూరి మేనమామ జగ్గారావు. అతనికి ఇద్దరు కూతుళ్ళు గంగ (వాసంతి), గౌరి (గీతాంజలి). సూరి ఇద్దరితో ఆడుతూ పాడుతూ పొలం పనులు చూసుకుంటాడు. వారిద్దరిలో గౌరి (గీతాంజలి) సూరిపై ఇష్టాన్ని పెంచుకుంటుంది. అయితే శేషు గౌరిని పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. ఇదిలా ఉండగా ఒకసారి జలజ విహారయాత్రకు పల్లెటూరు వస్తుంది. ఒకచోట కారు ఆగిపోతే సూరి తన ఎద్దులబండిపై వారిని గ్రామంలోకి చేరవేస్తాడు. సూరి అమాయకత్వం ఆ అమాయకత్వంలోంచి తొంగిచూసే గడుసుదనం జలజని ఆకర్షిస్తాయి. గౌరిని సూరికిచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు జగ్గారావు. గౌరిపై మనసు పారేసుకున్న శేషు (రాజనాల) ఆమెను ఎలాగైనా పెళ్ళి చేసుకు తీరాలని పట్టుబడతాడు. ఇక చేసేది లేక ఇద్దరికీ కుస్తీ పోటీ పెడతారు. ఈ పోటీలో మోసం చేసి శేషు గెలుస్తాడు. మరోవైపు జలజ సూరిని ఆటపట్టిస్తూ ఉంటుంది. పొగడ్తలతో ఆకాశానికెత్తేస్తుంది. నిజంగా సూరిని ఇష్టపడుతున్నట్లు నమ్మించేస్తుంది. అది నిజమని నమ్మేసిన సూరి తాంబూలాలు ఇవ్వడం కోసం జలజ ఇంటికి వెళతాడు. సూరి వేషభాషను పిలకముడిని చూసి అవహేళన చేస్తుంది. చావు దెబ్బ కొడుతుంది. అప్పుడు నువ్వు నన్ను ప్రేమించేట్టు చేసి నిన్నే పెళ్ళి చేసుకోకపోతే నాపేరు సూరే కాదు అంటూ ఛాలెంజ్‌ చేస్తాడు. బస్తీకి వచ్చిన సూరి ఒక సముద్ర తీరంలో వాలి (పద్మనాభాన్ని)ని చూస్తాడు. కుస్తీ పోటీల్లో మాయ చేసి ఓడించిన వారిలో అతని పాత్ర కూడా ఉంది. సూరి ద్వారా జరిగింది తెలుసుకున్న వాలి సూరి పంతం నెరవేరుస్తానని వాగ్దానం చేస్తాడు. అందులో భాగంగా సూరిని రొమాంటిక్‌ యంగ్‌మెన్‌లా మారుస్తాడు. జలజ (కృష్ణకుమారి) సూరి ప్రేమలో పీకల్లోతు మునిగిపోతుంది. సూరి లేని ప్రపంచం శూన్యమనిపిస్తుంది. సూరితో జలజ పెళ్ళి ఖాయమవుతుంది. అపుడు తను అవమానం చేసి పంపించిన పల్లెటూరి మొద్దబ్బాయే తను ప్రేమించిన సూరి అని తెలుసుకుని పశ్చాత్తాపపడుతుంది. సూరి పట్టుదలను అందరూ మెచ్చుకుంటూ 'శభాష్‌ సూరి' అంటూ అభినందిస్తారు[2].

పాటలు[మార్చు]

 1. అనగా అనగా ఒక మొనగాడు అతడు మగసిరికలవాడు - సుశీల - రచన: ఆత్రేయ
 2. ఈ వెన్నెల జజజ ఈ పున్నమి వెన్నెల జజజ - సుశీల, ఘంటసాల బృందం - రచన: ఆత్రేయ
 3. ఈ వెన్నెల ఈ పున్నమి వెన్నెల ఈనాడు ఆనాడు ఒకే - సుశీల,ఘంటసాల - రచన: ఆత్రేయ
 4. కలవాణి అలివేణి ఆడే.. ఆడే కనుపాప - సుశీల,బి.వసంత, ఘంటసాల బృందం - రచన: ఆత్రేయ
 5. చూడు చూడు పట్టయ్యా వేడుకైన పట్టణమయ్యా పట్టపగలే - ఘంటసాల - రచన: ఆత్రేయ
 6. దేవుడికేం హాయిగ ఉన్నాడు ఈ మానవుడే బాధలు పడుతున్నాడు - ఘంటసాల - రచన: ఆత్రేయ
 7. పువ్వూ పువ్వూ ఏం పువ్వు పగలే వెలిగే జాబిలి పూవు - ఘంటసాల,సుశీల - రచన: ఆత్రేయ
 8. బిత్తరపోతావు ఎందుకే ఓ పిల్లా తత్తరపడతావు దేనికే - ఘంటసాల - రచన: ఆత్రేయ

మూలాలు[మార్చు]

 1. ఏపి ప్రెస్ అకాడమీ (27 September 1964). "శభాష్ సూరి చిత్రసమీక్ష". విశాలాంధ్ర: 6. Retrieved 19 September 2017.[permanent dead link]
 2. 2.0 2.1 ఇమంది రామారావు (2 June 2018). "శభాష్ సూరి". ప్రజాశక్తి దినపత్రిక. Archived from the original on 10 మార్చి 2020. Retrieved 10 March 2020. {{cite news}}: Check date values in: |archive-date= (help)CS1 maint: bot: original URL status unknown (link)
 • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
 • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.