Jump to content

స్వర్ణ ప్రాజెక్టు

అక్షాంశ రేఖాంశాలు: 19°14′0″N 78°14′26″E / 19.23333°N 78.24056°E / 19.23333; 78.24056
వికీపీడియా నుండి

స్వర్ణ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ గ్రామ సమీపంలోని గోదావరి నదికి ఉపనది అయిన స్వర్ణ నది పై నిర్మించబడిన మధ్యస్థ నీటిపారుదల ప్రాజెక్టు. 1957లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి ఈ ప్రాజెక్టు నిర్మిణమునకు శంకుస్థాపన చేశారు[1][2][3].


స్వర్ణ ప్రాజెక్టు
స్వర్ణ ప్రాజెక్ట్
Swarna Project
స్వర్ణ ప్రాజెక్టు is located in Telangana
స్వర్ణ ప్రాజెక్టు
Telangana లో స్వర్ణ ప్రాజెక్టు స్థానం
స్వర్ణ ప్రాజెక్టు is located in India
స్వర్ణ ప్రాజెక్టు
స్వర్ణ ప్రాజెక్టు (India)
అధికార నామంస్వర్ణ ప్రాజెక్ట్
Swarna Project
ప్రదేశంస్వర్ణ గ్రామం, సారంగాపూర్ మండలం, నిర్మల్ జిల్లా,తెలంగాణ,ఇండియా
అక్షాంశ,రేఖాంశాలు19°14′0″N 78°14′26″E / 19.23333°N 78.24056°E / 19.23333; 78.24056
ప్రారంభ తేదీ1957
నిర్మాణ వ్యయం4 కోట్లు, 68 లక్షల వ్యయమైనది.
ఆనకట్ట - స్రావణ మార్గాలు
నిర్మించిన జలవనరుస్వర్ణ (నది)
Height66 అడుగులు 3.2 కి.మీ
పొడవు(1183 అడుగులు)
జలాశయం
సృష్టించేదిస్వర్ణ జలాశయం

చరిత్ర

[మార్చు]

స్వర్ణ ప్రాజెక్టు అతి పురాతనమైన ప్రాజెక్టు అప్పటి నిర్మల్ తాలుకా లోని గ్రామలలో కొన్నింటికి నీటి సరఫరా సౌకర్యం కోరకు నిజాం ప్రభుత్వం 19 వ శతాబ్దంలో నిర్మించింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మల్ జిల్లా రైతుల పోలములకు నీరందించ డానికి 1957లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి నిర్మల్ తాలుకా లోని స్వర్ణ నది పై ప్రాజెక్టు పునర్నిణమునకు శంకుస్థాపన చేశారు.నిర్మాణమునానికి ₹=4,00,000,00 అక్షరాల నాల్గు కోట్ల వ్యయమను అంచనా వేసి 30 వేల ఎకరాల భూమిని నీరు అందించే ఉద్దేశ్యంతో నిర్మింపబడింది.నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని జెవిలి ,స్వర్ణ గ్రామముల మధ్య ఈ ప్రాజెక్టు నిర్మాణము జరిగింది.112 చదరపు మైళ్ళ వైశాల్యం 1484.53 నీరు నిలువ ఉండే సామర్థ్యమున్న ఈ ప్రాజెక్టు ఎత్తు 66 అడుగులు 3.2 కి.మీ నిడివి గల ఆనకట్టకు 6 గేట్లు అమర్చబడి నది[4].గేట్ల అడుగు మట్టం 1262 రిజర్వాయరు నిటీ మట్టం 1283 అడుగులు న్నాయి.స్వర్ణ ప్రాజెక్టు కుడి కాలువ వలన కన్కంటి ,మలక్ జాం,చించోలి,గ్రామాలకు ఎడమ కాలువ వలన జాం,సారంగాపూర్, ధని,అడెల్లి, నిర్మల్ గ్రామాలు లాభాలు పొందుతున్నారు.

ప్రాజెక్టు వివరాలు

[మార్చు]

ఈ స్వర్ణ ప్రాజెక్టు సారంగాపూర్ మండలంలోని స్వర్ణ, జెవ్లి గ్రామాల మధ్య ఉంది. ఇది మండల కేంద్రమైన సారంగాపూర్ నుండి 12 కి.మీ. దూరం లోను, జిల్లా కేంద్రం నిర్మల్ కు 35 కి.మీ. దూరంలోనూ ఉంది. ఈ ప్రాజెక్టు గోదావరి నది కి ఉపనది యైన స్వర్ణ వాగు (నది) పై మట్టి,రాతి కట్టడంతో నిర్మించారు. స్వర్ణ డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 1183 అడుగులు అనగా 1.484 టి.ఎం.సికి చేరింది.జలాశయంలో 3000 క్యూసెక్కుల వరద నీరు చేరుతుంది[5]. ఈ. ప్రాజెక్టు అందుబాటులో ఉన్న నీటిలో 1.265 టి.ఎం.సి నీటిని వినియోగిస్తు రిజర్వాయర్ నిల్వ సామర్థ్యం 1.485 టి.ఎం.సి లు ,నిర్మల్ జిల్లాలో 8945 ఎకరాలు ఆయకట్టుకు సాగునీరు అందించడానికి ఉపయోగపడుతుంది. స్వర్ణ ప్రాజెక్టు కు రెండు కా లోలువలు ఉన్నాయి.ఒకటి కుడికాలువ మరోకటి ఎడమకాలువ ఈ రెండు కాలువల ద్వారా రైతులు సాగుభూములన్నింటికీ సాగు నీరందుతుంది.రైతులకు వరి నాట్లకు కావలసిన నీరును సకాలంలో విడుదల చేయడంతో పంటలు సమృద్ధిగా పండుతున్నాయి[6][7][8] [9].

మూలాలు

[మార్చు]
  1. telugu, NT News (2022-07-12). "స్వర్ణ ప్రాజెక్ట్‌ను సంద‌ర్శించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి". www.ntnews.com. Retrieved 2024-08-02.
  2. Aamani (2021-07-11). "రేపటి నుండి స్వర్ణ ప్రాజెక్టు నీటి విడుదల". www.dishadaily.com. Retrieved 2024-08-02.
  3. "పెరుగుతున్న నీటి ప్రవాహం.. జలకళ సంతరించుకున్న ప్రాజెక్టులు." News18 తెలుగు. 2024-07-29. Retrieved 2024-08-03.
  4. Velugu, V6 (2023-08-21). "నిర్మల్​జిల్లా: స్వర్ణ ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేత". V6 Velugu. Retrieved 2024-08-02. {{cite web}}: zero width space character in |title= at position 8 (help)CS1 maint: numeric names: authors list (link)
  5. Bharat, E. T. V. (2024-07-25). "స్వర్ణ జలాశయానికి వరద నీటి ఉద్ధృతి - 3500 క్యూసెక్కుల నీటి విడుదల - flood water flow to swarna project". ETV Bharat News. Retrieved 2024-08-03.
  6. ABN (2020-12-19). "స్వర్ణ ప్రాజెక్టు కాలువ ద్వారా నీరు విడుదల". Andhrajyothy Telugu News. Retrieved 2024-08-03.
  7. "స్వర్ణ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల". EENADU. Retrieved 2024-08-03.
  8. Aamani (2021-07-11). "రేపటి నుండి స్వర్ణ ప్రాజెక్టు నీటి విడుదల". www.dishadaily.com. Retrieved 2024-08-03.
  9. Velugu, V6 (2022-07-26). "స్వర్ణ ప్రాజెక్టుకి భారీ వరద.. మరోసారి గేట్లు ఎత్తివేత". V6 Velugu. Retrieved 2024-08-03.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)