స్వామి సహజానంద సరస్వతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్వామి సహజానంద సరస్వతి
జననం(1889-02-22)1889 ఫిబ్రవరి 22
మరణం1950 జూన్ 26(1950-06-26) (వయసు 61)
వృత్తిసామాజిక సంస్కర్త, చరిత్రకారుడు, తత్వవేత్త, రచయిత, సన్యాసి, విప్లవకారుడు, రైతు హక్కుల కార్యకర్త, రాజకీయవేత్త

స్వామి సహజానంద సరస్వతి (నవరంగ్ రాయ్) ( 1889 ఫిబ్రవరి 22 - 1950 జూన్ 26) ఒక సన్యాసి, ప్రఖ్యాత జాతీయవాది, కిసాన్ ఆందోళన్ నాయకుడు.

జీవిత చరిత్ర

[మార్చు]

స్వామి సహజానంద సరస్వతి 1889లో తూర్పు వాయవ్య ప్రావిన్స్‌లోని ఘజిపూర్ జిల్లా దుల్లాపూర్ సమీపంలోని దేవ గ్రామంలో జన్మించారు. వీరిది జుహౌతియా బ్రాహ్మణ కుటుంబంలో భూమిహార్ బ్రాహ్మణ ఉప సమూహం. అతను ఆరుగురు సహోదరులలో చివరివాడు.[1][2] చిన్నతనంలోనే అతని తల్లి మరణించింది. అతడిని అత్త పెంచింది.[3]

నార్త్-వెస్టర్న్ ప్రావిన్సెస్ లో (ప్రస్తుత ఉత్తరప్రదేశ్) జన్మించినప్పటికీ, అతని సామాజిక, రాజకీయ కార్యకలాపాలు ప్రారంభ రోజుల్లో ఎక్కువగా బీహార్‌పై దృష్టి సారించాయి. అతను బీహార్ సమీపంలోని బిహతా వద్ద ఒక ఆశ్రమాన్ని స్థాపించాడు. అక్కడ నుంచే అతని కార్యక్రమాలు కొనసాగించేవాడు. అతను మేధావి, గొప్ప రచయిత, సంఘ సంస్కర్త, విప్లవకారుడు కూడా.

కిసాన్ సభ ఉద్యమం బీహార్‌లో స్వామి సహజానంద సరస్వతి నాయకత్వంలో 1929లో బీహార్ ప్రావిన్షియల్ కిసాన్ సభతో ప్రారంభమైంది. సన్నకారు రైతులు, శ్రామికుల సంపూర్ణ ఆర్థిక స్వాతంత్ర్యానికై పిలుపునిచ్చాడు. క్రమంగా రైతుల ఉద్యమం తీవ్రతరం అయ్యింది. 1936 ఏప్రిల్లో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, లక్నో సెషన్‌లో ఆల్ ఇండియా కిసాన్ సభ ఏర్పాటుతో క్రమంగా భారతదేశంలో నలుమూలలా రైతుల ఉద్యమాలు విస్తరించాయి.[4][5][6]

స్వామి సహజానంద సరస్వతి 1937-1938లో బీహార్‌లో బకాష్ట్ ఉద్యమాన్ని నిర్వహించాడు. 'బకాష్ట్' అంటే స్వయంకృషి. ఈ ఉద్యమంతో బీహార్ లో అద్దె చట్టం, బకాష్ట్ భూ ​​పన్నును ఆమోదించడానికి దారితీసింది.[7][8][9] అతను బిహతాలోని దాల్మియా షుగర్ మిల్‌లో విజయవంతమైన పోరాటానికి నాయకత్వం వహించాడు. ఇక్కడ రైతు-కార్మికుల ఐక్యత అత్యంత ముఖ్యమైన విషయం.[10] క్విట్ ఇండియా ఉద్యమంలో స్వామి సహజానంద సరస్వతి అరెస్ట్ గురించి విన్నప్పుడు, సుభాష్ చంద్రబోస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ బ్రిటిష్ రాజ్ నిర్బంధంలో ఉన్నందుకు నిరసనగా ఏప్రిల్ 28న అఖిల భారత స్వామి సహజానంద సరస్వతి దినంగా పాటించాలని నిర్ణయించారు.[11]

ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు సుభాష్ చంద్రబోస్ గురుంచి మాట్లాడుతూ:

స్వామి సహజానంద సరస్వతి, మన దేశంలో యువతను ప్రొత్సాహింప జేయువారిలో ప్రముఖులు. భారతదేశంలోని రైతు ఉద్యమానికి తిరుగులేని నాయకుడు, అతను నేడు బహుజనుల ఆరాధ్యదైవం, కోట్లాది మంది వీరుడు. రామ్‌గఢ్‌లో జరిగిన అఖిల భారత రాజీ వ్యతిరేక సదస్సు రిసెప్షన్ కమిటీ చైర్మన్‌గా చేయడం నిజంగా అరుదైన అదృష్టం. ఫార్వర్డ్ బ్లాక్ కోసం ఆయన వామపక్ష ఉద్యమానికి అగ్రగామిగా ఉన్న నాయకులలో ఒకరిగా, ఫార్వర్డ్ బ్లాక్‌కు స్నేహితుడిగా, తత్వవేత్తగా, మార్గదర్శిగా ఉండటం ఒక విశేషం, గౌరవం. స్వామీజీ నాయకత్వాన్ని అనుసరించి, కాపు ఉద్యమానికి చెందిన పెద్ద సంఖ్యలో ఫ్రంట్-ర్యాంక్ నాయకులు ఫార్వర్డ్ బ్లాక్‌తో సన్నిహితంగా ఉన్నారు.

ప్రభుత్వ గుర్తింపు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Raghav Sharan, Sharma (2001). Builders of Modern India: Swami Sahajanand Saraswati. New Delhi: Prakashan Vibhag, Suchna evam Prasaran Mantralaya, Bharat Sarkar.
  2. Robb, Peter (2007). Peasants, Political Economy and Law (at p. 38, fn. 36). Oxford University Press. ISBN 978-0-19-568160-4.
  3. "Swami And Friends – Arvind N. Das". virginia.edu.
  4. Bandyopādhyāya, Śekhara (2004). From Plassey to Partition: A History of Modern India. Orient Longman. p. 406. ISBN 978-81-250-2596-2.
  5. Desai, Akshayakumar Ramanlal (1979). Peasant Struggles in India. Oxford University Press. p. 349.
  6. Bandyopādhyāya, Śekhara (2004). From Plassey to Partition: A History of Modern India. Orient Longman. p. 407. ISBN 978-81-250-2596-2.
  7. Ghose, Sankar (1991). Mahatma Gandhi. Allied Publishers. p. 262. ISBN 81-7023-205-8.
  8. Kumar, Dalip (2007). Rural Development And Social Change: Thoughts Of Swami Sahajanand. Deep & Deep Publications. ISBN 9788184500004.
  9. Das, Arvind N. (1982). Agrarian Movements in India: Studies on 20th Century Bihar. Psychology Press. ISBN 9780714632162.
  10. Judge, Paramjit S. (1992). Insurrection to Agitation: The Naxalite Movement in Punjab. Popular Prakashan. ISBN 9788171545278.
  11. Bose, S. K. (2004). Subhas Chandra Bose: The Alternative Leadership – Speeches, Articles, Statements and Letters. Orient Longman. p. 244. ISBN 978-81-7824-104-3.
  12. "Photo". pib.nic.in.
  13. Chadha, Sushma (10 July 2000). "A dull June for philatelists". Financial Express. Archived from the original on 26 February 2009. Retrieved 23 February 2009.
  14. "Indian Council of Agricultural Research Awards". Indian Council of Agricultural Research. 3 September 2008. Archived from the original on 31 May 2008. Retrieved 3 September 2008.
  15. "Cong erred by joining RJD govt, says Rama Pilot". The Times of India. 23 February 2001. Retrieved 23 February 2009.
  16. "Governor Pays Rich Tribute to Swami Sahajanand". PatnaDaily.com. 26 జూన్ 2007. Archived from the original on 1 అక్టోబరు 2008. Retrieved 19 ఆగస్టు 2008.