స్వీడన్‌లో హిందూమతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవనాగరిలో "ఓం" గుర్తు

హిందూ మతం స్వీడన్‌లో 0.3% జనాభా లేదా 30,000 మంది ప్రజలు ఆచరించే మైనారిటీ మతం. [1] హిందూమతం ప్రధానంగా భారతీయ మూలాలున్నవారు, ప్రవాస భారతీయులు ఆచరిస్తారు. వారిలోనూ అత్యధికులు పంజాబీలు, బెంగాలీలు, గుజరాతీలు, తెలుగు వారు, తమిళులు, కన్నడిగులు . [2]

చరిత్ర

[మార్చు]

1950లలో స్వీడన్ వెళ్లిన కొందరు భారతీయ విద్యార్థులు అక్కడే స్థిరపడ్డారు. 1970లలో ఉగాండా నుండి భారతీయుల ప్రవాహం మరొకటి వచ్చింది. కొంతమంది భారతీయులు 1984 తర్వాత రాజకీయ ఆశ్రయం పొందారు. ఇక్కడి భారతీయ సమాజం సాంస్కృతికంగా చాలా చురుకుగా ఉంటుంది. వివిధ సంఘాలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తాయి. జాతీయ దినోత్సవాలను నిర్వహిస్తాయి. [3]

శ్రీలంక నుండి వచ్చిన తమిళ హిందూ శరణార్థులు, బంగ్లాదేశ్ నుండి వచ్చిన హిందూ శరణార్థులు కూడా స్వీడన్‌లో ఉన్నారు. 2008లో స్వీడన్ వలస విధాన సంస్కరణ తర్వాత, ఇక్కడికి కార్మికుల సరఫరా చెయ్యడంలో భారతదేశం ప్రముఖ దేశంగా మారింది. వీరిలో ఎక్కువ మంది కంప్యూటర్ నిపుణులు. [4]


జనాభా వివరాలు

[మార్చు]
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
201020,000—    
202030,000+50.0%
సంవత్సరం శాతం మార్పు
2010 0.2% -
2020 0.3% +0.1%

2005లో హిందువులు 7,000 నుండి 10,000 వరకు ఉన్నారు. [5] 10,000 మంది హిందువులలో 2,000 మంది తమిళ మూలాలు, [6] 1,500 మంది బెంగాలీ మూలాలు కలిగినవారు.

స్వీడన్‌లో హిందూమతం చాలా నెమ్మదిగా పెరుగుతోంది. గత పదేళ్లలో, స్వీడన్‌లోని హిందూ జనాభా వలసల ద్వారా ఏటా 1.06 శాతం మాత్రమే పెరిగింది. [7]

స్వీడన్‌లోని హిందూ సంస్థలు

[మార్చు]

హిందూ ఫోరమ్ స్వీడన్ (HFS) స్వీడన్‌లోని ప్రధాన హిందూ సంఘం. HFS అనేది హిందూ ఫోరమ్ యూరప్ (HFE) ఛత్రఛాయలో ఉన్న సంస్థ. 2018లో ఈ సంస్థ, దీపావళిని స్వీడన్‌లోని హిందువులు, స్వీడిష్ రాజకీయ నాయకులు, మతాంతర ప్రతినిధులతో కలిసి జరుపుకుంది. ఇతర హిందూ సంఘాలు:

  • బెంగాలీ హిందూ సంఘం
  • హిందూ మందిర్ స్టాక్‌హోమ్ (స్టాక్‌హోమ్ హిందూ దేవాలయం)
  • హిందూ యూనియన్ జోంకోపింగ్
  • స్టాక్‌హోమ్ కన్నడ కూటమి
  • ఇంటర్నేషనల్ స్వామినారాయణ్ సత్సంగ్ ఆర్గనైజేషనుకు మేరీస్టాడ్‌లో ఒక దేవాలయాన్ని ఉంది

స్వీడన్‌లో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్

[మార్చు]

ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ ఉద్యమానికి మూలాలు హిందూ మతంలో ఉన్నాయి.

ఈ ఉద్యమం స్వీడన్‌లో కింది ప్రదేశాల నుండి పనిచేస్తోంది.

కోర్స్నాస్ గార్డ్, ప్రధాన భవనం 2014.
  • కోర్స్నాస్ గార్డ్, స్టాక్‌హోమ్ కౌంటీలోని బోట్‌కిర్కా మునిసిపల్‌లో, గ్రామీణ ప్రాంతంలో హరే కృష్ణ దేవాలయం ఏర్పాటు చేసింది. హరే కృష్ణ పుస్తకాలను ప్రపంచం మొత్తానికి వివిధ భాషలకు అనువదించే ప్రచురణ సంస్థ BBT (భక్తివేదాంత బుక్ ట్రస్ట్ )తో కలిసి పనిచేయడం కోర్స్నాస్ ప్రధాన విధిగా ఉంది. ఉద్యమాన్ని ప్రారంభించిన శ్రీల ప్రభుపాద 1973లో స్వీడన్‌ను సందర్శించాడు.
  • స్టాక్‌హోమ్‌లోని హరే కృష్ణ కేంద్రం ఒక రెస్టారెంటును, ఒక దుకాణాన్ని, ఒక చిన్న దేవాలయాన్నీ నడుపుతోంది.
  • స్టాక్‌హోమ్ కౌంటీకి దక్షిణాన ఉన్న ఆల్మ్‌విక్స్ గార్డ్ లో కూడా ఒక దేవాలయం ఉంది. వాస్తవానికి ఇది వ్యవసాయ సహకార సంఘం. కానీ తరువాత అక్కడ నివసిస్తున్న కుటుంబాలతో వ్యవసాయాన్ని కలిపి ఒక గ్రామ ప్రాజెక్ట్‌గా మార్చబడింది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Religion in Sweden". globalreligiousfutures.org.
  2. "Indian diaspora" (PDF). Archived from the original (PDF) on 2014-12-26. Retrieved 2007-03-19.
  3. "ibid" (PDF). Archived from the original (PDF) on 2014-12-26. Retrieved 2007-03-19.
  4. "Dear Hindutva Trolls Abusing Muslim Refugees, Tomorrow It Will be Your Turn to be Under Far-Right's Radar of Hatred".
  5. United States Department of State IRF 2005
  6. Tamilnation.org
  7. "Dear Hindutva Trolls Abusing Muslim Refugees, Tomorrow It Will be Your Turn to be Under Far-Right's Radar of Hatred".