హరీస్ సోహైల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హరిస్ సోహైల్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1989-01-09) 1989 జనవరి 9 (వయసు 35)
సియాల్‌కోట్, పంజాబ్, పాకిస్తాన్[1]
మారుపేరుహ్యారీ[2]
ఎత్తు5 ft 11 in (180 cm)[3]
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్
పాత్రమిడిల్ ఆర్డర్ బ్యాటర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 229)2017 సెప్టెంబరు 28 - శ్రీలంక తో
చివరి టెస్టు2021 జనవరి 3 - న్యూజీలాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 192)2013 జూలై 19 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే2023 జనవరి 13 - న్యూజీలాండ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.89
తొలి T20I (క్యాప్ 54)2013 జూలై 28 - వెస్టిండీస్ తో
చివరి T20I2019 నవంబరు 8 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2008ZTBL
2007Sialkot క్రికెట్ జట్టు
2007–2015Sialkot Stallions
2013Khulna Royal Bengals
2017–2018పెషావర్ జాల్మి
2019లాహోర్ కలందర్స్
2019–2023బలూచిస్తాన్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ODI ట్వంటీ20 ఫక్లా
మ్యాచ్‌లు 16 42 14 81
చేసిన పరుగులు 847 1,685 210 5,056
బ్యాటింగు సగటు 32.57 46.80 19.09 45.96
100లు/50లు 2/3 2/14 0/2 13/29
అత్యుత్తమ స్కోరు 147 130 52 211*
వేసిన బంతులు 630 642 984
వికెట్లు 13 11 15
బౌలింగు సగటు 22.61 55.72 33.26
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/1 3/45 3/1
క్యాచ్‌లు/స్టంపింగులు 14/– 17/– 3/– 45/–
మూలం: ESPNCricinfo, 15 January 2023

హరిస్ సోహైల్ (జననం 1989, జనవరి 9) పాకిస్తానీ క్రికెటర్. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌గా, అప్పుడప్పుడు ఎడమచేతి ఆర్థోడాక్స్ బౌలర్ గా రాణించాడు.

2013 జూలైలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.

2018 ఆగస్టులో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ద్వారా 2018–19 సీజన్‌కు సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ముప్పై-మూడు మంది ఆటగాళ్ళలో ఇతను ఒకడు.[4][5]

వ్యక్తిగత జీవితం[మార్చు]

హరీస్ 1989, జనవరి 9న పాకిస్తాన్ పంజాబ్‌లోని సియాల్‌కోట్‌లో పంజాబీ గుజ్జర్[6] కుటుంబంలో జన్మించాడు. పూర్తిపేరు చౌదరి హరీస్ సోహైల్ గుజ్జర్.

దేశీయ క్రికెట్[మార్చు]

సియాల్‌కోట్ స్టాలియన్స్, జరై తారకియాతి బ్యాంక్ లిమిటెడ్ క్రికెట్ జట్టు, సియాల్‌కోట్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అతను పెషావర్ జల్మీ, లాహోర్ ఖలందర్‌లకు ప్రాతినిధ్యం వహించాడు.

అంతర్జాతీయ క్రికెట్[మార్చు]

2012లో, శ్రీలంకలో జరిగే వారి ట్వంటీ 20 ఇంటర్నేషనల్ సిరీస్ కోసం హారిస్ పాకిస్థాన్ జట్టులో ఎంపికయ్యాడు.[7] 2013 దక్షిణాఫ్రికా పర్యటన కోసం పాకిస్తాన్ టెస్ట్ జట్టుకు పిలవబడ్డాడు.[8] 2013 జూలై 19న పాకిస్తాన్ తరపున తన వన్డే ఇంటర్నేషనల్ అరంగేట్రం చేసాడు.

2014లో న్యూజిలాండ్‌తో జరిగిన 1వ వన్డేలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్న సోహైల్ నాటౌట్ 85 పరుగులు చేశాడు. 2వ మ్యాచ్‌లో 33 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. చివరి రెండు మ్యాచ్ లలో వరుసగా 13, 65 పరుగులు చేశాడు. 235 పరుగులతోపాటు 6 వికెట్లు తీసి పాకిస్థాన్ టాప్ స్కోరర్‌గా 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ముగించాడు.[9][10]

2017 సెప్టెంబరులో, శ్రీలంకతో జరిగిన వారి సిరీస్ కోసం పాకిస్తాన్ టెస్ట్ జట్టులో ఎంపికయ్యాడు. [11] 2017 సెప్టెంబరు 28న శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టులో పాకిస్తాన్ తరపున తన అరంగేట్రం చేశాడు.[12]

2018 అక్టోబరులో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సోహైల్ టెస్ట్ క్రికెట్‌లో తన మొదటి సెంచరీని 110 పరుగులు చేశాడు.[13] 2019 మార్చిలో, వన్డే క్రికెట్‌లో తన మొదటి సెంచరీని సాధించాడు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆస్ట్రేలియాపై అజేయంగా 101 పరుగులు చేశాడు.[14]

2019 ఏప్రిల్ లో, 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు.[15][16] టోర్నమెంట్‌లోని తన 2వ గేమ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 59 బంతుల్లో 89 పరుగులతో మ్యాన్ ఆఫ్ ది[17] అయ్యాడు.

2019 సెప్టెంబరులో, సొహైల్ 2019-20 క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీ టోర్నమెంట్‌కు బలూచిస్తాన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.[18][19]

మూలాలు[మార్చు]

 1. "Haris Sohail". espn cricinfo. ESPN Sports Media. Retrieved 21 March 2015.
 2. "Delighted Arthur heaps praise on 'passionate' Pakistan". The News International (newspaper). 25 June 2019. Retrieved 14 March 2022.
 3. Haris Sohail’s profile on Sportskeeda
 4. "PCB Central Contracts 2018–19". Pakistan Cricket Board. Retrieved 6 August 2018.
 5. "New central contracts guarantee earnings boost for Pakistan players". ESPN Cricinfo. Retrieved 6 August 2018.
 6. Farrukh, Yusra (2015-01-12). "Cricketer Haris Sohail Nikkah Held". Awami Web (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-12-22. Haris was born in Sialkot, Pakistan into a Gujjar tribe. He is a left arm orthodox.
 7. Mohammad Irfan, Ehsan Adil in Test squad, ESPNCricinfo, 11 January 2013, retrieved 21 March 2015
 8. Sri Lanka v Pakistan – Pakistan Twenty20 Squad, ESPNcricinfo, retrieved 21 March 2015
 9. "Results | Global | ESPNcricinfo.com". Cricinfo (in ఇంగ్లీష్). Retrieved 2019-07-29.
 10. "Pakistan v New Zealand ODI Series - Find Cricket Records & Stats | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2019-07-29.
 11. "Uncapped Hamza, Sohail picked for SL Tests". ESPN Cricinfo. Retrieved 23 September 2017.
 12. "1st Test, Sri Lanka tour of United Arab Emirates and Pakistan at Abu Dhabi, Sep 28-Oct 2 2017". ESPN Cricinfo. Retrieved 28 September 2017.
 13. "Haris Sohail stars for Pakistan but Australia fight back". International Cricket Council. Retrieved 8 October 2018.
 14. "Haris Sohail ton powers Pakistan to 280". Cricbuzz. Retrieved 22 March 2019.
 15. "Mohammad Amir left out of Pakistan's World Cup squad". ESPN Cricinfo. Retrieved 18 April 2019.
 16. "Amir left out of Pakistan's World Cup squad". International Cricket Council. Retrieved 18 April 2019.
 17. "Haris Sohail steers Pakistan to victory and sends South Africa packing". Guardian. Retrieved 23 June 2019.
 18. "PCB announces squads for 2019-20 domestic season". Pakistan Cricket Board. Retrieved 4 September 2019.
 19. "Sarfaraz Ahmed and Babar Azam to take charge of Pakistan domestic sides". ESPN Cricinfo. Retrieved 4 September 2019.

బాహ్య లింకులు[మార్చు]