హాథీగుంఫా శాసనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భువనేశ్వర్ లోని ఉదయగిరి కొండల్లో హాథీగుంఫా
ఖారవేలుని హాథీగుంఫా శాసనం

హాథీగుంఫా శాసనం క్రీ. పూ 2వ శతాబ్దంలో ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్ సమీపంలో ఉదయగిరి గుహలలో అప్పటి కళింగ పాలకుడు ఖారవేలుడు చెక్కించిన శిలాశాసనం.[1] ఇది ఉదయగిరి కొండల్లో దక్షిణం వైపున ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ హాథీగుంఫా అనే గుహలో రాతిపై ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపిలో 17 వరుసల్లో చెక్కబడి ఉంది.

నేపథ్యం[మార్చు]

ఈ శాసనం కళింగ పరిపాలకుడైన ఖారవేలుని గురించి ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేస్తుంది. ప్రధానంగా ఖారవేలుడు శాతవాహన రాజైన శాతకర్ణితో ప్రారంభించి ఇతర రాజ్యాలపై కొనసాగించిన దండయాత్రల గురించి ప్రస్తావించబడి ఉంది.

1885 లో భగవాన్ లాల్ ఇంద్రాజీ అనే చరిత్రకారుడు దీన్ని సాధికారంగా అధ్యయనం చేసి ఆరవ అంతర్జాతీయ ప్రాచ్య పరిశోధకుల సదస్సులో సమర్పించాడు. ఈ శాసనంలో ప్రశంసించబడిన రాజు పేరు ఖారవేలుడు అని తెలియజేసిన మొట్టమొదటి పండితుడు ఈయనే.[2]

ముఖ్యాంశాలు[మార్చు]

  • ఖారవేలుడు రాజుగా పట్టాభిషిక్తుడు కాగానే కళింగ నగరి కోట ద్వారాలను బాగు చేశాడు. తుఫాను వల్ల దెబ్బతిన్న పలు నిర్మాణాలను పునర్నిర్మించాడు. ముప్ఫై ఐదు వేల వరహాల ఖర్చుతో ప్రజల సంక్షేమం కోసం చెరువులు తవ్వించి నగరమంతా పచ్చని తోటలు పెంచాడు.
  • రెండో సంవత్సరం శాతకర్ణి చక్రవర్తిని లక్ష్యపెట్టక అనేక రథ, గజ, తురగ, పదాతి దళాలను పంపి అశిక నగరంలో విధ్వంసం సృష్టించాడు.

గమనికలు[మార్చు]

  1. Krishan 1996, p. 23.
  2. A. F. Rudolf Hoernlé (2 February 1898). "Full text of "Annual address delivered to the Asiatic Society of Bengal, Calcutta, 2nd February, 1898"". Asiatic Society of Bengal. Retrieved 4 September 2014.

మూలం[మార్చు]