హిందుత్వం: ఎవరు హిందువు?

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హిందుత్వం: ఎవరు హిందువు?
కృతికర్త: వినాయక్ దామోదర్ సావర్కర్
దేశం: భారతదేశం
విభాగం (కళా ప్రక్రియ): కరపత్రం
ప్రచురణ:
విడుదల: విలియం హట్ కర్జన్ విల్లీ హత్య ఆరోపణలో జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో

హిందుత్వం: ఎవరు హిందువు? అనేది వినాయక్ దామోదర్ సావర్కర్ రాసిన సైద్ధాంతిక కరపత్రం. ఇది 1923లో ఎస్సెన్షియల్స్ ఆఫ్ హిందుత్వ పేరుతో పునర్ముద్రించబడింది. ఇది స్వాతంత్ర్యం తర్వాత సమకాలీన హిందూ జాతీయవాదాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది.[1]

నేపథ్యం

[మార్చు]

సావర్కర్ ఈ కరపత్రంలో హిందూ మతాన్ని మతం గా అంగీకరించలేదు సరికదా, అది ఒక భారతీయ జీవన విధానంగా భావిస్తూ, హిందూ అనేది మతం కాదు ధర్మం అని ప్రస్తావించాడు.[2][3] ఆధునిక హిందుత్వ వాదులు ఉపయోగించే హిందుమతం అనే పదం దీనికి భిన్నమైందని, ఎందుకంటే దీనిలో హిందువులు మాత్రమే కాకుండా అన్ని మతాలు ఉన్నాయని చెప్పాడు. హిందువులు, భారతదేశాన్ని తమ పూర్వీకులు నివసించిన భూమిగా, అలాగే వారి ధర్మం ఉద్భవించిన భూమిగా భావిస్తారు. ఆ కోణంలో హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని అతను వాదించాడు.[1]

సావర్కర్ అన్ని భారతీయ మతాలను "హిందుత్వం" అనే పదంలో చేర్చాడు. మొత్తం భారత ఉపఖండం అంతటా విస్తరించి ఉన్న "హిందూ రాష్ట్రం" (హిందూ దేశం) "అఖండ భారత్" (అవిభక్త భారతదేశం) గురించి తన ఆలోచనను ఈ కరపత్రంలో వివరించాడు.[4]

రాసిన కాలం

[మార్చు]

విలియం హట్ కర్జన్ విల్లీ హత్య ఆరోపణలో జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో సావర్కర్ ఈ కరపత్రాన్ని రాశాడు.[5]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Peter Lyon (2008), Conflict between India and Pakistan: an encyclopedia, ABC-CLIO, p. 75, ISBN 978-1-57607-712-2
  2. Women, States, and Nationalism. Routledge. pp. 104–. ISBN 978-0-203-37368-2. Retrieved 24 April 2013.
  3. Tharoor, Shashi (26 February 2018). "Veer Savarkar: The man credited with creating Hindutva didn't want it restricted to Hindus". ThePrint. Retrieved 4 January 2021.
  4. Elst, Koenraad (5 July 2001). "Decolonizing the Hindu Mind: Ideological Development of Hindu Revivalism". Rupa & Company. p. 140 – via Google Books. It was during his stay in Ratnagiri prison, in 1922, that he wrote his influential book Hindutva ("Hindu-ness"). The text was smuggled out and published under a pseudonym. The highlight of the book was his definition of the term Hindu: "one for whom India is both Fatherland and Holyland".
  5. Shōgimen, Takashi; Nederman, Cary J. (2009), Western political thought in dialogue with Asia, Lexington Books, p. 190, ISBN 978-0-7391-2378-2