హిమాద్రి సింగ్
హిమాద్రి సింగ్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 23 మే 2019 | |||
ముందు | జ్ఞాన్ సింగ్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | షాడోల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | న్యూఢిల్లీ , భారతదేశం | 1988 ఏప్రిల్ 9||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | దల్బీర్ సింగ్, రాజేష్ నందిని | ||
జీవిత భాగస్వామి | నరేంద్ర మరావి | ||
సంతానం | 1 | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు | ||
మూలం | [1] |
హిమాద్రి సింగ్ (జననం 9 ఏప్రిల్ 1988) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె షాడోల్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1][2]
వ్యక్తిగత జీవితం
[మార్చు]హిమాద్రి సింగ్ 1988 ఏప్రిల్ 9న న్యూఢిల్లీలో దల్బీర్ సింగ్, రాజేష్ నందిని దంపతులకు జన్మించింది. ఆమె ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లోని మొనాడ్ యూనివర్సిటీలో బీఏ పూర్తి చేసింది. హిమాద్రి సింగ్ 2017లో నరేంద్ర సింగ్ మరావిని వివాహం చేసుకుంది. వారికీ ఒక కూతురు ఉంది.
రాజకీయ జీవితం
[మార్చు]హిమాద్రి సింగ్ రాజకీయ కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి 2016 లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయింది.[3] ఆమె ఆ తర్వాత 2017లో బీజేపీలో చేరి 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో షాడోల్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ప్రమీలా సింగ్‌ను 4,03,333 ఓట్ల తేడాతో ఓడించి తొలిసారిగా లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికై పార్లమెంట్‌లో ఫుడ్ అండ్ కన్స్యూమర్ అఫైర్స్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్టాండింగ్ కమిటీలో సభ్యురాలిగా పని చేసింది.
హిమాద్రి సింగ్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో షాడోల్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఫుండేలాల్ సింగ్ మార్కోపై 3,97,340 ఓట్ల తేడాతో ఓడించి రెండోసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ TimelineDaily (5 March 2024). "BJP Nominates Sitting MP Himadri Singh For Shahdol Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 15 August 2024. Retrieved 15 August 2024.
- ↑ TV9 Bharatvarsh (5 June 2024). "शहडोल लोकसभा सीट से जीतने वाली BJP की हिमाद्री सिंह कौन हैं? जानिए अपने सांसद को". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Times of India (17 April 2019). "Two women slug it out in Shahdol". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
- ↑ India Today (2024). "Shahdol lok sabha election results 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
- ↑ "2024 Loksabha Elections Results - Shahdol". 4 June 2024. Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.