హుంద్రు జలపాతం
Appearance
హుంద్రు జలపాతం | |
---|---|
ప్రదేశం | రాంచీ జిల్లా, జార్ఖండ్, భారతదేశం |
అక్షాంశరేఖాంశాలు | 23°27′00″N 85°39′00″E / 23.4500°N 85.6500°E |
సమద్రతలం నుండి ఎత్తు | 456 మీటర్లు (1,496 అడుగులు) |
మొత్తం ఎత్తు | 98 మీటర్లు (322 అడుగులు) |
నీటి ప్రవాహం | సువర్ణలేఖ నది |
హుంద్రు జలపాతం జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీ జిల్లాలో ఉన్న జలపాతం.[1] రాంచీ సమీపంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటైన ఈ జలపాతం[2], భారతదేశంలోనే 34వ అతిపెద్ద జలపాతంగా గుర్తింపుపొందింది.[3]
జలపాతం గురించి
[మార్చు]ఇది సువర్ణలేఖ నదిలో ఏర్పడిన జలపాతం. 98 మీటర్ల (322 అడుగుల ఎత్తు) ఎత్తు నుండి జాలువారుతున్న ఈ జలపాతం జార్ఖండ్ రాష్ట్రంలోని అత్యంత ఎత్తైన జలపాతాలలో ఒకటి. జలపాతం నుండి నిరంతరంగా నీరు పడటంవల్ల అక్కడి రాళ్ళు వివిధ నిర్మాణాలుగా మారి ఆ ప్రాంతానికి మరింత సౌందర్యాన్ని తెచ్చాయి.[4][5][6] వర్షాకాలంలో ఈ జలపాతం సుందరంగా ఉంటూ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడ స్నానం చేయడంకోసం ఈత కొలను కూడా ఉంది.[4]
ప్రయాణమార్గం
[మార్చు]రాంచీ-పురూలియా రహదారిలో 45 కిలోమీటర్లు (28 మైళ్ళు) దూరంలో, ప్రధాన రహదారి నుండి సుమారు 21 కిలోమీటర్ల (13 మైళ్ళు) దూరంలో ఈ హుంద్రు జలపాతం ఉంది.[7]
మూలాలు
[మార్చు]- ↑ నమస్తే తెలంగాణ, నిపుణ - విద్యా సమాచారం (27 January 2017). "జార్ఖండ్ సమాచారం". Archived from the original on 29 జూన్ 2018. Retrieved 29 June 2018.
- ↑ "Jharkhand Tourism | Major Destinations and Attraction | How to Reach". Travel News India (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-08-07. Archived from the original on 2018-09-09. Retrieved 2017-02-24.
- ↑ "Showing all Waterfalls in India". World Waterfalls Database. Archived from the original on 25 ఆగస్టు 2012. Retrieved 29 జూన్ 2018.
- ↑ 4.0 4.1 "Hundru Falls Ranchi". Maps of India. Retrieved 29 June 2018.
- ↑ "The other side of this industrial city". The Hindu Business Line, 28 July 2003. Retrieved 29 June 2018.
- ↑ "Hundru Falla". District administration. Archived from the original on 24 జనవరి 2010. Retrieved 29 June 2018.
- ↑ Sir John Houlton, Bihar, the Heart of India, p. 144, Orient Longmans, 1949