Jump to content

హజూర్ సాహిబ్ నాందేడ్ రైల్వే డివిజను

వికీపీడియా నుండి
(హుజూర్ సాహెబ్ రైల్వే నాందేడ్ డివిజను నుండి దారిమార్పు చెందింది)

నాందేడ్ రైల్వే డివిజను అనునది దక్షిణ మధ్య రైల్వే జోన్ యందలి ఆఱు రైల్వే విభాగములలో నొకటి. ఈ రైల్వే విభాగము 2003 ఏప్రిల్ 1 న స్థాపించబడినది. అంతకు మునుపు ఈ విభాగ పరిధిలోని రైలు మార్గమంతయు హైదరాబాదు విభాగ పరిధిలోనుండెను. నాందేడ్ విభాగము యొక్క ప్రధాన కేంద్రం భారతదేశం లోని మహారాష్ట్ర రాష్ట్రంలో నాందేడ్ వద్ద ఉంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఆఱు రైల్వే విభాగములు కలవు. అవి

సికింద్రాబాద్ వద్ద దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఉంది.[1][2][3]

చరిత్ర

[మార్చు]
  • 1900: మన్మాడ్-సికింద్రాబాదు మీటర్ గేజి మార్గము ప్రారంభించబడెను.
  • 1930: హైదరాబాద్ గోదావరి వ్యాలీ రైల్వే, నిజాం స్టేట్ రైల్వే లోకి విలీనము చేయబడెను.
  • 1954: ఖండ్వా-హింగోలి మీటర్ గేజి రైల్వే మార్గ నిర్మాణమునకు అనుమతి లభించెను
  • 1960: ఖండ్వా-హింగోలి మీటర్ గేజి రైల్వే మార్గ నిర్మాణము పూర్తి అయ్యెను. ఈ మార్గ నిర్మాణము వలన, తపతి, పూర్ణ మొదలగు నదులను సత్పుర, మేల్ఘాట్ మొదలుగు పర్వత శ్రేణులను దాటుకొనుచు ఉత్తర దక్షిణ భారతములు మీటరు గేజిచే అనుసంధానింపబడెను.నవంబరు 1-వ తేదీన సరకు రైళ్ళు నడుపబడెను.
  • 1961: ఖండ్వా-హింగోలి మీటర్ గేజి రైల్వే మార్గముపై ప్రయాణికుల రైళ్ళు నడుపబడెను.
  • 1966: దక్షిణ మధ్య రైల్వే ఆవిర్భవించెను. ప్రస్తుత నాందేడ్ మండలమంతయు ఆ నాటికి మధ్య రైల్వే యొక్క సికింద్రాబాదు విభాగములో నుండెను.
  • 1967: ఏప్రియల్ 1-వ తేది శనివారము నాడు భారత దేశమందలి అత్యంత వేగముగ నడిచెడి మీటర్ గేజ్ రైలైన అజంతా ఎక్స్‌ప్రెస్ కాచిగూడ-మన్మాడ్ నడుమ ప్రవేశపెట్టబడెను. దాని సగటు వేగము గంటకు 42.5 కి.మీ.
  • 1977: దక్షిణ మధ్య రైల్వే యొక్క సికింద్రాబాదు విభాగము రెండుగా విభజింపబడెను. బ్రాడ్ గేజి మార్గమంతటితో సికింద్రాబాదు విభాగమును మీటరు గేజి మార్గమంతటితో హైదరాబాదు విభాగమును ఏర్పరచబడెను. ప్రస్తుత నాందేడ్ విభాగమంతయు మీటర్ గేజి కలిగియుండుటచే హైదరాబాదు విభాగములో భాగమాయెను.
  • 1992: మన్మాడ్-ఔరంగాబాద్ మధ్య గేజ్ మార్పిడి పనులు ప్రారంభము
  • 1994: మన్మాడ్-ఔరంగాబాద్ మధ్య బ్రాడ్ గేజ్ మార్గ ప్రారంభము
  • 1995: ఔరంగాబాద్-ముద్ఖేడ్ నడుమనున్న మీటర్ గేజ్ మార్గము దశలవారీగా బ్రాడ్ గేజ్ కు మార్చబడెను. దీనితో ఉత్తర దక్షిణ భారతముల మధ్యనున్న మీటర్ గేజ్ అనుసంధానము తెంచబడెను. ముద్ఖేడ్-సికింద్రాబాద్ మార్గము ఇంకను మీటర్ గేజిపైనుండెను. కాచిగూడ మన్మాడ్ నడుమ, మారు మార్గమున అజంతా ఎక్స్ ప్రెస్ నడుపబడెను.
  • 1995: నాందేడ్-అమృతసరస్సు నడుమ అత్యంత ప్రతిష్ఠాత్మక సచ్ ఖండ్ వీక్లీ ఎక్స్ ప్రెస్ ప్రారంభింపబడెను. ఇది 2007 లో దినసరి రైలుగా మార్చబడెను.
  • 2003: దక్షిణ మధ్య రైల్వే యొక్క హైదరాబాదు విభాగము రెండుగా విభజింపబడి నాందేడ్ విభాగము ఆవిర్భవించెను.
  • 2004: పూర్ణా-అకోలా జంక్షన్ల నడుమ గేజి మార్పిడి పనులు ప్రారంభము
  • 2008: నవంబరు 12-వ తేదీన పూర్ణా-అకోలా నడుమ బ్రాడ్ గేజి రైళ్ళు ప్రారంభము.
  • 2011: జనవరి 1-వ తేదీ 12071/12072 జాల్నా-దాదర్ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ప్రారంభింపబడెను.
  • 2014: మార్చి 2-వ తేదీ ఆదివారము 16003/16004 చెన్నై సెంట్రల్-నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభింపబడెను.
  • 2015: ఫిబ్రవరి15-వ తేది 17623/17624 హజూర్ సాహిబ్ నాందేడ్-బికనేర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభింపబడెను.
  • 2019: మార్చి-19వ తేది మంగళవారమునాడు నాందేడ్ హజ్రత్ నిజాముద్దీన్ నడుమ మరాఠ్వాడా సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ప్రారంభింపబడెను.

పరిధి

[మార్చు]

దక్షిణ మధ్య రైల్వే యొక్క నాందేడు మండలము మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ మఱియు తెలంగాణ రాష్ట్రములలో విస్తరించియున్నది.

ముద్ఖేడ్ జంక్షన్-హజూర్ సాహిబ్ నాందేడ్-పుర్ణా జంక్షన్-పర్భణి జంక్షన్-ఔరంగాబాద్-నాగర్‌సోల్-మన్మాడ్ జంక్షన్ (స్టేషను కాకుండగ)
ముద్ఖేడ్ జంక్షన్-అదిలాబాదు-పింపలఖుటి (స్టేషను కాకుండగ)
పూర్ణా జంక్షన్-అకోలా జంక్షన్ (స్టేషను కాకుండగ) -ఖాండ్వా జంక్షన్ (స్టేషను కాకుండగ)
పర్భణి జంక్షన్-పరళి వైద్యనాథ్ జంక్షన్ (స్టేషను కాకుండగ)

అనుసంధానము

[మార్చు]

హజూర్ సాహిబ్ నాందేడ్ విభాగము, దక్షిణ మధ్య రైల్వేయందలి ఇతర విభాగములతో ఈ క్రింది ప్రాంతములలో అనుసంధానమగును.

  • ముద్ఖేడ్ జంక్షన్ యొద్ద హైదరాబాదు విభాగముతో
  • పరళి వైద్యనాథ్ జంక్షన్ యొద్ద సికింద్రాబాదు విభాగముతో

హజూర్ సాహిబ్ నాందేడ్ విభాగము, భారతీయ రైల్వేల ఇతర మండలములతో ఈ క్రింది ప్రాంతములలో అనుసంధానమగును.

  • మన్మాడ్ జంక్షన్ యొద్ద మధ్య రైల్వే యొక్క భుసావళ్ విభాగముతో
  • అకోలా జంక్షన్ యొద్ద మధ్య రైల్వే యొక్క భుసావళ్ విభాగముతో
  • ఖండ్వా జంక్షన్ యొద్ద మధ్య రైల్వే యొక్క భుసావళ్ విభాగముతోను, పశ్చిమ రైల్వే యొక్క రత్లాము విభాగముతోను, పశ్చిమ మధ్య రైల్వే యొక్క భోపాల్ విభాగముతోను
  • పింపలకుట్టి యొద్ద మధ్య రైల్వే యొక్క నాగపుర్ విభాగముతో

రైల్వే స్టేషన్ల మఱియు పట్టణాల జాబితా

[మార్చు]

ఈ జాబితాలో నాందేడ్ రైల్వే డివిజన్లో ఉన్న స్టేషన్లు, వారి స్టేషను వర్గం వారీగా ఉన్నాయి.[4][5][6]

స్టేషను వర్గం స్టేషన్లు మొత్తం స్టేషన్లు పేర్లు
ఎ-1 వర్గం 1 ఔరంగాబాద్
వర్గం 5 నాందేడ్, పూర్ణా జంక్షన్, పర్భణి జంక్షన్, జల్నా, నాగర్‌సోల్
బి వర్గం 3 ముద్ఖేడ్, అదిలాబాద్
సి వర్గం
(సబర్బన్ స్టేషను)
- -
డి వర్గం 12 అకోట్, పొటూల్, గంగాఖేడ్, హింగోలి డెక్కన్, మాన్వత్ రోడ్, పార్టూర్, రొటేగాఁవ్, సెలు, కింవట్, భోకర్, హిమాయత్‌నగర్,   వాషిమ్, ముకుంద్వాడి హాల్ట్
వర్గం 60 -
ఎఫ్ వర్గం
హాల్ట్ స్టేషను
23 -
మొత్తం 103 -

ముఖ్యమైన రైళ్ళు

[మార్చు]

హజూర్ సాహిబ్ నాందేడ్ రైల్వే డివిజనులో ప్రయాణమును ప్రారంభించు/ముగించు రైళ్ళు

హజూర్ సాహిబ్ నాందేడ్ రైల్వే డివిజను మీదుగా ప్రయాణించు రైళ్ళు:

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Zones and their Divisions in Indian Railways" (PDF). Indian Railways. Archived from the original (PDF) on 19 March 2015. Retrieved 13 January 2016.
  2. "Nanded Railway Division". Railway Board. South Central Railway zone. Archived from the original on 8 జనవరి 2016. Retrieved 13 జనవరి 2016.
  3. "Mumbai CR Railway Division" (PDF). Railway Board. Western Railway zone. Retrieved 13 January 2016.
  4. "Statement showing Category-wise No. of stations in IR based on Pass. earning of 2011" (PDF). Retrieved 15 January 2016.
  5. "PASSENGER AMENITIES - CRITERIA= For Categorisation Of Stations" (PDF). Archived from the original (PDF) on 4 మార్చి 2016. Retrieved 15 జనవరి 2016.
  6. "BRIEF HISTORY OF NANDED DIVISION (ENGINEERING DEPARTMENT)" (PDF). Retrieved 15 January 2016.