Jump to content

హెచ్ సి శ్రీకాంతయ్య

వికీపీడియా నుండి
హెచ్ సి శ్రీకాంతయ్య
కర్ణాటక రెవెన్యూ శాఖ మంత్రి
In office
1999 అక్టోబర్ 11 – 2004 మే 28
ముఖ్యమంత్రిఎస్ఎం కృష్ణ
అంతకు ముందు వారుడి. మంజునాథ్
తరువాత వారుఎంపీ ప్రకాష్
పార్లమెంట్ సభ్యుడు
In office
1989 డిసెంబర్ 2 – 1991 మార్చి 13
తరువాత వారుహెచ్ డి దేవే గౌడ
నియోజకవర్గంహసన్ లోక్ సభ నియోజకవర్గం
కర్ణాటక శాసన సభ్యుడు
In office
1972–1985
అంతకు ముందు వారుఎస్ శివప్ప
తరువాత వారుఎన్ గంగాధర్
నియోజకవర్గంశ్రావణ బెశగళ శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం(1926-07-18)1926 జూలై 18
కర్ణాటక, భారతదేశం
మరణం2011 మార్చి 12(2011-03-12) (వయసు 84)
బెంగళూరు, కర్ణాటక, భారతదేశం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్ 2009 భారతీయ జనతా పార్టీ 2009-2011
జీవిత భాగస్వామిలత నాగమ్మ(m. 1948)
సంతానంముగ్గురు కొడుకులు ఐదుగురు కూతుళ్లు
నివాసంబెంగళూరు, కర్ణాటక
మారుపేరుAnnaiah (Big Brother)

శ్రీకాంతయ్య ( 1926 జులై 18 - 2011 మార్చి 12) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు . [1] శ్రీకాంతయ్య 1972 నుండి 1985 వరకు తొలిసారి 1999 నుండి 2004 వరకు రెండవసారి హాసన్‌లోని శ్రావణబెళగొళ శాసనసభ నియోజకవర్గం నుండి కర్ణాటక శాసనసభకు ఎన్నికయ్యారు. శ్రీ కాంతయ్య కర్ణాటక ప్రభుత్వంలో దేవరాజ్ ఉర్స్, వీరేంద్ర పాటిల్ ఏస్.యం కృష్ణ ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేశాడు. [2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

హెచ్‌సి శ్రీకాంతయ్య మైసూర్ రాష్ట్రంలోని (ప్రస్తుత కర్ణాటకలో ) హసన్ జిల్లాలోని చన్నరాయపట్నం తాలూకాలోని హిరీసావే గ్రామంలో జన్మించారు. 1948లో శ్రీ కాంతయ్యకు కు నాగమ్మతో వివాహమైంది. శ్రీ కాంతయ్య దంపతులకు 3 కుమారులు 5 కూతుళ్లు. శ్రీ కాంతయ్య కర్ణాటకలోని వొక్కలిగ సామాజిక వర్గానికి చెందినవాడు. [3] శ్రీ కాంతయ్య పెద్ద కుమారుడు హెచ్‌ఎస్ చంద్రు 2020 డిసెంబర్ 29న బెంగళూరులో మరణించారు.

రాజకీయ జీవితం

[మార్చు]

శ్రీకాంతయ్య 1972లో హాసన్‌లోని శ్రావణబెళగొళ శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. [4] తరువాత శ్రీ కాంతయ్య భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు‌. 1985 వరకు ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చాడు. శ్రీ కాంతయ్య 1972 నుండి 1985 వరకు తొలిసారి 1999 నుండి 2004 వరకు రెండవసారి కర్ణాటక శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. శ్రీకాంతయ్య 20 ఏళ్ల పాటు కర్ణాటక ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. 1980లో హెచ్‌సి శ్రీకాంతయ్య కర్ణాటకలో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కాంగ్రెస్ (యు) నుండి కాంగ్రెస్ (ఐ) పార్టీలోకి 84 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు‌, తద్వారా కర్ణాటక ప్రభుత్వం కుప్పకూలింది. తరువాత కర్ణాటక ముఖ్యమంత్రిగా దేవ్‌రాజ్ ఉర్స్ నియమితుడయ్యాడు.[5] 84 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపుల తర్వాత శ్రీకాంతయ్యకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. కానీ సంజయ్ గాంధీ గుండూరావును ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేశారు. [6] గుండూరావు మంత్రివర్గంలో శ్రీ కాంతయ్య సహకార శాఖ మంత్రిగా పనిచేశాడు. భారత జాతీయ కాంగ్రెస్‌లో దాదాపు నాలుగు దశాబ్దాలు పాటు కొనసాగిన తరువాత, శ్రీకాంతయ్య 2009 పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. [7]

మరణం

[మార్చు]

దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీ కాంతయ్య బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2011 మార్చి 12న మరణించారు. మరణించే నాటికి ఆయన వయసు 85. ప్రభుత్వ లాంఛనాలతో హాసన్ జిల్లా చన్నరాయపట్నం తాలూకాలోని శ్రీ కాంతయ్య జన్మస్థలమైన హిరీసావే గ్రామంలో శ్రీ కాంతయ్య అంత్యక్రియలు నిర్వహించారు. [8]

మూలాలు

[మార్చు]
  1. "1989 के लोकसभा चुनाव में कांग्रेस, BJP, जनता दल, CPM को कितनी सीट और कितना वोट". 25 April 2019.
  2. "Srikantaiah H. C". www.kla.kar.nic.in.
  3. "Rediff On The NeT: Home turf is ready for campaign, but Deve Gowda isn't home yet". www.rediff.com.
  4. "Karnataka 1972" https://eci.gov.in/files/file/3775-karnataka-1972
  5. "How Urs got his second term as Karnataka CM". Deccan Herald (in ఇంగ్లీష్). 2023-03-24. Retrieved 2023-03-27.
  6. "H C Srikantaiah passes away". The New Indian Express.
  7. "3 Cong biggies join BJP". Bangalore Mirror (in ఇంగ్లీష్). Retrieved 2023-07-21.
  8. "Former Karnataka minister Srikantaiah passes away". The Hindu. March 12, 2011 – via www.thehindu.com.