హెరాక్లిటస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాశ్చాత్య తత్వము
ప్రాచీన తత్వశాస్త్రం
Heraclitus by జోహాన్నెస్ మోరీస్లే. The image depicts him as "the weeping philosopher" wringing his hands over the world and "the obscure" dressed in dark clothing, both traditional motifs.
పేరు: హెరాక్లిటస్
జననం: ca. 535 BCE
మరణం: 475 BCE
సిద్ధాంతం / సంప్రదాయం: Not considered to belong to any school of thought, but later subscribers to the philosophy were "Heracliteans."
ముఖ్య వ్యాపకాలు: మెటాఫిజిక్స్, ఎపిస్టెమాలజీ, నీతి శాస్త్రం, రాజనీతి శాస్త్రం
ప్రముఖ తత్వం: లోగోస్, ఫ్లో
ప్రభావితమైనవారు: en:Parmenides, ప్లేటో, అరిస్టాటిల్, హెగెల్, నీట్జ్‌షే, హెయిడెగ్గర్, వైట్‌హెడ్, కార్ల్ పాప్పర్, అనేకులు

హెరాక్లిటస్ (ఆంగ్లం :Heraclitus the Ephesian) (ప్రాచీన గ్రీకు: Ἡράκλειτος ὁ Ἐφέσιος - గ్రీకో-లాటిన్ - Hērákleitos ho Ephésios), (సిర్కా క్రీ.పూ. 535 - 475) ఒకసోక్రటీస్ పూర్వ ప్రఖ్యాత గ్రీకు తత్వవేత్త. ఐవోనియో లోని ఎఫిసస్ నగరంలో ఉన్నత కుటుంబంలో జన్మించాడు. ఉన్నత వర్గాల పరిపాలనా వ్యవస్థను అభిమానిస్తూ ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించేవాడు.

సిద్ధాంతాలు[మార్చు]

హెరాక్లిటస్ సిద్ధాంతాలలో ముఖ్యమైనది: - ఈ ప్రపంచంలో నిత్యమైనది, సత్యమైనది ఏదీ లేదు - మార్పు తప్ప. విశ్వంలో స్థిరమైనది ఏదీ లేదు. ప్రతీదీ మరొక దానిగా మారుతుంది. మార్పునకు లోనుకాని వస్తువంటూ లేదు. అన్నీ చలిస్తూ మారిపొతూ ఉంటాయి. మారనిది మార్పు ఒక్కటే. ఈ సిద్ధాంతాన్ని ఈ విధంగా వివరించాడు. ఏ వ్యక్తీ ఒకే నదిలో రెండు సార్లు స్నానం చేయలేడు - ఒకసారి మునిగి లేచేసరికి నదిలోకి కొత్త నీరు ఒచ్చి చేరుతుంది. కాబట్టి అది కొత్త నది అవుతుంది.