హెర్న్‌లఫ్కాడియో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హెర్న్‌లఫ్కాడియో
Hearn in 1889 by Frederick Gutekunst
పుట్టిన తేదీ, స్థలంPatrick Lafcadio Hearn; Πατρίκιος Λευκάδιος Χερν
(1850-06-27)1850 జూన్ 27
Lefkada, United States of the Ionian Islands (now Greece)
మరణం1904 సెప్టెంబరు 26(1904-09-26) (వయసు 54)
Tokyo, Japan
సమాధి స్థానంZōshigaya Cemetery
కలం పేరుKoizumi Yakumo
భాషEnglish, Greek, Japanese, French
జీవిత భాగస్వామి
Alethea Foley
(m. 1874; div. 1877)

Setsuko Koizumi
(m. 1890)
సంతానం4

సంతకం
Japanese name
కంజీ小泉 八雲
హిరగానాこいずみ やくも

హెర్న్‌లఫ్కాడియో(1850-1904): జపాన్ దేశపు సాహిత్యం ,సంస్కృతిని పాశ్చాత్య దేశాలకు అందజేసి అపూర్వమైన సేవ చేసిన రచయిత అనువాదకుడు  ఆచార్యుడు.

1850 జూన్ 27న  గ్రీస్ లోని అయోనియాన్‌  హలో జన్మించిన హెర్న్‌ డబ్లీన్ నగరంలో పెరిగి పెద్దవాడయ్యాడు.  ఇంగ్లాండ్, ఫ్రాన్స్‌లలో  కొద్దికాలం పాటు విద్యాభ్యాసం కొనసాగించిన తర్వాత తన 19వ ఏట యునైటెడ్ స్టేట్స్ కు వలస వెళ్ళాడు.  ఓహియో  రాష్ట్రంలోని సిన్సినాటి నగరంలో స్థిరపడి ఏవో చిల్లర పనులు చేస్తూ చివరకు ట్రేడ్ లిస్ట్ అనే వాణిజ్య పత్రిక లో చేరాడు.  తరువాత సిన్సినాటి ఇంక్వెరర్‌, అనంతరం సిన్సినాటి  కమర్షియల్ అనేక పత్రికలకు రిపోర్టర్ అయ్యాడు.  ఆ పత్రికలకు  వచన విశాఖ నగర వాసులు అయిన నీగ్రోల జీవన విధానం వంటి అసాధారణమైన విషయాల మీద పరిశోధక వ్యాసాలు కూడా రాస్తూ ఉండేవాడు. సిన్సినాటిలో  ఉండగానే గాషియేర్‌ అనే ఫ్రెంచ్ కవి కథలను వన్‌ ఆఫ్‌ క్లియోపాట్రాస్‌ నైట్స్‌ అని అనే శీర్షికతో ను ప్లాబర్ట్‌ (1821-80) అనే ఫ్రెంచ్ నవల రచయిత రచనను 'టెం స్టేషన్  ఆఫ్ సెంట్ ఆంథోనీ'  అనే శీర్షికతో ను అనువదించాడు.[1]

1877లో  హెర్న్‌ న్యూబార్లియన్స్‌కు వెళ్ళి లూయిజి యానా రాజకీయాలను గురించి కమర్షియల్‌ పత్రికలకు వ్యాసాలు వ్రాస్తు ఉండేవాడు.  ఆ కాలంలోనే 'ఐటెమ్‌' ( అనంతరం టైమ్స్ డెమోక్రాట్) పత్రికలో ఫ్రెంచ్ కథలకు అనువాదాలు స్వతంత్ర కథలు స్కెచ్లు విదేశీ సాహిత్యాల నుండి భజనలు చేస్తూ ఉండేవాడు. ఈ రచనలే హెర్న్‌ ప్రకటించిన 'స్ట్రే లీవ్స్‌ ఫ్రమ్‌ స్ట్రేంజ్‌ లిటరేచర్‌' (1884) 'సమ్‌ చైనీస్ ఘోస్ట్స్‌'(1887) అనే రెండు తొలి సంపుటాలుగా వెలువడ్డాయి .  ఆయన వ్యాసాల ఇతివృత్తాలు వైవిధ్యంతో కూడిన ఉండేవి. బుద్ధిజం ,ఇస్లాం వంటి విషయాల దగ్గర నుంచి ఫ్రెంచ్ రష్యన్ సాహిత్యాల వరకు అవి విస్తరించి ఉండేవి.  ఆయన సంపాదకీయాలు వైజ్ఞానిక విషయాలనుంచి  రష్యా ఫ్రాన్స్‌ లలో 'ఆంటీ సెమిటిజ్‌'  వరకు  వివిధ విషయాలను చర్చించేవి.  ఉప్పెన వచ్చి అందరూ చచ్చి పోగా మిగిలిన ఒకే ఒక వ్యక్తి జీవితాన్ని చిత్రించే 'చీట' (Chita-1889) అనే సాహసిక నవల ఆయన ఈ కాలంలో వ్రాసిందే.[2]

1887 నుండి 1989 వరకు హార్పర్స్‌  మేగజైన్ తరుపున హెర్న్‌   వెస్ట్ ఇండీస్ లో ఉన్నాడు దాని ఫలితమే ఆయన రచించిన 'టు ఇయర్స్ ఇన్ ఫ్రెంచ్ వెస్టిండీస్' 1890 ఆయన నవల యూమా తిరుగుబాటుకు సంబంధించిన ఆ నవల చాలా మౌలిక మైనది.

1890లో హార్వర్డ్ పత్రిక తరపుననే  హెర్న్‌ జపాన్ వెళ్ళాడు త్వరలోనే ఆ పత్రికకు పనిచేయడం మానివేసి ఉత్తర జపాన్లోని ఇజుమో  లో ఒక స్కూలు టీచర్ గా ఆయన చేరాడు. అక్కడ ఉన్నత కుటుంబానికి చెందిన సామురాయ్- క్షత్రియ ’సెట్సుకో కోయిజుమి’  అనే ఆమెను 1891లో వివాహమాడాడు. ఆ త్వరలోనే జపాన్ గూర్చి  హెర్న్‌ రచించిన  వ్యాసాలు ది అట్లాంటిక్ మంత్లీ లోనూ యునైటెడ్ స్టేట్స్ లోని అనేక ఇతర పత్రికలలోనూ వెలువడ్డ సాగాయి. ఇలా ప్రచురింపబడిన రచనలన్నీ అటు తరువాత ’గ్లిమ్సెస్‌ ఆఫ్‌ ఆన్‌ ఫెమిలియన్‌ జపాన్” అనే పేర రెండు సంపుటాలుగా వెలువడ్డాయి(1894).

1891 లో హెర్న్‌ ’కుమామాటో’  లోని ప్రభుత్వ కళాశాలకు బదిలీ అయి అక్కడ మూడేళ్లపాటు ఉన్నాడు. 1895లో జపాన్ పౌరసత్వం పొంది ’కోయిజుమీ యాకుమో’’ తన పేరు మార్చుకున్నాడు ’కొయిజు మీ’ అనేది తన భార్య కుటుంబ నామం.

హెర్న్‌ జీవితంలో  సర్వోచ్ఛదశ  1896- 1903 మధ్యకాలం టోక్యోలోని  ఇంపీరియల్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా ఆ కాలంలో ఆయన పనిచేశాడు. అక్కడ ఆయన ప్రకటించిన నాలుగు గ్రంధాలు 1 ఎక్సోటిక్స్‌ అండ్‌ రిట్రా స్పెక్టివ్‌(1898),2 ఇన్‌ఘోస్ ట్లీ జపాన్‌ 3 షేజోయింగ్స్‌(1900), 4.ఏ జపనీస్‌ మిసెలెనీ(1901), జపాన్ ఆచారాలను గురించి మతాన్ని గురించి సాహిత్యాన్ని గురించి హెర్న్‌ కి క్షుణ్ణంగా తెలుసు. క్వాయిడాన్‌(1904)  అనే సంకలనం లో అతి మానవ సంఘటనలను గూర్చిన కథలకు హైకు అనువాదాలు ఉన్నాయి.  1965 లో జపాన్ లో వెలువడిన ’క్వాయిడాన్‌ అనే  ఫిలిమ్‌’ కు  ఈయన రచించిన 3 ఘోస్ట్ కథలే ఆధారం.  కార్నెల్‌ యూనివర్సిటీలో ఈయన ఇవ్వడం కోసం వ్రాసిన ఉపన్యాసాలు ’జపాన్ ఏన్‌ ఎటెంప్ట్‌ ఎట్‌ ఏన్‌ ఇంటెర్‌ప్రెటేషన్‌ (1904” అనే సంపుటంగా వెలువడింది. అయితే ఆ ఉపన్యాసాలు ఇచ్చేందుకు అమెరికా బయలుదేరటానికి ముందే 1904 సెప్టెంబర్ 26న జపాన్లోని ’బకూబో” లో హెర్న్‌ తనువు చాలించాడు.

మూలాలు

[మార్చు]
  1. విజ్ఞాన సర్వస్వం విశ్వసాహితి సంపుటం-5. హైదరాబాద్‌: పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. 1994. p. 830. ISBN 81-86073-09-4.
  2. https://en.wikipedia.org/wiki/Lafcadio_Hearn#cite_note-:0-3