హేమల్ ఇంగ్లే
హేమల్ ఇంగ్లే | |
---|---|
జననం | హేమల్ ఇంగ్లే 1996 మార్చి 2 కొల్హాపూర్, మహారాష్ట్ర, భారతదేశం |
ఇతర పేర్లు | హేమల్ దేవ్ |
విద్య | ఫెర్గూసన్ కాలేజ్ శివాజీ యూనివర్సిటీ |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2015 – ప్రస్తుతం |
తల్లిదండ్రులు |
|
హేమల్ ఇంగ్లే (జననం 1996 మార్చి 2) భారతీయ నటి, మోడల్. హేమల్ దేవ్ అని కూడా పిలిచే ఆమె ప్రధానంగా మరాఠీ చిత్రాలలో నటిస్తుంది. ఆమె 2018లో తెలుగు సినిమా హుషారుతో అరంగేట్రం చేసింది.[1] ఆమె ఆషి హి ఆషికి (2019), రూప్ నగర్ కే చీటీ (2022), ఉనాద్ (2023) వంటి మరాఠీ చిత్రాలలో ప్రధాన నటి.
పవర్ ప్లే (2021) చిత్రంలో రాజ్ తరుణ్ సరసన ఆమె నటించింది.[2]
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]హేమల్ ఇంగ్లే 1996 మార్చి 2న కొల్హాపూర్‌లో ధనశ్రీ, దేవేంద్ర ఇంగ్లే దంపతులకు జన్మించింది. ఆమె ఫెర్గూసన్ కాలేజీ, శివాజీ యూనివర్సిటీలలో చదువుకుంది.[3]
ఆమెను హేమల్ దేవ్ అని కూడా పిలుస్తారు, దేవ్ ఆమె తండ్రి పేరు నుండి తీసుకోబడింది.[4]
కెరీర్
[మార్చు]హేమల్ ఇంగ్లే క్వాంటిటేటివ్ ఎకనామిక్స్‌లో డిగ్రీ చదువుతుండగానే 2018లో వచ్చిన తెలుగు సినిమా హుషారుతో ఆమె అరంగేట్రం చేసింది.[5]
ఆమె మిస్ యూనివర్శిటీ ఇండియా 2015, మిస్ ఎర్త్ ఇండియా ఫైర్ 2016, మిస్ ఇండియా మిస్ ఇండియా ఎక్స్‌క్విజిట్–క్వీన్ 2016–17 వంటి అందాల పోటీలను గెలుచుకుంది.[6][7][8][9]
2019లో వచ్చిన ఆషి హి ఆషికి చిత్రంలో ఆమె సచిన్ పిల్‌గావ్‌కర్, అభినయ్ బెర్డేలతో కలిసి నటించింది.[10]
అక్టోబరు 2020లో, ఆమె మరాఠీ రొమాన్స్ పాట "స్వప్నత్ల్య"లో నటించింది.[11] ఆమె హాట్‌స్టార్ సిరీస్ 1962: ది వార్ ఇన్ ది హిల్స్‌తో వెబ్ సిరీస్‌లోకి అడుగుపెట్టింది. అభయ్ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ధారావాహిక 2021 ఫిబ్రవరి 23న ప్రసారం చేయబడింది. ఎన్డీటీవీకి చెందిన సైబల్ ఛటర్జీ సిరీస్‌లో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది.[12] అక్టోబరు 2021లో షో విద్రోహితో ఆమె టెలివిజన్ అరంగేట్రం చేసింది.[13] 2022లో, ఆమె రూప్ నగర్ కే చీటీలో చేసింది.[14] 2023లో, ఆమె ఉమ్రెల్లా, ఆదిత్య సర్పోత్దార్‌ల ఉనాద్‌లో నటించింది.[15] ప్రస్తుతం ఆమె శుభంకర్ తావ్డేతో కలిసి మిస్టరీ చిత్రం థాకాబాయిలో చేస్తోంది.[16]
మూలాలు
[మార్చు]- ↑ సితార, రివ్యూ. "హుషారు". www.sitara.net. Archived from the original on 22 జూలై 2020. Retrieved 22 July 2020.
- ↑ "రివ్యూ: పవర్ ప్లే | raj tarun power play telugu movie review". web.archive.org. 2023-11-16. Archived from the original on 2023-11-16. Retrieved 2023-11-16.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Hemal Ingle हाइट, उम्र, बॉयफ्रेंड, परिवार, Biography in Hindi - बायोग्राफी" (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-09-30. Retrieved 2023-11-07.
- ↑ "To start with, why did you change your name from Hemal Ingle to Hemal Dev?". The Tribune. Retrieved 2023-11-07.
- ↑ "HEMAL INGLE WELL-KNOWN MARATHI & TELEGU FILM ACTRESS". siddhantsamachar (in ఇంగ్లీష్). 2020-05-15. Retrieved 2023-11-10.
- ↑ "Hemal Ingle To Make Her Television Debut With Sulagna Panigrahi Starrer Vidrohi". Filmibeat. Retrieved 2023-11-10.
- ↑ "कोल्हापूरची हेमल इंगळे मिस अर्थ इंडिया". Maharashtra Times (in మరాఠీ). Retrieved 2023-11-10.
- ↑ "हेमल इंगळे". Maharashtra Times (in మరాఠీ). Retrieved 2023-11-10.
- ↑ "#FastRepost from @Hemal Ingle by @fastrepost_app ••• Exactly one year ago I was crowned as Miss India Exquisite- Queen for a… | Miss india, Fashion, Be a nice human". Pinterest (in ఇంగ్లీష్). Retrieved 2023-11-10.
- ↑ "Sachin Pilgaonkar on directing Laxmikant Berde's son: Feeling proud". Mid-day (in ఇంగ్లీష్). 2019-02-09. Retrieved 2023-11-07.
- ↑ "Swapnatlya", Spotify (in ఇంగ్లీష్), 2021-07-05, retrieved 2023-11-07
- ↑ "1962: The War In The Hills Review - Abhay Deol Is Perfectly Cast In This Military Action Drama". NDTV. Retrieved 2023-11-07.
- ↑ "Hemal Dev Opens Up On Her Hindi Debut Show 'Virodhi' – Deets Inside". Koimoi. Retrieved 2023-11-07.
- ↑ Jha, Lata (2022-08-09). "New Marathi film 'Roop Nagar Ke Cheetey' to release on 16 September". Mint (in ఇంగ్లీష్). Retrieved 2023-11-07.
- ↑ "Unaad Movie : उनाड चित्रपटाचा ८ जुलैला प्रीमियर, फ्रीमध्ये पाहता येणार (Video)". Pudhari (in మరాఠీ). 2023-07-04. Retrieved 2023-11-07.
- ↑ "'Thakabai': Shubhankar Tawde and Hemal Ingle come together for Yuveen Kapse's debut film". The Times of India. 2023-07-27. ISSN 0971-8257. Retrieved 2023-11-07.