హైదరాబాదు నగర పోలీసులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హైదరాబాదు నగర పోలీసులు
Hyderabad Police Logo.jpg
MottoFreedom from Fear Forever[1]
Agency overview
Formed28 మార్చి 1847 (1847-03-28) (174 years ago)
Jurisdictional structure
Operations jurisdictionహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
హైదరాబాదు నగర పోలీసులు is located in Telangana
హైదరాబాదు నగర పోలీసులు
హైదరాబాదు నగర పోలీసులు (Telangana)
Size650 చ.కి.మీ.
Population9.7 మిలియన్
Legal jurisdictionహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Headquartersహైదరాబాదు
Agency executive
 • అంజనీ కుమార్ (ఐపిఎస్), పోలీస్ కమీషనర్
Parent agencyతెలంగాణ పోలీసు
Facilities
Stations105
Website
హైదరాబాదు నగర పోలీసు

హైదరాబాదు నగర పోలీసులు తెలంగాణలోని హైదరాబాదు నగరంలో స్థానిక చట్టాన్ని అమలుచేసే సంస్థ. ఇది నగర పోలీసు కమిషనర్ లేదా కొత్వాల్ నేతృత్వంలో ఉంటుంది. 1847, మార్చి 28న హైదరాబాద్ రాష్ట్రంలో ఈ సంస్థ స్థాపించబడింది.[2]

చరిత్ర[మార్చు]

1847-1948[మార్చు]

హైదరాబాదు నిజాం రాజు హైదరాబాద్ సివిల్ సర్వీస్ అధికార హోదాలో ఉన్న పోలీసు కమిషనర్లను నియమించేవాడు. పరిపాలన విషయాలకు సంబంధించినంత వరకు పోలీసు కమిషనర్ హోంశాఖ పరిధిలో ఉండేవాడు. హైదరాబాదు నగరంలో జరిగే వివిధ విషయాలపై నేరుగా ఈ పోలీసు అధికారులు నిజాంకు వివరించేవారు. పోలీసు కమిషనర్‌ను "కొత్వాల్" అని పిలుస్తారు. శాంతిభద్రతల నిర్వహణ, నేరాలను గుర్తించడం, అరికట్టడం మొదలైన వాటికి బాధ్యత వహించేవారు.[2]

పునర్వ్యవస్థీకరణ[మార్చు]

జనాభా వేగంగా పెరుగుతుండడంతో నేరాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని 1981లో నగర పోలీసు వ్యవస్థను తిరిగి ఏర్పాటు చేశారు. జివో నెం. 341 ప్రకారం హోమ్ (పోల్. డి) విభాగం, తేదీ: 1981-05-30 న ఇది స్థాపించబడింది:

 1. అదనపు జిల్లా మేజిస్ట్రేట్ అధికారాలు, విధులను కలిగి ఉన్న వ్యవస్థ. క్రమశిక్షణ, పరిపాలనా నియంత్రణ పోలీసు కమిషనర్ చేత నిర్వహించబడుతుంది.
 2. నగరాన్ని దక్షిణ హైదరాబాదు, తూర్పు హైదరాబాదు, పశ్చిమ హైదరాబాదు, హైదరాబాదు సెంట్రల్, ఉత్తర హైదరాబాదు వంటి 5 జోనులుగా విభజించారు. 4 జోన్లను మళ్లీ 12 డివిజన్లుగా విభజించారు.
 3. ప్రతి జోన్ శాంతి భద్రతల నిర్వహణ, నేర పరిశోధన, పోలీసు వ్యవస్థలో ధైర్యాన్ని నింపడంకోసం పోలీసు సూపరింటెండెంట్ హోదాలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డి.సి.పి) ఉంటుంది.
 4. డిసిపి నియంత్రణలో పనిచేసే డిప్యూటీ సూపరింటెండెంట్ హోదాలో ఉన్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఎసిపి) సంరక్షణలో ప్రతి డివిజన్ ఉంటుంది. నేరాల కట్టడికి, గుర్తింపుకి, శాంతి భద్రతల నియంత్రణ క్రమశిక్షణకు ఎసిపి బాధ్యత వహిస్తాడు.
 5. ప్రతి పోలీస్ స్టేషను ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సంరక్షణలో ఉంటుంది. అతను స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్.హెచ్.ఓ.)గా అన్ని విధులను నిర్వర్తిస్తాడు.
 6. నగర నేరాల స్టేషన్‌కు "డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్" గా పేరు మార్చారు, ఇది డి.సి.పి. కింద పనిచేస్తుంది, దీనికి ఏసిఐలు, ఇన్స్పెక్టర్లు సహకరిస్తారు.
 7. 1992లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డిఐజి) హోదాలో 3 జాయింట్ కమిషనర్ పోలీస్ పోస్టులను మంజూరు చేసింది. సమర్థవంతంగా పనిచేయడానికి, పోలీసు కమిషనర్‌కు సహాయం చేయడానికి ప్రతి సమన్వయ, నేరాల బాధ్యత, భద్రతల కోసం జాయింట్ కమిషనర్ పోలీస్ పనిచేస్తారు.
 8. ఒక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ శాంతి భద్రతల విధులకు, మరొక పోలీస్ స్టేషన్ కు చెందిన క్రైమ్ డ్యూటీలకు బాధ్యత వహించాలి. ప్రతి డివిజన్‌కు డివిజనల్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌ను నియమించారు. సబ్ ఇన్‌స్పెక్టర్లు, హెడ్ కానిస్టేబుళ పోస్టుల సంఖ్యను పెంచడానికి, సంఖ్యను తగ్గించడానికి ఈ పథకం ప్రతిపాదించబడింది.

ప్రస్తుతం[మార్చు]

ప్రస్తుతం హైదరాబాదు నగర పోలీసు వ్యవస్థలో 5 జోన్లు ఉన్నాయి.

 • సెంట్రల్ జోన్ (పి. విశ్వప్రసాద్, ఐపిఎస్)
 • పశ్చిమ జోన్ (ఎఆర్. శ్రీనివాస్, ఐపిఎస్)
 • ఉత్తర జోన్ (కల్మేశ్వర్ షింగేనావర్, ఐపిఎస్)
 • దక్షిణ జోన్ (శ్రీ అంబర్ కిషోర్ జా, ఐపిఎస్)
 • తూర్పు జోన్ (ఓం రమేష్, ఐపిఎస్)

అంతర్జాలం[మార్చు]

2014, డిసెంబరు 16న హైదరాబాదు పోలీసులు హైదరాబాదు నగరంలోని పోలీస్ స్టేషన్ల కోసం ఫేస్బుక్ పేజీలను ప్రారంభించారు. సైబర్ క్రైమ్ లకు సంబంధించిన నేరాలకోసం ప్రజలు ఈ పేజీలను ఉపయోగించుకోవచ్చు.[3]

ప్రత్యేక ఏజెన్సీలు[మార్చు]

 1. ఇంటెలిజెన్స్ యూనిట్
 2. కమాండో ఫోర్స్
 3. సెక్యూరిటీ బెటాలియన్

సైబర్ భద్రత సంస్థలు[మార్చు]

 1. సమాచార భాగస్వామ్యం, విశ్లేషణ కేంద్రం (ఐఎస్ఎసి), న్యూఢిల్లీ (https://www.isac.io)
 2. ఎండ్ నౌ ఫౌండేషన్, హైదరాబాదు. (https://endnowfoundation.org)
 3. అజ్ఞాత ఫోరెన్సిక్ ఫౌండేషన్, బెంగళూరు, చెన్నై (https://ifflab.org/)

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-09-24. Retrieved 2020-11-01.
 2. 2.0 2.1 "About Us". Hyderabad City Police. Archived from the original on 27 January 2009. Retrieved 2020-11-01.
 3. http://www.ndtv.com/article/cities/all-hyderabad-police-stations-to-be-on-facebook-soon-635583