కె.మధులత
కె. మధులత | |
---|---|
జననం | 1979 |
విద్య | ఎంఏ, ఉస్మానియా యూనివర్సిటీ |
వృత్తి | లాలాగూడ ఇన్‌స్పెక్టర్‌గా |
క్రియాశీల సంవత్సరాలు | 2022 మార్చి 8 - ప్రస్తుతం |
కె.మధులత తెలంగాణ రాష్ట్రానికి చెందిన 2002 బ్యాచ్‌కు చెందిన పోలీస్ అధికారిణి. ఆమె హైదరాబాద్ కమిషనరేట్‌లో తొలి మహిళ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా నియమితురాలై, ఉత్తర జోన్ పరిధిలోని లాలాగూడ ఇన్‌స్పెక్టర్‌గా భాద్యతలు నిర్వహిస్తుంది.[1][2]
వృత్తి జీవితం
[మార్చు]మధులత 2002లో ఎస్సైగా పోలీసు శాఖలో అడుగుపెట్టి, సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ పోలీసు స్టేషన్‌లో ప్రొబేషనరీ ఎస్సైగా పని చేసింది. ఆమె తరువాత సిద్దిపేట రెండో టౌన్, జోగిపేట, ములుగు, సిద్దిపేట రూరల్ శాంతిభద్రల విభాగం పోలీసుస్టేషన్‌ల్లో ఎస్‌హెచ్‌ఓగా పని చేసి సైబరాబాద్ కమిషనరేట్ కు బాడీపై వచ్చి నాచారం పోలీసుస్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహించింది. ఆమె 2012లో ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి అందుకొని సరూర్‌నగర్ మహిళ పోలీసుస్టేషన్‌లో పాటు ఐటీ కారిడార్ ఉమెన్ పోలీసుస్టేషన్లకు ఇన్‌స్పెక్టర్‌గా పని చేసింది.
మధులత సీఐడీలో రెండున్నరేళ్లు, దక్షిణ మండలం పాతబస్తీ మహిళా పోలీసుస్టేషన్, స్పెషల్ బ్రాంచ్‌ల్లో పని చేసి సైబరాబాద్‌లో అభయ సహా పలు కీలక కేసుల దర్యాప్తులో కీలకంగా పని చేసింది. 2022 మహిళా దినోత్సవం సందర్భంగా లాలాగూడ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా (ఎస్‌హెచ్‌ఓ) నియమితురాలై హోంమంత్రి మహమూద్ అలీ, తార్నాక డివిజన్ కార్పొరేటర్ & హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, నగర సీపీ సీవీ ఆనంద్, అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్, నార్త్‌జోన్ డీసీపీ చందన దీప్తి సమక్షంలో ఆమె 2022 మార్చి 8న బాధ్యతలు చేపట్టింది.[3][4][5][6]
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (8 March 2022). "అకుంఠిత దీక్షతో పనిచేస్తా". Archived from the original on 9 March 2022. Retrieved 9 March 2022.
- ↑ The Indian Express (8 March 2022). "In a first, woman officer to head law-and-order police station in Hyderabad" (in ఇంగ్లీష్). Archived from the original on 9 March 2022. Retrieved 9 March 2022.
- ↑ Andhra Jyothy (8 March 2022). "తొలిసారి మహిళా సీఐ మధులతకు ఎస్‌హెచ్‌వో బాధ్యతలు అప్పగింత". Archived from the original on 9 March 2022. Retrieved 9 March 2022.
- ↑ Zee News Telugu (9 March 2022). "సీపీ సర్‌ప్రైజ్.. 174 ఏళ్ల హైదరాబాద్ పోలీస్ చరిత్రలో తొలిసారిగా మహిళా ఇన్‌స్పెక్టర్!!". Archived from the original on 9 March 2022. Retrieved 9 March 2022.
- ↑ Sakshi (9 March 2022). "హైదరాబాద్‌లో తొలి మహిళా స్టేషన్ హౌస్ ఆఫీసర్.. రాష్ట్రంలో ముగ్గురే!". Archived from the original on 9 March 2022. Retrieved 9 March 2022.
- ↑ The New Indian Express (9 March 2022). "First woman SHO in Telangana takes charge". Archived from the original on 9 March 2022. Retrieved 9 March 2022.