హైదరాబాద్ బుద్ధ విగ్రహం
హైదరాబాదు బుద్ధ విగ్రహం | |
---|---|
ప్రదేశం | హుస్సేన్ సాగర్, హైదరాబాదు, తెలంగాణ |
అక్షాంశ,రేఖాంశాలు | 17°24′56″N 78°28′30″E / 17.41556°N 78.47500°E |
ఎత్తు | 58 అడుగులు (18 మీటర్లు) |
Dedicated | 1 డిసెంబరు 1992 |
శిల్పి | ఎస్.ఎం.గణపతి |
పరిపాలన సంస్థ | బుద్ద పూర్ణిమ ప్రాజెక్టు అథారిటీ, HMDA |
Material | తెల్లని గ్రానైట్ రాయి |
హైదరాబాద్ బుద్ధ విగ్రహం భారతదేశంలోని హైదరాబాద్లో ఉన్న ఒక ఏకశిలా విగ్రహం. ఇది గౌతమ బుద్ధుని యొక్క ఏకశిలా విగ్రహలలో ప్రపంచంలోనే ఎత్తైన ఏకశిలా విగ్రహం. టాంక్‌బండ్ ప్రక్కనున్న హుస్సేన్ సాగర్‌లో 'జిబ్రాల్టర్ రాక్' అనబడే రాతిపైన ఈ పెద్ద బుద్ధ విగ్రహాన్ని అమర్చారు. ఒకే రాతిలో మలచబడిన ఈ విగ్రహం 17.5 మీటర్ల (58 అడుగులు) ఎత్తు ఉండి 350 టన్నుల బరువుంటుంది. హైదరాబాదుకు 60 కి.మీ. దూరంలో ఉన్న రాయగిరి గుట్టల్లోని రాతితో గణపతి స్థపతి నేతృత్వంలో 40 మంది శిల్పులు రెండు సంవత్సరాలు శ్రమించి ఈ శిల్పాన్ని మలచారు. ఈ శిల్పం 192 చక్రాలు గల వాహనంపై ఇక్కడికి తీసుకురాబడింది. డిసెంబరు 1992లో దీనిని ప్రతిష్ఠించారు. హైదరాబాదు నగర చిహ్నంగా చార్మినార్‌తో పాటు ఈ విగ్రహాన్ని కూడా పలు సందర్భాలలో చూపుతారు.
చరిత్ర
[మార్చు]1983, 1989 మధ్య నందమూరి తారక రామారావు అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. రామారావుగారు తన పదవీకాలంలో ఈ ప్రాంతపు చారిత్రిక వ్యక్తుల యొక్క విగ్రహాలు ప్రతిష్ఠించారు.
ప్రమాదం
[మార్చు]ఈ విగ్రహాన్ని మొదట 1990 మార్చి 10న ప్రతిష్టించే ప్రయత్నం చేయగా అది ఫలించలేదు. హుస్సేన్ సాగర్ లో 91 మీటర్లు తరలించిన తర్వాత విగ్రహం అదుపుతప్పి నీటిలో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 10 మంది కూలీలు మరణించారు [1][2].
చిత్రమాలిక
[మార్చు]-
అభయ ముద్రలో నిలబడివున్న బుద్ధుడు
-
సమీప వీక్షణ
-
సూర్యాస్తమయ వేళ బుద్ధవిగ్రహం
-
సాయంత్ర వీక్షణ
-
వెన్నెలలో
-
బుద్ధ విగ్రహం బేస్మెంట్లో ఒక శిల్పం.
-
హుస్సేన్ సాగర్ లో గల బుద్ధ విగ్రహం
మూలాలు
[మార్చు]- ↑ Coll, Steve (9 April 1990). "Buddha of the Lake Bottom". The Washington Post. Archived from the original on 24 సెప్టెంబరు 2015. Retrieved 9 September 2012. – via HighBeam Research (subscription required)
- ↑ "10 drown as the statue of Buddha takes a dip". New Straits Times. New Delhi. 11 March 1990. Retrieved 9 September 2012.