నూటొక్క జిల్లాల అందగాడు
స్వరూపం
(101 జిల్లాల అందగాడు నుండి దారిమార్పు చెందింది)
101 జిల్లాల అందగాడు | |
---|---|
దర్శకత్వం | రాచకొండ విద్యాసాగర్ |
రచన | అవసరాల శ్రీనివాస్ |
నిర్మాత | శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు |
తారాగణం | అవసరాల శ్రీనివాస్ రుహానీ శర్మ |
ఛాయాగ్రహణం | రామ్ |
కూర్పు | కిరణ్ గంటి |
సంగీతం | శక్తికాంత్ కార్తీక్ |
నిర్మాణ సంస్థలు | శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | 3 సెప్టెంబర్ 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
101 జిల్లాల అందగాడు 2021లో విడుదలయిన తెలుగు సినిమా. దిల్ రాజు, క్రిష్ జాగర్లమూడి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై శిరీష్, వై.రాజీవ్ రెడ్డి , సాయిబాబు నిర్మించిన ఈ చిత్రానికి రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహించాడు. అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 2021, సెప్టెంబరు 3న విడుదలైంది.[1]
చిత్ర నిర్మాణం
[మార్చు]ఈ సినిమా 19 అక్టోబర్ 2019లో ప్రారంభమైంది.[2] ఈ సినిమాకు సంబంధించి టైటిల్ సాంగ్ ను 2021 ఏప్రిల్ 2న, ‘101 జిల్లాల అందగాడు’ లిరికల్ సాంగ్ ను ఏప్రిల్ 5న ‘మనసా వినవా’ సాంగ్ ప్రోమోను 2021 ఏప్రిల్ 19న విడుదల చేశారు.[3] ఈ సినిమాను 7 మే 2021న విడుదల చేయాలని నిర్మాతలు భావించారు,[4] కానీ కోవిడ్ రెండో వేవ్ కారణంగా థియేటర్స్ మూతపడడంతో సినిమా విడుదలను వాయిదా వేశారు.
నటీనటులు
[మార్చు]- అవసరాల శ్రీనివాస్
- రుహానీ శర్మ
- అశోక్ కుమార్
- కృష్ణ భగవాన్
- రోహిణి
- శివన్నారాయణ నారిపెద్ది
- రాకెట్ రాఘవ
- అభిషేక్ మహర్షి
పాటల జాబితా
[మార్చు]- నూటొక్క జిల్లాల అందగాడు, రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం. సింహా
- నా గర్ల్ ఫ్రెండ్, రచన, భాస్కర భట్ల రవికుమార్, గానం. అనుదీప్ దేవ్
- మనసా వినవా, రచన: భాస్కర భట్ల రవికుమార్ గానం. శ్రీరామచంద్ర, ధన్య బాలకృష్ణ
- అలసిన సంచారి, రచన: శ్రీవిస్వా, గానం. హేమచంద్ర
- నూటొక్క జిల్లాల అందగాడు,(డిస్కో రెప్రిసే) రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.పృధ్వీచంద్ర .
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్
- నిర్మాతలు: శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి
- దర్శకత్వం: రాచకొండ విద్యాసాగర్
- సంగీతం: శక్తికాంత్ కార్తీక్
- పాటలు: భాస్కరభట్ల [5]
- సినిమాటోగ్రఫీ: రామ్
- ఎడిటింగ్: కిరణ్ గంటి
- ఆర్ట్ : రామాంజనేయులు
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (18 February 2021). "వారిద్దరూ జంటగా '101 జిల్లాల అందగాడు'". Sakshi. Archived from the original on 27 June 2021. Retrieved 27 June 2021.
- ↑ The Times of India (19 October 2021). "Srinivas Avasarala and Ruhani Sharma team up for 'Nootokka Jillala Andagaadu' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 27 June 2021. Retrieved 27 June 2021.
- ↑ NTV (19 April 2021). "101 జిల్లాల అందగాడు : 'మనసా వినవా' సాంగ్ ప్రోమో". NTV. Archived from the original on 27 June 2021. Retrieved 27 June 2021.
- ↑ The Hans India (18 February 2021). "'101 Jillala Andagadu' gets release date". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 27 June 2021. Retrieved 27 June 2021.
- ↑ Sakshi (22 April 2021). "101 జిల్లాల అందగాడు: నిజాన్ని దాచేస్తే..!". Sakshi. Archived from the original on 27 June 2021. Retrieved 27 June 2021.