1826
Jump to navigation
Jump to search
1826 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1823 1824 1825 - 1826 - 1827 1828 1828 |
దశాబ్దాలు: | 1800లు 1810లు - 1820లు - 1830లు 1840లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- ఫిబ్రవరి 24:
- ఆంగ్లో-బర్మా యుద్ధం ముగిసింది. యాండబో ఒప్పందం కుదిరింది.
- యాండబో ఒప్పందం పర్యవసానంగా అస్సాం, మణిపూర్‌లను బ్రిటిషు వారు తమ అధీనం లోకి తెచ్చుకున్నారు.
- మార్చి 1: భారత్ నుండి లండన్ తీసుకువెళ్ళిన చునీ అనే ఏనుగు హింసాత్మకంగా మారి, మావటీలకు అలిమి కాకపోవడంతో, దాన్ని కత్తితో చంపేసారు. అంతకుముందు దాన్ని ఆర్సెనిక్ విషం, తుపాకీ కాల్పుల ద్వారా చంపేందుకు విఫలయత్నం చేసారు[1]
- జూన్: జోసెఫ్ నిసెఫోర్ నీప్సే ప్యారిస్‌లో మొట్టమొదటి శాశ్వత ఫోటోగ్రాఫ్ని సృష్టించాడు
- జూలై 4: అమెరికా స్వాతంత్ర్య 50 వ వార్షికోత్సవం. ఈ రోజే దాని పూర్వ అధ్యక్షులు జాన్ ఆడమ్స్, థామస్ జెఫర్సన్ ఇద్దరూ మరణించారు.
- డిసెంబరు: ముస్లిము నాయకుడు సయ్యద్ అహ్మద్, తన అనుచరులతో కలిసి అకోరా ఖటక్ వద్ద సిక్ఖు దళాలతో పోరుకు తలపడ్డాడు.
- తేదీ తెలియదు: శ్రీకాకుళం శ్రీ కోదండరామస్వామి వారి ఆలయాన్ని నిర్మించారు.
- తేదీ తెలియదు: అహ్మదాబాదులో మొట్టమొదటి గుజరాతీ పాఠశాల తెరిచారు
- తేదీ తెలియదు: కాకినాడ, రాజమండ్రి, నరసాపురం లలో ఒకొక్క టి చొప్పున మూడు ఇంగ్లీషు పాఠశాలలను స్ధాపించమని కలెక్టరు బాయార్డ్కు మద్రాసు గవర్నరు థామస్ మన్రో ఆదేశాలిచ్చాడు.
జననాలు
[మార్చు]- తేదీ తెలియదు: వావిళ్ళ రామస్వామి శాస్త్రులు, తెలుగు గ్రంథ ప్రచురణ కర్త. (మ. 1891)
- తేదీ తెలియదు: పూసపాటి విజయరామగజపతి రాజు, విజయనగర సంస్థానాధీశుడు (మ. 1879)
మరణాలు
[మార్చు]- జూలై 4: జాన్ ఆడమ్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
- జూలై 4: థామస్ జెఫర్సన్, [2] అమెరికా మాజీ అధ్యక్షుడు. (జ.1743)
- ఆగస్టు 13: రెనే లేనెక్, ఫ్రెంచి వైద్యుడు (జ. 1781)
- తేదీ తెలియదు: ఫ్రాన్సిస్ రాడన్ హేస్టింగ్సు, బ్రిటిష్ ఇండియాకు 7వ గవర్నర్ జనరల్
పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Caroline Grigson, Menagerie: The History of Exotic Animals in England (Oxford University Press, 2016)
- ↑ "థామస్ జెఫర్సన్ (ఏప్రిల్13,1743–జూలై4,1826)". Archived from the original on 2015-05-04. Retrieved 2015-10-09.