1824
స్వరూపం
1824 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1821 1822 1823 - 1824 - 1825 1826 1827 |
దశాబ్దాలు: | 1800లు 1810లు - 1820లు - 1830లు 1840లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జనవరి 8: మైకెల్ ఫారడే రాయల్ సొసైటీ సభ్యుడయ్యాడు.
- మార్చి 17: ఆంగ్లో డచ్చి ఒప్పందం కుదిరింది. దీని ప్రకారమే భారతదేశం లోని డచ్చి స్థావరాలన్నీ బ్రిటిషు వారి వశమైపోయాయి.
- మార్చి 29: కైరోలో జరిగిన అగ్నిప్రమాదంలో 4,000 మంది చనిపోయారు.[1]
- మే 24: మొదటి ఆంగ్లో బర్మా యుద్ధం మొదలైంది
- అక్టోబరు 21: జోసెఫ్ ఆస్పిడిన్ పోర్ట్‌ల్యాండ్ సిమెంటుకు పేటెంటు పొందాడు
- నవంబరు 2: బారక్‌పూర్‌లో బ్రిటిషు వారిపై సిపాయీలు తిరుగుబాటు చేసారు.
- నవంబరు 19: రష్యా, సెంట్ పీటర్స్ బర్గ్ నగరంలో వచ్చిన వరదల్లో నీరు మామూలు మట్టం కంటే 421 సెం.మీ.ఎత్తుకు చేరింది
- తేదీ తెలియదు: అవనిగడ్డ లోని 1000 సంవత్సరాల నాటి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని పునర్నిర్మించారు
- తేదీ తెలియదు: లక్ష రూపాయల ఖర్చుతో చార్మినారు ఉపరితలాన్ని ప్లాస్టరింగు చేసారు .[2]
- తేదీ తెలియదు: న్యూ హాలండ్ పేరుతో ఉన్న దేశానికి ఆస్ట్రేలియా అని అధికారికంగా నామకరణం చేసారు.ఈ పేరును మాథ్యూ ఫ్లిండర్స్ 1804 లో సూచించాడు.
జననాలు
[మార్చు]- జనవరి 25: మైఖేల్ మదుసూదన్ దత్, బెంగాలీ కవి (మ. 1873)
- ఫిబ్రవరి 12: స్వామి దయానంద సరస్వతి, ఆర్యసమాజ్ స్థాపకుడు. (మ.1883)
- మార్చి 12: గుస్టావ్ కిర్కాఫ్ జర్మనీ భౌతిక శాస్త్రవేత్త (మ. 1887)
- జూన్ 26: లార్డ్ కెల్విన్, భౌతిక శాస్త్రవేత్త (మ. 1907)
- జూలై 27: అలెగ్జాండర్ ద్యూమా, ఫ్రెంచి రచయిత (మ. 1895)
- డిసెంబర్ 18: లాల్ బెహారీ డే, బెంగాలీ పాత్రికేయుడు. (మ.1892)
- తేదీ తెలియదు: హరీష్ చంద్ర ముఖర్జీ, బెంగాలీ పాత్రికేయుడు. (మ. 1861)
మరణాలు
[మార్చు]- ఏప్రిల్ 19: లార్డ్ బైరన్, ఇంగ్లీషు కవి. (జ.1788)
- డిసెంబరు 21: జేమ్స్ పార్కిన్సన్, బ్రిటిషు సర్జన్. ఇతడి పేరు మీదనే పార్కిన్సన్ జబ్బు పేరు వచ్చింది. (జ. 1755)
- తేదీ తెలియదు: అమృత రావు మరాఠా నేత, పేష్వా రఘునాథ రావు దత్తపుత్రుడు. (జ. 1770)
పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Fires, Great", in The Insurance Cyclopeadia: Being an Historical Treasury of Events and Circumstances Connected with the Origin and Progress of Insurance, Cornelius Walford, ed. (C. and E. Layton, 1876) pp71
- ↑ Ifthekhar, J.S. (31 August 2010). "Charminar minaret suffers damage due to rain". The Hindu. N. Ram. Retrieved 5 December 2015.