1890 బ్రిటిషు చైనా ఒడంబడిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1890 బ్రిటిషు చైనా ఒడంబడిక,[1] టిబెట్, సిక్కిం రాజ్యాలకు సంబంధించి బ్రిటన్‌కు క్వింగ్ చైనాకూ మధ్య జరిగిన ఒప్పందం. దీన్ని కలకత్తా ఒడంబడిక[2] అని, అధికారికంగా సిక్కిం, టిబెట్‌కు సంబంధించి గ్రేట్ బ్రిటన్, చైనాల మధ్య ఒడంబడిక అనీ అంటారు. 1890 మార్చి 17న భారత వైస్రాయ్ లార్డ్ లాన్స్‌డౌన్, టిబెట్‌లోని షెంగ్ తాయ్‌లోని చైనా అంబన్ లు కలకత్తాలో ఈ ఒప్పందంపై సంతకం చేశారు.[3] ఈ సమావేశం, సిక్కింను బ్రిటిష్ రక్షిత ప్రాంతం గాను, సిక్కిం-టిబెట్ సరిహద్దునూ గుర్తించింది.

టిబెట్‌ను సంప్రదించకుండానే చైనా ఈ ఒప్పందంపై చర్చలు జరిపిందని చెబుతూ, టిబెటన్లు దానిని గుర్తించడానికి నిరాకరించారు.[1] ఒప్పందాన్ని అమలు చేయడంలో చైనా విఫలమవడంతో, చివరికి 1904లో బ్రిటిషు భారతదేశం, టిబెట్‌పై దండయాత్ర చేయాల్సి వచ్చింది. ఇది టిబెట్ చరిత్రలో సుదీర్ఘ పరిణామాలకు దారితీసింది. టిబెట్‌లో చైనా 'చేతగానితనాన్ని' ఈ సమావేశం బయటపెట్టిందని ఆధునిక అంతర్జాతీయ న్యాయనిపుణులు పేర్కొన్నారు.[4]

ఈ ఒప్పందంలో సిక్కిం, టిబెట్‌ల మధ్య ఏర్పాటైన సరిహద్దు, చైనా-భారత సరిహద్దులో భాగంగా నేటికీ మనుగడలో ఉంది.[5] చైనా, భారతదేశం, భూటాన్ ల మధ్య ఏర్పడిన ఆధునిక డోక్లామ్ ప్రతిష్ఠంభనపై ప్రభావం చూపింది.[6]

నేపథ్యం

[మార్చు]

భారతదేశంలో తయారైన వస్త్రాలు, పొగాకు, ధాన్యం, పనిముట్లు, తేయాకులను టిబెట్ మార్కెట్లకు, తద్వారా చైనా మార్కెట్లకూ తెరవడం, ఈశాన్య భారతదేశంలో బ్రిటిషు వారి అవసరం.[7]

నిబంధనలు

[మార్చు]

ఆర్టికల్ 1 ప్రకారం, సిక్కింలోని తీస్తా నదిలోకి ప్రవహించే జలాలను, దాని ఉపనదులను టిబెట్ మోచు నదిలోకి, ఉత్తరంవైపు టిబెట్‌లోని ఇతర నదుల్లోకి ప్రవహించే జలాలను వేరుచేసే పర్వత శ్రేణిని సిక్కిం, టిబెట్ సరిహద్దులుగా నిర్వచించారు. ఈ రేఖ భూటాన్ సరిహద్దులో ఉన్న గిప్మోచి పర్వతం వద్ద ప్రారంభమై, పై వాటర్‌షెడ్‌ను అనుసరించి, నేపాలీ భూభాగాన్ని కలిసే వరకూ ఉంది.

అనంతర పరిణామాలు

[మార్చు]

1893 డిసెంబరులో ఈ ఒప్పందానికి ఒక ప్రోటోకాల్‌ను చేర్చారు. "1890 నాటి సిక్కిం-టిబెట్ ఒడంబడికకు అనుబంధించబడే వాణిజ్యం, కమ్యూనికేషన్లు, పచ్చికబయళ్ళకు సంబంధించిన నిబంధనల" ప్రకారం, టిబెట్‌లోని ఓల్డ్ యాతుంగ్‌లో బ్రిటీష్ ట్రేడింగ్ పోస్ట్‌ను స్థాపించడానికి ఇది అనుమతించింది అలాగే పచ్చిక బయళ్ళకు, కమ్యూనికేషన్‌లకూ సంబంధించిన నిబంధనలను నిర్దేశించింది.[8] [3]

1904 లాసా కన్వెన్షన్ "థిబెట్ ప్రభుత్వం 1890 నాటి బ్రిటిషు-చైనా ఒడంబడికను గౌరవించడం, అందులో నిర్వచించిన సిక్కిం, థిబెట్‌ల సరిహద్దును గుర్తించడం, తదనుగుణంగా సరిహద్దు స్తంభాలను నిర్మించడంలో నిమగ్నమై ఉంది." అని పేర్కొంది.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Norbu, China's Tibet Policy (2001).
  2. Green, L. C. (July–September 1960), "Legal Aspects of the Sino-Indian Border Dispute", The China Quarterly, vol. 3, no. 3, pp. 42–58, doi:10.1017/S0305741000026230, JSTOR 763286
  3. 3.0 3.1 Younghusband, India and Tibet (1910).
  4. International Commission of Jurists (1959).
  5. Prescott (1975)
  6. Ankit Panda (13 July 2017), "The Political Geography of the India-China Crisis at Doklam", The Diplomat, archived from the original on 14 July 2017
  7. Arora, Vibha (2008). "Routing the Commodities of Empire through Sikkim (1817-1906)". Commodities of Empire: Working Paper No.9 (PDF). Open University. pp. 4–5. ISSN 1756-0098.
  8. Joshi, H. G. (2004). Sikkim: Past and Present. Mittal Publications. p. 89. ISBN 978-81-7099-932-4.