2016లో క్రీడలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బ్యాడ్మింటన్[మార్చు]

జనవరి 2: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్(పి.బి.ఎల్) ముంబై నగరంలో ప్రారంభం.

క్రికెట్[మార్చు]

  • జనవరి 2: ముస్తాక్ అలీ టి20 టోర్నీ న్యూఢిల్లీలో ప్రారంభం.
  • జనవరి 5: ముంబై శివారులోని కళ్యాణ్‌లో జరిగిన ఇంటర్ స్కూల్ అండర్ 16 క్రికెట్ మ్యాచ్‌లో ప్రణవ్ ధనవాడే 323 బంతుల్లో 1,009 పరుగులు చేసి రికార్డ్ సృష్టించాడు. అతను 395 నిమిషాలు ఆడాడు. అతని పరుగుల్లో 129 ఫోర్లు, 59 సిక్స్‌లు ఉన్నాయి. 1899లో 13 యేళ్ల ఆర్థర్‌ కొలిన్స్‌ చేసిన 628 పరుగులే క్రికెట్‌లో ఇప్పటి వరకు అత్యధిక స్కోరు.
  • జనవరి 5: న్యూజిలాండ్ లో జరిగిన శ్రీలంక, న్యూజిలాండ్ ఐదు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ జట్టు 3-1 తో గెలుచుకుంది.
  • మార్చి 6: బంగ్లాదేశ్ లో జరింగిన ఆసియా కప్ T-20 టోర్నీలో ఫైనల్ ఆటలో బంగ్లాదేశ్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించి భారత్ జట్టు కప్పును గెలుచుకుంది.