2020–2021 భారత పాకిస్తాన్ సరిహద్దు ఘర్షణలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2020–2021 భారత పాకిస్తాన్ సరిహద్దు ఘర్షణలు
కాశ్మీరు సమస్యలో భాగము

జమ్మూ కాశ్మీరులో వివాదాస్పద ప్రాంతం
తేదీ2020 – 2021 ఫిబ్రవరి 25
(3 నెలలు, 1 వారం, 5 రోజులు)
ప్రదేశంనియంత్రణ రేఖ, కాశ్మీరు
ఫలితంCeasefire[1][2]
ప్రత్యర్థులు
 India Pakistan
పాల్గొన్న దళాలు
ప్రాణ నష్టం, నష్టాలు
భారత వాదన:

10 మంది సైనికులు,[3][4][5] 6 గురు పౌరులు[3][6]

పాకిస్తాన్ వాదన:

అనేక మంది జననష్టం[7]
పాకిస్తాన్ వాదన:

7 గురు సైనికులు, 21 మంది పౌరులు[8][7][9][10][11][12]

భారత వాదన:

13 సైనికుల మృతి[13][14]

కాశ్మీరు లోని వివాదాస్పద ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి భారత పాకిస్తాన్ ల మధ్య 2020-2021 కాలంలో జరిగిన సాయుధ ఘర్షణలే 2020-2021 భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దు వాగ్వివాదాలు. నియంత్రణ రేఖ వెంబడి 2020 నవంబరులో భారత, పాకిస్తాన్ సైనికుల మధ్య పెద్ద ఎత్తున తుపాకి కాల్పులు, ఫిరంగి కాల్పులు చెలరేగడంతో ప్రతిష్టంభన తీవ్రమైంది. ఇందులో 11 మంది పౌరులతో సహా కనీసం 22 మంది మరణించారు.[15][16][17]

జననష్టం[మార్చు]

ఈ ఘర్షణల్లో 11 మంది పాక్ సైనికులు మరణించగా, 16 మంది సైనికులు గాయపడినట్లు భారత సైనిక వర్గాలు తెలిపాయి.[13][18] భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం ఆరుగురు భారతీయ పౌరులు, నలుగురు సైనికులు, ఒక సరిహద్దు గార్డు మరణించారు.[3] సరిహద్దు వెంబడి పాకిస్థాన్ బంకర్లను మోర్టార్లు కొట్టి ధ్వంసం చేస్తున్న వీడియోలను భారత సైన్యం విడుదల చేసింది.[19]

పాక్ ఆక్రమిత కాశ్మీరులో ఘర్షణల మధ్య ఐదుగురు పౌరులు, ఒక సైనికుడు మరణించినట్లు పాక్ సైనిక వర్గాలు తెలిపాయి.[7]

నవంబరు 21న రాజౌరిలో ఇద్దరు భారత సైనికులు మరణించారు.[4] నవంబరు 26న, పూంచ్‌లో ఒక భారతీయ సైనికుడు మరణించగా, నవంబరు 27న రాజౌరీలో మరో ఇద్దరు భారతీయ సైనిక మరణాలు నమోదయ్యాయి.[5] డిసెంబరు 15న పాక్ ఆక్రమిత కాశ్మీరులోని బాగ్సర్ ప్రాంతంలో ఇద్దరు పాకిస్తానీ సైనికులు మరణించారని పాక్ చెప్పింది.[10]

2020లో భారత్ కనీసం 2,729 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, దీని ఫలితంగా 21 మంది పాకిస్తానీ పౌరులు మరణించారని, 206 మంది తీవ్రంగా గాయపడ్డారనీ నవంబరులో, పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

శాంతి ఒప్పందం[మార్చు]

భారత పాకిస్తాన్‌లు, హాట్‌లైన్‌లపై చర్చల తరువాత 2021 ఫిబ్రవరి 25 అర్ధరాత్రి నుండి అమలులోకి వచ్చేలా అన్ని కాల్పుల విరమణ ఒప్పందాలను "కఠినంగా పాటించడానికి" ఇరుపక్షాలు అంగీకరించాయని సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. భవిష్యత్తులో ఏవైనా అపార్థాలు ఏర్పడితే పరిష్కరించుకోడానికి ఇప్పటికే ఉన్న హాట్‌లైన్ సంప్రదింపులు, సరిహద్దు ఫ్లాగ్ సమావేశాలను ఉపయోగించుకునేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "Joint Statement". pib.gov.in. Retrieved 2021-02-25.
 2. "Inter Services Public Relations Pakistan". ispr.gov.pk. Retrieved 2021-02-25.
 3. 3.0 3.1 3.2 Six civilians among 11 killed in Pakistan firing at LoC
 4. 4.0 4.1 "J&K: Two Army personnel killed in shelling by Pakistan in Rajouri". Scroll. 27 November 2020. Retrieved 27 November 2020.
 5. 5.0 5.1 Singh, Prashasti (27 November 2020). "2 soldiers killed J-K's Rajouri district in a ceasefire violation by Pakistan army". Hindustan Times. Retrieved 27 November 2020.
 6. "Multiple ceasefire violations by Pak along LoC: 5 soldiers among 11 killed". LiveMint. 2020-11-14. Retrieved 2020-11-16.
 7. 7.0 7.1 7.2 "6 including soldier martyred in AJK, 10 killed on Indian side in major escalation along LoC". Dawn. 14 November 2020. Retrieved 14 November 2020.
 8. "India, Pakistan report deadly violence along Kashmir border". Al Jazeera. 13 November 2020.
 9. "Two Pakistan Army soldiers martyred in Indian ceasefire violation". The Express Tribune. 2020-12-10. Retrieved 2021-01-27.
 10. 10.0 10.1 "Pakistan says two soldiers killed by Indian shelling in Kashmir". Aljazeera.
 11. "Pakistan army says soldier killed by Indian shelling in Kashmir".
 12. "India martyrs Pakistan Army soldier in latest unprovoked ceasefire violation: ISPR". The News International. Retrieved 2021-01-27.
 13. 13.0 13.1 Rao, Madhu (13 November 2020). "11 Pakistani soldiers killed by Indian Army in retaliatory firing along LoC". India TV News (in ఇంగ్లీష్).
 14. "J&K: 2 Pakistani soldiers killed as Indian Army retaliates to ceasefire violation in Naushera sector". timesnownews.com.
 15. "India, Pakistan report deadly violence along Kashmir border". Al Jazeera English. 13 November 2020. Retrieved 13 November 2020.
 16. Service, Tribune News. "Pakistan Rangers violate ceasefire in Kathua". Tribuneindia News Service (in ఇంగ్లీష్). Retrieved 2020-12-08.
 17. "Indian and Pakistani troops exchange fire, at least 15 dead". Reuters. 13 November 2020. Retrieved 13 November 2020.
 18. 11 Pakistani soldiers killed in retaliatory firing by Indian Army over ceasefire violations
 19. "Six civilians among 11 killed in Pakistan firing at LoC". 13 November 2020.