Jump to content

2022 ఉక్రెయిన్‌పై రష్యా దాడి

వికీపీడియా నుండి

2022 ఫిబ్రవరి 24న, రష్యా ఉక్రెయిన్‌పై పెద్ద ఎత్తున యుద్ధం ప్రారంభించింది. ఇది 2014 నుండి కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రధాన తీవ్రతను సూచిస్తుంది.[1] NATO(ఉత్తర అట్లాంటిక్‌ ఒప్పంద సంఘము)లో చేరకుండా ఉక్రెయిన్‌ను చట్టబద్ధంగా నిషేధించాలని రష్యా డిమాండ్ చేసింది. రష్యా డొనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్, లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్, అనే రెండు స్వయం ప్రకటిత ఉక్రెయిన్ రాష్ట్రాలను గుర్తించింది. ఆ తర్వాత ఫిబ్రవరి 21న తూర్పు ఉక్రెయిన్‌ లోని డాన్‌బాస్ ప్రాంతంలో రష్యన్ సాయుధ దళాల చొరబాటు జరిగింది.[2][3]

18 జూన్ 2022న ఉక్రేనియన్ ఆర్మీ సభ్యులతో అధ్యక్షుడు జెలెన్స్కీ
ఖార్కివ్ శివార్లలో రష్యా బాంబు దాడి, మార్చి 1

యుద్ధం ప్రారంభం

[మార్చు]

ఫిబ్రవరి 24న సుమారు 03:00 UTC సమయంలో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తూర్పు ఉక్రెయిన్‌లో సైనిక చర్యను ప్రకటించాడు; కొన్ని నిమిషాల తర్వాత, ఉత్తరాన రాజధాని కైవ్‌తో సహా ఉక్రెయిన్ అంతటా ఉన్న ప్రదేశాలలో క్షిపణి దాడులు ప్రారంభమయ్యాయి. ఉక్రేయిన్ బోర్డర్ సర్వీస్ రష్యా, బెలారస్‌తో ఉన్న సరిహద్దు పోస్టులపై దాడి చేసినట్లు పేర్కొంది. రెండు గంటల తర్వాత, దాదాపు 05:00 UTC సమయంలో, రష్యా భూ బలగాలు ఉక్రెయిన్ దేశంలోకి ప్రవేశించాయి. ఉక్రేయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ యుద్ధ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు, రష్యాతో దౌత్య సంబంధాలను తెంచుకున్నట్లు ప్రకటించాడు.[4][5]

ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్యను వ్యతిరేకిస్తూ ఆ దేశంపై పాశ్చాత్య దేశాలు కఠిన ఆర్థిక ఆంక్షల్ని విధించాయి. దీంతో ఆ దేశ కరెన్సీ రూబుల్‌ విలువ పతనమవుతోంది. దీంతో తమ ఉత్పత్తుల విక్రయాలను, సర్వీసులను రష్యాకు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, శాంసంగ్‌ తదితర సంస్థలు ప్రకటించాయి.[6] రెండు వారాలుగా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో దాదాపు 120కి పైగా కంపెనీలు రష్యాలో తమ కార్యకలాపాల్ని నిలిపివేశాయి.[7]

మూలాలు

[మార్చు]
  1. Kirby, Paul (24 February 2022). "Why is Russia invading Ukraine and what does Putin want?". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 19 December 2021. Retrieved 24 February 2022.
  2. "Russia attacks Ukraine". CNN. 24 February 2022. Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
  3. "Украинские пограничники сообщили об атаке границы со стороны России и Белоруссии". Interfax. 24 February 2022. Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
  4. "Russia attacks Ukraine". CNN. 24 February 2022. Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
  5. "Украинские пограничники сообщили об атаке границы со стороны России и Белоруссии". en:Interfax. 24 February 2022. Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
  6. "Ukraine Crisis: ఉక్రెయిన్‌పై దాడిని నిరసిస్తూ.. శాంసంగ్‌ కీలక నిర్ణయం". EENADU. Retrieved 2022-03-05.
  7. "Ukraine crsisis: రష్యాలో వ్యాపారాలు బంద్‌.. పెరుగుతున్న కంపెనీల జాబితా". EENADU. Retrieved 2022-03-09.