26/11 ఇండియాపై దాడి
26/11 ఇండియాపై దాడి | |
---|---|
దర్శకత్వం | రాంగోపాల్ వర్మ[1] |
రచన | రాంగోపాల్ వర్మ రోమెల్ రోడ్రిగ్స్[2] |
నిర్మాత | పరాగ్ సంఘ్వీ[3] |
తారాగణం | నానాపటేకర్ సంజీవ్ జైస్వాల్[4] |
నిర్మాణ సంస్థ | అలుంబ్రా ఇంటర్నేషనల్ |
పంపిణీదార్లు | ఈరోస్ ఇంటర్నేషనల్ |
విడుదల తేదీs | ఫిబ్రవరి 2013(బెర్లిన్) 1 మార్చి 2013 |
సినిమా నిడివి | 116 నిమిషాలు[5] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | ₹30 crore (US$3.8 million)[6] |
26/11 ఇండియాపై దాడి మార్చి 1 న విడుదలైన తెలుగు చిత్రం. ముంబైలో 2008 లో జరిగిన పేలుళ్ళకు ఇది దృశ్యకావ్యం. ప్రముఖ భారతీయ దర్శకుడు రాంగోపాల్ వర్మ రచించి దర్శకత్వం వహించిని బహుభాషా చిత్రమిది. ఈ చిత్రంలో అజ్మల్ కసబ్ పాత్రను సంజీవ్ జైస్వాల్ అనే కొత్త నటుడు చేయగా ప్రముఖ నటుడు నానా పటేకర్ ఒక ముఖ్య పాత్రలో కానిపించారు[7].ఈ చిత్రానికి ఉదయ్ సింగ్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. 2012 నవంబరు 23 న 7 నిమిషాల నిడివి గల ఈ చిత్ర ప్రచార చిత్రాన్ని అంతర్జాలంలో విడుదల చేసారు.[8][9]
ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 2013 మార్చి 1 న విడుదల చేసారు.[10][11] విమర్శకుల నుండి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా అసిస్టెంట్ కమీషనర్ ఎన్.అర్.మహలే కథనం, కథ పత్రాలు తీవ్రవాదానికి వ్యతిరేకంగా కసబ్ తో జరిగిన సంభాషణలను రామ్ గోపాల్ వర్మ తెర మెద చూపించిన విధానం విమర్శకులను అక్కట్టుకుంది.[12][13][14][15] సెన్సారు బోర్డు పెద్దలకు మాత్రమే (A) సర్టిఫికేట్ ఇచ్చింది[16][17] బెర్లిన్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు[18][19] ఈ చిత్రాన్ని ఒక ఉదాహరణగా కేంద్ర ప్రభుత్వ ఫిల్మ్స్ డివిజన్ అఫ్ ఇండియా (చిత్ర విభాగం) లో ఉంచారు.[20][21][22]
నటవర్గం
[మార్చు]- ముంబై పోలీస్ కమీషనర్ రాకెష్ మారియా పాత్రధారి - నానా పటేకర్.[23][24]
- కసబ్ పాత్రధారి - సంజీవ్ జైస్వాల్
- అబూ ఇస్మాయిల్ - సాద్ ఒర్హాన్
- అబూ ఉమెర్ - అతుల్ గవండి
- షోయిబ్ -ఆశిష్ భట్ట్
- అతుల్ కులకర్ణి
- కొనస్టేబుల్ - జితేంద్ర జోషి
- అమర్ సింగ్ సోలంకి - గణేష్ యాదవ్
- లియోపోల్డ్ కేఫ్ నిర్వాహకుడు, ఫార్జాద్ జేహని స్వయం పాత్ర లో...
సాంకేతిక నిపుణులు
[మార్చు]ఉదయ్ సింగ్ కళా దర్శకత్వంలో 4 కోట్ల వ్యేయంతో తాజ్ హోటల్ సెట్ వేసారు.[25] 2008 ముంబై దాడుల సూత్రదారి కసబ్ పాత్రకు 500 మంది నుండి సంజీవ్ జైస్వాల్ ను ఎంపిక చేసారు[26][27]
ఆపరేషన్ లో పాల్గొన్న పోలీస్ సిబ్బందిని తన చిత్ర 15 నిమిషాల ట్రైలర్ ను చూడమన్నారు[28].
ఈ చిత్ర కథను రాత్రి 9 నుండి 1 గంట మధ్య కసబ్ ను పోలీసులు పట్టుకున్నపుడు జరిగిన సంఘటనతో పరిమితం చేసారు వర్మ.[29] రాత్రి పుట షూటింగ్ ప్రధానంగా జరిగింది. 2012 డిసెంబరు 10 న షూటింగ్ ని ఛత్రపతి శివాజీ ఎయిర్ పోర్ట్ లో చిత్ర క్లైమాక్స్ షూటింగ్ తో ముగించారు[30][31]
2008 లో ఇక్కడ జరిగిన మారణహోమం ఈ చిత్రానికి క్లైమాక్స్. ముంబైలో ఉగ్రవాదులు దాడి మొదలుపెట్టిన లియోపోల్డ్ కేఫ్ నిర్వాహకుడు ఫార్జాద్ జేహని ఈ చిత్రంలో తన పాత్ర వేసారు.[32]
ఈ చిత్ర కథ కోసం అప్పటి దాడులలో, బాధితులను, సాక్షులను కలిసారు, ఛార్జ్ షీట్లు, కోర్టు ఆదేశాలు, వంగ్ములాలను పరిశీలించారు. ఆ ఘటన మేద పరిశోధన చేసి కథను రూపొందించారు[33][34]
ఈ సినిమా లైన్ ప్రొడ్యూసర్ దీపక్ భానుశాలి అసలు ఘటన జరిగిన ప్రాంతాల్లో షూటింగ్ కి అనుమతి తెప్పించుకున్నారు.[35][36]
ప్రశంసలు
[మార్చు]ఈ చిత్రం అనేక మంది ప్రశంసలు అందుకొంది. చిత్రం చూసిన మజీ ఉప ప్రధానమంత్రి ఎల్. కె. అద్వానీ దర్శకుడు వర్మను ప్రత్యేకంగా అభినందించారు.[37]
ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ తన ట్విట్టర్ లో ప్రశంసించారు. రాంగోపాల్ వర్మ, నటుడు నానా పటేకర్, కసాబ్ పాత్రధారి సంజీవ్ జైస్వాల్ ను అభినందించారు. హిందీ దర్శకుడు శేఖర్ కపూర్,[38] హీరో అభిషేక్ బచ్చన్, ఇతర ప్రముఖులు ఈ సినిమాని ప్రశంసించారు.[39]
విమర్శకుల స్పందన
[మార్చు]డెక్కన్ హెరాల్డ్ సంస్థ ఈ సినిమాకు 5 కి 4 మార్కులు వేస్తూ, ఉగ్రవాదం మెద తీసిన మేటి సినిమాల్లో ఒకటి అని వ్యాఖ్యానించారు. జీ న్యూస్, 5 కి 4 మర్కులు వేస్తూ అప్పటి సంఘటనను కళ్ళకు కట్టినట్టు చూపించారు. అని వ్యాఖ్యానించారు. బాలీవుడ్ హుంగామా 5 కి 3.5 వేస్తూ అప్పటి సంఘటనని తెర మెద బలంగా చూపించారు. అని వ్యాఖ్యానించారు.[40][41]
ప్రముఖ వార్తా పత్రిక టైమ్స్ అఫ్ ఇండియా 5 కి 2.5 మార్కులు వేస్తూ, అసలు ఘటనతో బెరేజు వేస్తె, అప్పటి ఘటనని తెర మెద అంట ప్రభావితంగా చూపించలేకపోయారు అని వ్యాఖ్యానించింది. ప్రముఖ న్యూస్ ఛానల్ ఎన్.డి.టీ.వి, 5 కి 2.5 మార్కులు వేస్తూ, వర్మ తన పూర్వ వైభవాన్ని ఈ సినిమాతో చాటలేకపోయారు. అని వ్యాఖ్యానించింది.[42]
ఈ సినిమాలో నానా పాటేకర్ నటనకి మంచి గుర్తింపు వచ్చింది. ఇందులో అతని నటన హద్దులను చెరిపివేసి ప్రేక్షకులకు చేరువయిందని ఫస్ట్ పోస్ట్ మీడియా సంస్థ వ్యాఖ్యానించింది.[43]
పాటలు
[మార్చు]ఈ సినిమా మొదటి పాటను 11 ఫెబ్రవరి 2013 న లియోపోల్డ్ కేఫ్ లో ముంబై దాడులు ప్రారంభమైన టైంకి ప్రారంభించాడు.ఈ సినిమాలో 4 పాటలు ఉన్నాయ్.
నేతుట్టి రుచి మరిగిందా నే పాటని స్వయంగా వర్మ పాడారు.[44]
పాటల స్పందన
[మార్చు]బాలీవుడ్ హుంగామా వెబ్ సైట్ పాటలకి 5 కి 2 మార్కులు వేస్తూ ఒక పాట తప్ప మిగితావి సాధారణంగా ఉన్నాయ్, కాని సినిమా సన్నివేశాలకి సరిపోయాయి. అని వ్యాఖ్యానించింది.[45]
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-02-25. Retrieved 2013-03-01.
- ↑ Rommel Rodrigues. "The face of terror unveiled". Mid Day.
- ↑ "RGV builds replica of Taj hotel worth 2.5 crores for 26/11". daily.bhaskar.com. 2012-08-31. Retrieved 2012-09-22.
- ↑ "Sanjeev Jaiswal to play Kasab in RGV's next film - Movies News - Bollywood - ibnlive". Ibnlive.in.com. 2012-03-16. Archived from the original on 2012-06-23. Retrieved 2012-09-22.
- ↑ "THE ATTACKS ON 26/11 (18)". British Board of Film Classification. 2013-02-25. Retrieved 2012-02-27.
- ↑ "Makers of RGV's next to distribute BO earnings among 26/11 victims' families". Hindustan Times. Archived from the original on 2013-03-03. Retrieved 2012-11-27.
- ↑ "Attacks of 26/11-Cinematic representation of the tragic event". erosentertainment.
- ↑ "The Attacks of 26/11: First 7 minutes on MSN Video". MSN. Archived from the original on 26 మే 2013. Retrieved 27 November 2012.
- ↑ "RGV's 26/11 movie goes on floors : Bollywood, News - India Today". India Today. 16 March 2012. Retrieved 22 September 2012.
- ↑ Subhash K.Jha (1 March 2013). "'The Attacks of 26/11' a stunning wake-up call". Deccan Herald. IANS. Retrieved 6 March 2013.
- ↑ "'The Attacks of 26/11' review: A moving sketch of ghastly terror attacks". Archived from the original on 2013-07-03. Retrieved 2016-02-03.
- ↑ "Recreating 26/11 massacre felt terrifying: RGV (Movie Snippets)". Sify.com. 4 September 2012. Archived from the original on 26 డిసెంబరు 2012. Retrieved 22 September 2012.
- ↑ "Would you watch RGV's film on 26/11? - Rediff.com Movies". Rediff.com. 13 December 2011. Retrieved 22 September 2012.
- ↑ "RGV to recreate Taj Hotel for his 26/11 film". Mid-day.com. 31 August 2012. Retrieved 22 September 2012.
- ↑ http://www.rediff.com/movies/report/brilliant-cop-who-first-quizzed-kasab-on-26-11-film/20130304.htm
- ↑ "'The Attacks of 26/11' First Look: What exactly happened on that day- First Look- Movies News-IBNLive". Ibnlive.in.com. 17 January 2013. Archived from the original on 23 జనవరి 2013. Retrieved 6 March 2013.
- ↑ "The Attacks of 26/11 new poster: Terrorists arrive in a dinghy - Bollywood News & Gossip, Movie Reviews, Trailers & Videos at". Bollywoodlife.com. 17 January 2013. Retrieved 6 March 2013.
- ↑ "The Attacks of 26/11: Ram Gopal Varma's film gets selected for Berlin film festival- Bollywood". Ibnlive. 30 December 2012. Archived from the original on 2 జనవరి 2013. Retrieved 6 March 2013.
- ↑ "Ram Gopal Varma's film selected for Berlin Film Festival". The Indian Express. Retrieved 6 March 2013.
- ↑ "Advani praises RGV's The Attacks of 26/11, advocates Parliament screening". Hindustan Times. 2013-02-28. Archived from the original on 2013-03-06. Retrieved 2013-03-06.
- ↑ "Critics review The Attacks of 26/11, find it watchable". Hindustan Times. 1 March 2013. Archived from the original on 5 మార్చి 2013. Retrieved 6 March 2013.
- ↑ "The Attacks of 26/11 Movie Review". Koimoi.com. Retrieved 6 March 2013.
- ↑ "Nana Patekar essays Rakesh Maria in RGV's 26/11 film". Mid-day.com. 14 September 2012. Retrieved 6 March 2013.
- ↑ "Ramu and Nana reunite after 10 years". Koimoi.com. Retrieved 6 March 2013.
- ↑ "RGV’s film on Mumbai terror attacks faced permission issues". The Times of India. 24 February 2013. Archived from the original on 27 ఫిబ్రవరి 2013. Retrieved 6 March 2013.
- ↑ "Sanjeev Jaiswal to play Kasab in RGV's next film". IBNLive. 16 March 2012. Archived from the original on 28 నవంబరు 2012. Retrieved 16 March 2012.
- ↑ "First Look of Ram Gopal Varma's 'The Attacks of 26/11': See who plays Ajmal Kasab". IBNLive. 24 November 2012. Archived from the original on 28 నవంబరు 2012. Retrieved 23 November 2012.
- ↑ Rgv asks policemen to watch 'The Attacks of 26/11'
- ↑ "Why Ram Gopal Varma changed his film's ending..." The Times of India. 23 January 2013. Archived from the original on 16 ఫిబ్రవరి 2013. Retrieved 6 March 2013.
- ↑ IANS (11 December 2012). "26/11 film has changed me: Ram Gopal Varma". The Times of India. Archived from the original on 26 జనవరి 2013. Retrieved 6 March 2013.
- ↑ "'The Attacks of 26/11' has changed me as a person, says Ram Gopal Varma- Bollywood- Movies News-IBNLive". Ibnlive.in.com. 11 December 2012. Archived from the original on 14 డిసెంబరు 2012. Retrieved 6 March 2013.
- ↑ "Cafe Leopold owner to play key role in Ram Gopal Varma's 26/11". Movies.ndtv.com. 25 July 2012. Retrieved 6 March 2013.[permanent dead link]
- ↑ Firstpost (18 January 2013). "Censor will not have issue with The Attacks of 26/11: RGV". Firstpost. Retrieved 6 March 2013.
- ↑ "The Attacks of 26/11 not on Kasab: RGV". The Times of India. Archived from the original on 2013-02-25. Retrieved 6 March 2013.
- ↑ Bhanushali, Deepak (7 June 2012). "Sorry, Ramu, you can't shoot 26/11 film at CST". mid-day. Retrieved 22 September 2014.
- ↑ bhanushali, Deepak (7 June 2012). "Ram Gopal Varma denied permission to shoot at CST". NDTV. Retrieved 22 September 2014.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-03-04. Retrieved 2013-03-01.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-02-24. Retrieved 2016-02-03.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2016-02-03.
- ↑ "The Attacks of 26/11 | Latest Hindi Movie Review by Taran Adarsh". Bollywood Hungama. Retrieved 6 March 2013.
- ↑ "Critics review The Attacks of 26/11, find it watchable". Hindustan Times. 1 March 2013. Archived from the original on 5 మార్చి 2013. Retrieved 6 March 2013.
- ↑ "Movie review: The Attacks Of 26/11 | NDTV Movies.com". Movies.ndtv.com. 28 February 2013. Archived from the original on 4 మార్చి 2013. Retrieved 6 March 2013.
- ↑ "First Post review". First Post (India). Retrieved 18 May 2013.
- ↑ "Ram Gopal Varma turns singer for The Attacks of 26/11". Hindustan Times. 20 February 2013. Archived from the original on 24 ఫిబ్రవరి 2013. Retrieved 6 March 2013.
- ↑ "The Attacks of 26/11 (2013) | Critic Review By Joginder Tuteja". Bollywood Hungama. 18 February 2013. Retrieved 6 March 2013.