Jump to content

ఆబాదీ బానో బేగం

వికీపీడియా నుండి
(Abadi Bano Begum నుండి దారిమార్పు చెందింది)
ఆబాదీ బానో బేగం (బీ అమ్మన్)
దస్త్రం:Abadi Bano Begum (Bi-Amman).jpg
జననం1850
ఉత్తర ప్రదేశ్
మరణం1924 నవంబరు 13(1924-11-13) (వయసు 73–74)
జాతీయతభారతీయురాలు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భారత స్వాతంత్ర్య ఉద్యమం నేత[1]
జీవిత భాగస్వామిఅబ్దుల్ అలీ ఖాన్[1]
పిల్లలు16
మౌలానా ముహమ్మద్ అలీ జౌహర్
మౌలానా షౌకత్ అలీ లతో సహా[1]

ఆబాదీ బానో బేగం (బీ అమ్మాన్) (జననం 1850 మరణం: 1924 నవంబరు 13) భారత స్వాతంత్ర్యోద్యమంలో ప్రముఖంగా వినిపించిన స్వరం. ఆమెను బీ అమ్మాన్ అని కూడా అంటారు. [2] బ్రిటిషు పాలన నుండి భారతదేశాన్ని విముక్తి చేసే ఉద్యమంలో భాగంగా రాజకీయాలలో చురుకుగా పాల్గొన్న తొలితరం ముస్లిం మహిళలలో ఆమె ఒకరు. [3]

జీవిత విశేషాలు

[మార్చు]

1850 లో ఉత్తర ప్రదేశ్‌లో జన్మించిన ఆబాదీ బానో రాంపూర్ సంస్థానంలో సీనియర్ అధికారిగా ఉన్న అబ్దుల్ అలీ ఖాన్‌ను పెళ్ళి చేసుకుంది. [1] [4] ఈ దంపతులకు ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. [5] చిన్న వయసులోనే భర్త మరణించడంతో, [4] పిల్లల సంరక్షణ బాధ్యత ఆమెపై పడింది. తనకు అర్థిక వనరులు పరిమితంగానే ఉన్నప్పటికీ, ఆబాదీ బానో బేగం తన పిల్లల చదువు కోసం తన ఆభరణాలను తాకట్టు పెట్టింది. [4] [1] బానో బేగం చదువుకోనప్పటికీ, పిల్లలను మాత్రం ఉత్తర ప్రదేశ్‌, బరేలీ పట్టణంలోని ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదివించింది. [4] ఆమె కుమారులు, మౌలానా మొహమ్మద్ అలీ జౌహార్, మౌలానా షౌకత్ అలీ ఖిలాఫత్ ఉద్యమం తో పాటు, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన సహాయ నిరాకరణోద్యమంలో వారిద్దరూ ముఖ్యమైన పాత్ర పోషించారు.

ఆబాదీ బానో బేగం రాజకీయాలలో చురుకుగా పాల్గొంది. ఖిలాఫత్ కమిటీలో ఆమెకు స్థానం ఉంది. 1917 లో ఆమె, అన్నీ బెసెంట్ను, తన కుమారులిద్దరినీ జైలు నుండి విడుదల చేయాలనే ఆందోళనలో పాల్గొంది. [3] స్వాతంత్ర్యోద్యమానికి మహిళల మద్దతు పొందగలిగేలా మాట్లాడుతూండడంతో ఆమెను మహాత్మాగాంధీ ప్రోత్సహించాడు. [3] 1917 లో, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ సమావేశాల్లో ఆమె, హృదయాన్ని హత్తుకునేలా, శక్తివంతమైన ప్రసంగం చేసింది. దేశం లోని ముస్లిములపై ఇది శాశ్వత ముద్ర వేసింది. [1]

ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు సంపాదించడానికి ఆబాదీ బానో బేగం భారతదేశమంతటా విస్తృతంగా పర్యటించింది. ఖిలాఫత్ ఉద్యమానికి, భారత స్వాతంత్ర్య ఉద్యమం కోసమూ నిధులు సేకరించడంలో ఆమె ముఖ్యమైన పాత్ర పోషించింది. ఆమె, మౌలానా హస్రత్ మోహనీ భార్య బేగం హస్రత్ మోహనితో పాటు, బసంతి దేవి, సరళ దేవి చౌధురాని, సరోజినీ నాయుడు తరచుగా మహిళలకు మాత్రమే ఉద్దేశించిన సమావేశాలలో ప్రసంగించి, భారత స్వాతంత్ర్యోద్యమం కోసం బాల గంగాధర్ తిలక్ ఏర్పాటు చేసిన తిలక్ స్వరాజ్ నిధికి విరాళాలు ఇవ్వమని మహిళలను ప్రోత్సహించింది. [3]

1924 నవంబరు 13 న, 73 ఏళ్ళ వయసులో మరణించే వరకు ఆమె స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా ఉంది. [3]

స్మారక తపాలా బిళ్ల

[మార్చు]

1990 ఆగస్టు 14 న, పాకిస్తాన్ పోస్ట్ ఆఫీస్ తన 'పయనీర్స్ ఆఫ్ ఫ్రీడమ్' సిరీస్‌లో ఆమె గౌరవార్థం స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది. [1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "Profile and postage stamp of Abadi Bano Begum (Bi Amma)". cybercity-online.net website. 6 September 2003. Archived from the original on 22 November 2010. Retrieved 1 September 2021. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "cybercity" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. Gandhi, Rajmohan (2003-04-15). Understanding the Muslim Mind (in ఇంగ్లీష్). Penguin Books India. ISBN 9780140299052.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 Taneja, Anup (2005). Gandhi, Women, and the National Movement, 1920–47 (in ఇంగ్లీష్). Har-Anand Publications. pp. 84–88. ISBN 9788124110768. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Taneja" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  4. 4.0 4.1 4.2 4.3 Gandhi, Rajmohan (1986). Eight Lives: A Study of the Hindu-Muslim Encounter (in ఇంగ్లీష్). SUNY Press. p. 82. ISBN 9780887061967.
  5. Fazal, Tanweer (2013-10-18). Minority Nationalisms in South Asia (in ఇంగ్లీష్). Routledge. ISBN 9781317966463.