Jump to content

కాడ్మియం హైడ్రాక్సైడ్

వికీపీడియా నుండి
(Cd(OH)2 నుండి దారిమార్పు చెందింది)
Cadmium hydroxide
Cadmium hydroxide
పేర్లు
IUPAC నామము
Cadmium(II) hydroxide
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [21041-95-2]
పబ్ కెమ్ 10313210
SMILES [Cd+2].[OH-].[OH-]
ధర్మములు
Cd(OH)2
మోలార్ ద్రవ్యరాశి 146.43 g/mol
స్వరూపం white crystals
సాంద్రత 4.79 g/cm3
ద్రవీభవన స్థానం 130 °C (266 °F; 403 K)
బాష్పీభవన స్థానం 300 °C (572 °F; 573 K) (decomposes)
0.026 g/100 mL
ద్రావణీయత soluble in dilute acids
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
hexagonal
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
−561 kJ·mol−1[1]
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
96 J·mol−1·K−1[1]
ప్రమాదాలు
US health exposure limits (NIOSH):
PEL (Permissible)
[1910.1027] TWA 0.005 mg/m3 (as Cd)
REL (Recommended)
Ca
IDLH (Immediate danger)
Ca [9 mg/m3 (as Cd)]
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
Zinc hydroxide,
Calcium hydroxide,
Magnesium hydroxide
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

కాడ్మియం హైడ్రాక్సైడ్ఒక రసాయన సమ్మేళనపదార్థం.ఇది ఒక అకర్బనరసాయన సంయోగ పదార్థం.కాడ్మియం, ఆక్సిజన్, హైడ్రోజన్ పరమాణు సంయోగంవలన ఈ రసాయన సంయోగ పదార్థం ఏర్పడినది.కాడ్మియం హైడ్రాక్సైడ్ రసాయన సంకేత ఫార్ములా Cd (OH) 2.నికెల్ కాడ్మియం బ్యాటరిల తయారీలో ఉపయోగించు అంశీభూత పదార్థాలలో కాడ్మియం హైడ్రాక్సైడ్ ముఖ్యమైన పదార్థం.

భౌతిక ధర్మాలు

[మార్చు]

భౌతిక స్థితి

[మార్చు]

కాడ్మియం హైడ్రాక్సైడ్ సంయోగ పదార్థం తెల్లని స్పటిక సౌష్టవం కల్గిన ఘనపదార్థం.స్పటిక సౌష్టవం అష్ట భుజ/కోణ నిర్మాణం.

అణుభారం

[మార్చు]

కాడ్మియం హైడ్రాక్సైడ్ సంయోగ పదార్థం యొక్క అణుభారం 146.43 గ్రాములు/మోల్[2]

సాంద్రత

[మార్చు]

సాధారణ ఉష్ణోగ్రత వద్ద కాడ్మియం హైడ్రాక్సైడ్ సాంద్రత 4.79 గ్రాములు/సెం.మీ3[2]

ద్రవీభవన స్థానం/ఉష్ణోగ్రత

[మార్చు]

కాడ్మియం హైడ్రాక్సైడ్ యొక్క ద్రవీభవన స్థానం 232 °C (266 °F; 403K) [3]

బాష్పీభావన ఉష్ణోగ్రత/మరుగు స్థానం

[మార్చు]

కాడ్మియం హైడ్రాక్సైడ్ యొక్క బాష్పీభవన స్థానం300°C (572 °F; 573K), ఈ ఉష్ణోగ్రత వద్ద కాడ్మియం హైడ్రాక్సైడ్ వియోగం చెందును.

ద్రావణీయత

[మార్చు]

నీటిలో చాలా స్వల్ప ప్రమాణంలో 0.026 గ్రాములు/100మీ.లీ కరుగును.సజల ఆమ్లాలలో కరుగును.

ఉత్పత్తి

[మార్చు]

కాడ్మియం నైట్రేట్ ను సోడియం హైడ్రాక్సైడ్ తో చర్య జరిపించడం వలన పదార్థాలలో కాడ్మియం హైడ్రాక్సైడ్ ను ఉత్పత్తి చెయ్యవచ్చును.

Cd(NO3)2 + 2 NaOH → Cd(OH)2 + 2 NaNO3

ఇతర కాడ్మియం లవణాలనుండి కాడ్మియం హైడ్రాక్సైడ్ ను ఉత్పత్తి కావించడం కొంత క్లిష్టమైన ప్రక్రియ.

రసాయన చర్యలు

[మార్చు]

జింక్ హైడ్రాక్సైడ్ కన్న కాడ్మియం హైడ్రాక్సైడ్ ఎక్కువ క్షార గుణం కల్గి ఉంది. కాడ్మియం హైడ్రాక్సైడ్ ను గాఢ కాస్టిక్ సోడా (సోడియం హైడ్రాక్సైడ్) తో చర్య జరిపిన Cd (OH) 42− అనయాన్ కాంప్లెక్స్ ను ఏర్పరచును. సైయనైడ్, థయోసైనైడ్, అమ్మోనియం ఆయాన్ ద్రావాలతో కాడ్మియం హైడ్రాక్సైడ్ చర్యవలన వాటి సంక్లిష్ట అయాన్ సమ్మేలాలను ఏర్పరచును.

కాడ్మియం హైడ్రాక్సైడ్‌ను వేడిచేసిన నీటిఅణువును కోల్పోయి కాడ్మియం ఆక్సైడ్ ఏర్పడును. వేడి చేసినపుడు ఈ సమ్మెలన పదార్థం వియోగం 130 °C వద్ద మొదలై 300 °C వద్ద ముగియును. ఖనిజ ఆమ్లాలతో కాడ్మియం హైడ్రాక్సైడ్ రసాయన చర్య వలన సంబంధిత ఆమ్ల కాడ్మియం లవణాలు ఏర్పడును

రసాయన చర్యల కారణంగా హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో కాడ్మియం క్లోరైడ్, సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్యవలన కాడ్మియం సల్ఫేట్, నైట్రిక్ ఆమ్లంతో కాడ్మియం నైట్రేట్ లను కాడ్మియం హైడ్రాక్సైడ్ ఉత్పత్తి చేయును.

ఉపయోగాలు

[మార్చు]

నికెల్-కాడ్మియం, సిల్వర్-కాడ్మియం విద్యుత్తూ నిల్వ బ్యాటరీలలో ఆనోడ్ వద్ద ఇది ఏర్పడును

2NiO(OH) + 2H2O + Cd → Cd(OH)2 + Ni(OH)2

కాడ్మియం హైడ్రాక్సైడ్‌ను కాడ్మియం ఆక్సైడ్కు ప్రత్యామ్నాయమగా పలు సందర్భాలలో ఉపయోగిస్తారు.కాడ్మియం ప్లెటింగ్, కాడ్మియం లవణాల ఉత్పత్తికి కాడ్మియం హైడ్రాక్సైడ్ ను ఉపయోగిస్తారు.[4]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు/ఆధారాలు

[మార్చు]
  1. 1.0 1.1 Zumdahl, Steven S. (2009). Chemical Principles 6th Ed. Houghton Mifflin Company. p. A21. ISBN 0-618-94690-X.
  2. 2.0 2.1 "Cadmium hydroxide". sigmaaldrich.com. Retrieved 2016-03-23.
  3. "CADMIUM HYDROXIDE". chemicalbook.com. Retrieved 2016-03-23.
  4. "CADMIUM HYDROXIDE" (PDF). nj.gov. Retrieved 2016-03-23.