Jump to content

H5P

వికీపీడియా నుండి
H5P
H5P Logo
అభివృద్ధిచేసినవారు H5P Team
మొదటి విడుదల జనవరి 25, 2013; 11 సంవత్సరాల క్రితం (2013-01-25)
సరికొత్త విడుదల 1.12
నిర్వహణ వ్యవస్థ Cross-platform
వేదిక PHP
రకము Content Collaboration Framework
లైసెన్సు MIT+[1]

H5P అనేది జావాస్క్రిప్ట్ ఆధారిత ఉచిత , ఓపెన్ సోర్స్ కంటెంట్ సహకార ఫ్రేమ్‌వర్క్. H5P అనేది HTML5 ప్యాకేజీకి సంక్షిప్త రూపం అంతేకాదు ఇది ప్రతి ఒక్కరూ ఎంతో సులభంగా ఇంటరాక్టివ్ HTML5 కంటెంట్‌ని సృష్టించడం, ఆ కంటెంట్ ని మళ్లీ ఉపయోగించడంమే లక్ష్యంగా రూపుదిద్దుకున్న ఒక సాఫ్ట్ వేర్ అప్లికేషన్ . [2] [3] నలభైకి పైగా H5P కంటెంట్ టైప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంటరాక్టివ్ వీడియోలు, ఇంటరాక్టివ్ ప్రెజెంటేషన్‌లు, క్విజ్‌లు, ఇంటరాక్టివ్ టైమ్‌లైన్‌, క్రాస్ వర్డ్ H5P కంటెంట్ టైప్స్ లో కొన్ని ఉదాహరణలు. ఇవన్నీ [4] H5P.org లో పొందుపరచబడి ఉన్నాయి. H5Pని 17 వేలకు పైగా వెబ్‌సైట్‌లు ఉపయోగిస్తున్నాయి. [5] [6] [7] జూన్ 2018లో Mozilla ఫౌండేషన్ MOSS ప్రోగ్రామ్‌లో భాగంగా H5Pకి ఆర్థికంగా మద్దతునిస్తుందని కోర్ టీమ్ ప్రకటించింది. [8]

ఈ ఫ్రేమ్‌వర్క్‌లో వెబ్ ఆధారిత కంటెంట్ ఎడిటర్, ఇతరులతో కంటెంట్ రకాలను పంచుకోవడానికి వీలుగా ఓ వెబ్‌సైట్, న కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ల కోసం (వర్డ్ ప్రెస్, డ్రూపాల్ వంటివి) ప్లగిన్‌లు , HTML5 వనరులను కలిపి ఒక బండిల్ చేయడానికి ఫైల్ ఫార్మాట్ లు ఉంటాయి.

వెబ్ ఆధారిత H5P ఎడిటర్ ద్వారా అన్ని H5P కంటెంట్ రకాలు ఆయా అప్లికేషన్‌లలో పలు మల్టీమీడియా ఫైల్‌లు , పాఠ్య కంటెంట్‌ను జోడించవచ్చు. అదనంగా కంటెంట్ రకాలు పలు ఎడిటింగ్ సామర్ధ్యాలను అందించే వివిధ రకాల విడ్జెట్‌లను సైతం అందిస్తాయి.

H5P.org అనేది H5P లైబ్రరీలు, అప్లికేషన్‌లు , కంటెంట్ రకాలను పంచుకునే భాగస్వామ్యులతో కూడిన ఒక సంఘటిత వెబ్‌సైట్. H5P అప్లికేషన్‌ దాని కంటెంట్ రకాలు అన్ని H5P అనుకూల వెబ్‌సైట్‌లలో ఒకే విధంగా పని చేస్తాయి. [9]

ప్రస్తుతం H5P నాలుగు ప్లాట్‌ఫారమ్ లతో ఇంటిగ్రేషన్‌ అయ్యే సామర్ధ్యం కలిగి ఉంది, అవి డ్రుపాల్, [10] వర్డ్ ప్రెస్ ., [11] టికి,,[12] మూడుల్ . [13] ప్లాట్‌ఫారమ్ ఇంటిగ్రేషన్‌లలో జనెరిక్ H5P కోడ్ అలాగే ఇంటర్‌ఫేస్ ఇంప్లిమెంటేషన్ తో పాటు ప్లాట్‌ఫారమ్‌లతో H5Pని ఏకీకృతం చేయడానికి అవసరమైన ప్లాట్‌ఫారమ్ నిర్దిష్ట కోడ్ ఉంటాయి. H5P, కనీస ప్లాట్‌ఫారమ్ నిర్దిష్ట కోడ్ ,కనిష్టంగా బ్యాక్ ఎండ్ కోడ్ ఉండేలా రూపొందించబడింది. చాలా వరకు కోడ్ జావాస్క్రిప్ట్ లో ఉంది. కొత్త ప్లాట్‌ఫారమ్‌లతో H5Pని ఇంటిగ్రేట్ చేయడాన్ని సులభతరం చేయడమే భవిష్యత్ లక్ష్యంగా కోడ్ రూపుదిద్దుకుంటోంది.

ఫైల్ ఫార్మాట్‌ లో మెటాడేటా ఫైల్, JSON ఫార్మాట్‌లో ఉంది. కంటెంట్ యొక్క పలు డిజైన్లకోసం ఉపయోగపడే లైబ్రరీ ఫైల్‌లు, టెక్స్ట్ ఆధారిత కంటెంట్ , కంటెంట్ ఫోల్డర్ JSON ఫార్మాట్‌లో నిల్వ చేయబడి ఉంటాయి. మల్టీమీడియా కంటెంట్ బాహ్య సైట్‌లలో ఫైల్‌లు లేదా ఫైళ్లకు లింక్‌లుగా నిల్వ చేయబడుతుంది. [14]

H5P యొక్క అత్యంత వినూత్నమైన ఉదాహరణలు బ్రాంచింగ్ సినారియో దృష్టాంత-ఆధారిత అభ్యాస అవకాశాలను సెటప్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది , AR స్కావెంజర్ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయకుండానే అగు మెంటెడ్ రియాలిటీని ఉపయోగించడానికి అనుమతిస్తుంది, కార్నెల్ నోట్స్ విద్యార్థులు తమ నోట్స్ ఇంకా తమ ఆలోచనలను (టెక్స్ట్, ఒక వీడియో లేదా ఆడియో ఫైల్) కార్నెల్ పద్ధతిని అనుసరించి నేరుగా జోడించడానికి వీలవుతుంది. ఈ డాక్యుమెంటేషన్‌ను తర్వాత తిరిగి పొందడానికి వీలవుతుంది మరొక కంటెంట్ రకం ఇమేజ్ ఛాయిస్‌లో ప్రత్యామ్నాయాలు ఇమేజ్‌లుగా ఉండే టాస్క్‌ను సృష్టించవచ్చు.


<br /> 2020లో జరిగిన ఒక సమావేశంలో చేసిన ప్రకటన తర్వాత, H5P [ [15] [1] ] OER హబ్‌ను అందుబాటులోకి తెచ్చింది [16] [2] .

H5P.org anEdi H5P యొక్క ప్రాథమిక మద్దతు వెబ్‌సైట్ . ఇక్కడ, H5Pని ప్రయత్నించవచ్చు; ఇది H5P ఆన్‌లైన్ మాన్యువల్‌ను , H5P సమాచారం, డాక్యుమెంటేషన్ , ఫోరమ్‌లు ఇంకా లివింగ్ రిపోజిటరీని హోస్ట్ చేస్తుంది. [17]

ప్రస్తావనలు

[మార్చు]
  1. "H5P is MIT Licensed". H5P.org. Retrieved 9 April 2015.
  2. "WordPress And H5P : The Future Of Rich Content?". WPMUDEV. Retrieved 9 April 2015.
  3. "H5P: An Open Source HTML5 eLearning Authoring Tool". elearningindustry.com. Retrieved 16 January 2018.
  4. "Content Types". H5P.org. Retrieved 16 January 2018.
  5. "H5P is a WordPress plugin for creating and sharing rich HTML5 content in your browser". Wordpress.org. Retrieved 16 January 2018.
  6. "Usage statistics for H5P - Create and Share Rich Content and Applications". drupal.org. Retrieved 16 January 2018.
  7. "Moodle plugins directory: Interactive Content – H5P: Stats". moodle.org. Retrieved 16 January 2018.
  8. "Mozilla supporting H5P". Retrieved 2018-07-22.
  9. "Create, share and reuse interactive HTML5 content in your browser". H5P.org. Retrieved 9 April 2015.
  10. "H5P - Create and Share Rich Content and Applications". drupal.org. Retrieved 9 April 2015.
  11. "How to upload and track H5P Content on WordPress with xAPI?". Next Software Solutions. Retrieved 20 October 2019.{{cite web}}: CS1 maint: url-status (link)
  12. "Tiki Wiki Content Management has native H5P integration". tiki.org. Retrieved 9 April 2015.
  13. "H5P is a Moodle plugin for creating and sharing rich HTML5 content in your browser". h5p.org. Retrieved 13 June 2016.
  14. "File Structure". h5p.org. Retrieved 9 April 2015.
  15. "The H5P OER HUB". h5p.org (in ఇంగ్లీష్). Retrieved 2020-12-23.
  16. "H5P Conference 2020". H5P Conference 2020 (in ఇంగ్లీష్). Retrieved 2020-12-23.
  17. "H5P forums". H5P.org. Retrieved 9 April 2015.

బాహ్య లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=H5P&oldid=3846533" నుండి వెలికితీశారు