Jump to content

Topic on వికీపీడియా చర్చ:ఫ్లో/Flow

రహ్మానుద్దీన్ (చర్చరచనలు)

స్థానికీకరణ పూర్తి కానిదే ఇలాంటివి వాడవచ్చా?

DannyH (WMF) (చర్చరచనలు)

(Sorry for posting in English:) రహ్మానుద్దీన్, now i see that you translated all the messages. I guess it takes two or three days for the translations to show up here?

వైజాసత్య (చర్చరచనలు)

ఎందుకు వాడకూడదు? (పై ప్రశ్న ఏ స్థాయిలో అడుగుతున్నారో నాకు అర్ధం కాలేదు) తెలుగు వికీపీడియాలో తెలుగులోనే ఉంటేనే వాడాలని ఏమైనా నియమం ఉందా అని ఆలోచిస్తున్నాను. లేదా, స్థానికీకరణ చేయకపోతే సరిగా పనిచేయదనా?

రహ్మానుద్దీన్ (చర్చరచనలు)

తెలుగు వికీపీడియా పై ఏదైనా కొత్త పరికరం/ఉపకరణం దిగుమతి చేసినపుడు, ఖచ్చితంంగా దాని గురించి ౧. అందరికీ తెలియపరచాలి ౨. స్థానికీకరణ/తెవికీ కి తగినట్టు మార్పులు చేయాలి ౩. దీన్ని పరీక్షించమని సభ్యులను ఆహ్వానించాలి పై మూడింటినీ నేను ఎఖో సూచనల వ్యవస్థను చేర్చేటప్పుడు చేసాను, అంతకు ముందు కొన్ని మూసలను స్థానికీకరణ చేయకుండా దిగుమతి చేసి వాడుతున్నపుడే కొందరు సభ్యులు నన్ను వారించారు. ఇలా చెయ్యవచ్చు, స్థానికీకరణ అవసరం లేదంటే నేను చాలా ఉపకరణాలు వాడాల్సినవి దిగుమతి చేసుకుని వాడుకుంటాను.

వైజాసత్య (చర్చరచనలు)

మీకు తెలీదనుకుంటా, ఈ వికీపీడియా ఇంటర్ఫేసు మెత్తం చాలా రోజులు ఆంగ్లంలోనే వాడాం. అలా అని మీ సూచనల్ని సరైనవి కావు అనట్లేదు. అందరికీ తెలియజేద్దామనే ప్రాజెక్టు పేజీ తర్జుమా చేసా, కొన్ని అనువాదాలు కూడా చేశా. అదే చేద్దామనే లోపే మీరు నా మీద విరుచుకుపడుతున్నారు. ఏం చేద్దాం? All being in Telugu is the best case scenario, that doesn't mean we cant use before that. infact, I thought using few days will give a good perspective of the context in which the messages are used so that I can better translate. All or None ఇదే మీ మొండితనమంటే, ప్రతిదానికి వితండవాదం చెయ్యటం తప్ప అర్ధం చేసుకోరేంటి. క్రింద నేను మొదటి సందేశంలో ఆహ్వానించింది అందరినీ వాడి చూడమనే.

రహ్మానుద్దీన్ (చర్చరచనలు)

వితండవాదం కాదు. నిర్బంధం బాబూ నిర్బంధం, ఇన్ని రోజులూ అంతా తెలుగులో ఉంటే తప్ప వాడకూడదనుకున్న అభిప్రాయం తో ఉన్నాను. అసలయితే చాలా వ్యాసాలు ఆయా మూసలు తెలుగులో లేవని వాడలేదు (ఉదాహరణకి బోటనీ పేజీల్లో డివ్జన్, సబ్డివిజన్ తెలిపే సమాచారప్పెట్టె) ఇక మీదట ఈ అపోహ లేదుగా, నాక్కావాల్సిన ఉపకరణాలు, నా వరకూ వాడుకోటానికి ఒక మార్గం సులువైందని మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా! మంగిడీలు.

వైజాసత్య (చర్చరచనలు)

మనది చిన్న వికీ, విలైనంతగా తెలుగులోకి మార్చాలి, ఎందుకంటే అది మనకు గర్వకారణమైన విషయం. ఖచ్చితంగా, ఫూర్తిగా తెలుగులోనే ఉంటేనే వాడాలన్నది సరైన పద్ధతి కాదు. ట్రాంస్లేట్ వికీ రాక ముందు, మొత్తం ఇంటర్ఫేజు ఇక్కడే స్థానికంగా అనువదించాల్సి వచ్చింది. అలాంటి ఒక నెలా, రెండు నెలలు కాదు, సంవత్సరాల తరబడి కొద్దికొద్దిగా తర్జుమా చేస్తునే ఉన్నాం. ఎందుకంటే కొన్ని సందేశాలు ఎక్కడ వాడబడుతున్నాయో, ఎందుకున్నాయో మొత్తం సైటు ఫంక్షనాలిటీ మొత్తం తెలుసుకుంటే గాని అవగాహనకు రావు. ఇక్కడ నేను సంయమనం కోల్పోయినందుకు నన్ను క్షమించండి

రహ్మానుద్దీన్ (చర్చరచనలు)

అంత పెద్ద మాటలెందుకు సర్! తెవికీకిక కలిసి కృషి చేద్దాము.

DannyH (WMF) (చర్చరచనలు)

There's a bug at Translatewiki that they're fixing now. When it's fixed, then we should see the translated messages show up here. I'm sorry that it's taking so long!

Arjunaraoc (చర్చరచనలు)
Visdaviva (చర్చరచనలు)

అర్జున గారు మీరు తెవికీలో మళ్ళీ సచేతనమవడం నాకు చాల ఆనందంగా ఉందండీ  :)

Arjunaraoc (చర్చరచనలు)

వికీసోర్స్ అభివృద్ధి చెందడం, గతంలో వికీలో నేను చేయాలనుకొని మిగిలిపోయిన పనులు కొంత ప్రేరేపించాయి. అందుకని మరల క్రియాశీలమయ్యాను.

Visdaviva (చర్చరచనలు)

Thank you DannyH for actively engaging with us!  :)

DannyH (WMF) (చర్చరచనలు)

Well, I'm doing the best I can with Google Translate. I'm still trying to figure out "నక్షత్రం క్రింద ఉన్న మూడు చుక్కలపై మూషికాన్ని తోలిచూడండి" :)

They're definitely working on https://phabricator.wikimedia.org/T92823 -- there have been some commits today. I'll keep checking...

DannyH (WMF) (చర్చరచనలు)

Okay, the Translatewiki script is working again, so the translated messages are showing up here. There are still some visible messages that haven't been translated.

We're going to do a better job of marking which messages are important, to make the translation job easier -- sorry it's not clear right now. Working with Telugu is helping me see how this works for languages that don't have a big translation team -- thanks for being patient while I'm learning. :)

"https://te.wikipedia.org/wiki/Topic:Sdg7znuqg28cqdm5" నుండి వెలికితీశారు