అనిల్ ఫిరోజియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనిల్ ఫిరోజియా

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
23 మే 2019
ముందు చింతామణి మాళవ్య
నియోజకవర్గం ఉజ్జయిని

వ్యక్తిగత వివరాలు

జననం (1971-07-14) 1971 జూలై 14 (వయసు 53)
ఉజ్జయిని, మధ్యప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు భూరేలాల్ ఫిరోజియా, జావేత్రి ఫిరోజియా
జీవిత భాగస్వామి సంధ్యా ఫిరోజియా
సంతానం 2 కూతుళ్లు
నివాసం 6, భకత్ నగర్, దుషేరా మైదాన్, ఉజ్జయిని , మధ్యప్రదేశ్
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

అనిల్ ఫిరోజియా (జననం 14 జూలై 1971) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉజ్జయిని నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

అనిల్ ఫిరోజియా భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2013 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తారాణా నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికై, ఉజ్జయిని డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ ఛైర్మన్‌గా పని చేసి, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఉజ్జయిని నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి బాబూలాల్ మాలవీయపై 3,65,637 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై డ్యూల్డ్ కులాలు & షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ సభ్యుడిగా, ఆహారం, వినియోగదారుల వ్యవహారాలు & సంప్రదింపుల కమిటీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కమిటీ సభ్యుడిగా పని చేశాడు.

అనిల్ ఫిరోజియా 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఉజ్జయిని నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మహేష్ పార్మర్ పై 375860 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై షెడ్యూల్డ్ కులాలు & షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ సభ్యుడిగా,రవాణా, పర్యాటకం & సంస్కృతిపై కమిటీ సభ్యుడిగా పని చేశాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. TimelineDaily (29 March 2024). "Anil Firojiya: Sitting MP Vies For A Second Term From Ujjain" (in ఇంగ్లీష్). Archived from the original on 18 August 2024. Retrieved 18 August 2024.
  2. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Ujjain". Archived from the original on 18 August 2024. Retrieved 18 August 2024.