అను ఇమ్మాన్యుయేల్
Appearance
అనూ ఇమాన్యుల్ | |
---|---|
జననం | అనూ ఇమాన్యుల్ 1997 మార్చి 28 |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2011, 2016-ప్రస్తుతం |
అనూ ఇమాన్యుల్ (జననం 1997 మార్చి 28) ఒక భారతీయ చలన చిత్ర నటి. ఆమె స్వప్న సంచారి అనే మలయాళ చిత్రం ద్వారా బాలనటిగా పరిచయమైంది.[1] ఆమె యాక్షన్ హీరొ బిజు(ആക്ഷൻ ഹീറോ ബിജു) అనే మలయాళ చిత్రం ద్వారా కథనాయికగా మారింది.[2]
కెరియరు
[మార్చు]అనూ అమెరికాలో జన్మించింది. ఆమె బాల్యం డల్లాస్, టెక్సాస్‌లో గడిచింది. ఆమె పాఠశాలలో చదువుతుండగా స్వప్న సంచారిలో నటించింది. ఆమె యాక్షన్ హీరొ బిజు అనే మలయాళ చిత్రం ద్వారా కథనాయికగా పరిచయమయింది. ఆ తరువాత ఆమె గోపీచంద్ సరసన ఆక్సిజన్ అనే చిత్రంలో నటించుటకు ఒప్పుకుంది.[3] ఆ చిత్ర చిత్రీకరణ సమయంలో ఆమె నానీ సరసన మజ్ను అనే చిత్రంలో నటించటానికి ఒప్పుకుంది. తెలుగులో మజ్ను సినిమా ముందుగా విడుదల కాగా, ఆమె పాత్ర, నటనకు అనూ చాలా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
నటించిన చిత్రాలు
[మార్చు]† | ఇంకా విడుదలవని సినిమాలను సూచిస్తుంది |
సంవత్సరం | చలన చిత్రం | పాత్ర | భాష | గమనికలు |
---|---|---|---|---|
2011 | స్వప్న సంచారి | అశ్వతి | మలయాళం | |
2016 | యక్షన్ హీరొ బిజు | బెనిట్టా | మలయాళం | |
మజ్ను | కిరణ్మై | తెలుగు | ||
2017 | కిట్టు ఉన్నాడు జాగ్రత్త | జానకి | తెలుగు | |
తుప్పారివాలన్ | మల్లిక | తమిళం | తెలుగులో డిటెక్టివ్‌గా అనువాదమైంది | |
ఆక్సిజన్ | గీతా | తెలుగు | ||
2018 | అజ్ఞాతవాసి | సుర్యకాంతం | తెలుగు | |
నా పేరు సూర్య | వర్షా | తెలుగు | ||
గీత గోవిందం | తెలుగు | అతిధి పాత్ర | ||
శైలజారెడ్డి అల్లుడు | అను రెడ్డి | తెలుగు | ||
2019 | నమ్మ వీట్టు పిల్లై | మాన్గని | తమిళం | |
2021 | అల్లుడు అదుర్స్ | వసుంధర | తెలుగు | |
మహా సముద్రం | తెలుగు | ద్విభాషా చిత్రం | ||
తమిళం | ||||
2022 | ఊర్వశివో రాక్షసివో | తెలుగు | [4] | |
2023 | రావణాసుర | కీర్తన | [5] | |
జపాన్ | తమిళ్ | [6] |
మూలాలు
[మార్చు]- ↑ SHREEJAYA NAIR (17 September 2015). "Anu Emmanuel back after study break, to be Nivin's pair".
- ↑ "Anu Emmanuel joins Action Hero Biju". 20 September 2015. Archived from the original on 8 ఫిబ్రవరి 2016. Retrieved 15 ఫిబ్రవరి 2018.
- ↑ "After Action Hero Biju Anu Emmanuel in Telugu Movie Oxygen". 18 December 2015. Archived from the original on 23 ఫిబ్రవరి 2017. Retrieved 15 ఫిబ్రవరి 2018.
- ↑ "Allu Sirish and Anu Emmanuel's romantic drama titled 'Prema Kadanta'". The News Minute. 31 May 2021.
- ↑ "Ravi Teja and Sushanth's film Ravanasura begins filming now". Telangana Today. Retrieved 19 January 2022.
- ↑ "Karthi's 25th film 'Japan' with Anu Emmanuel goes on the floors with puja". Outlook India. Retrieved 19 November 2022.